Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సహృదయ ప్రేమికునికి నివాళి | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 18,2021

సహృదయ ప్రేమికునికి నివాళి

సాహిత్యం ఒక కళ. దాని ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తామని సాహిత్యకారులు భావిస్తారు. దాన్ని సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగితే బాగుండని, అలా తీసుకువెళ్లే మనుషుల కోసం చూస్తారు. అలాంటి పనులు కూడా అందరూ చేయలేరు. నిబద్దత ఉన్న మనుషులే దాన్ని భుజానికి ఎత్తుకుంటారు. అలాంటి వ్యక్తి ''నాగళ్ల దుర్గా ప్రసాద్‌''.
మాది తెనాలి, మేం చెబితే వినాలి అనే మాటతో నాగళ్ల దుర్గా ప్రసాద్‌ చాలామందికి పరిచయం. నిజానికి ఇతను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహితీవేత్తలఅందరికీ బాగా పరిచయం. ఎందుకు పరిచయం అంటే, ఎంతోమంది పాతతరం రచయితలని ఈ కాలానికి పరిచయం చేసిన వాడు.
ఎందుకీ తలపోత, దుర్గా ప్రసాద్‌కి మాత్రమే ఎందుకింత క్రియాశీలత. శ్రీరామ గురుకుల పాఠశాలలో దాదాపు పదిహేనేళ్ళ పాటు పిల్లలని చూసి చూసి వాళ్ళతో ఉండి పోవడం వల్ల అతనికి పసితనం అంటుకుందా లేక కేవలం 15 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం వల్ల ఆ పసిమనసులో ఏర్పడిన అగాధంని పూడ్చుకోవడానికి, తాను ఎంచుకోవాల్సిన విషయం ఏదో తేల్చుకునేందుకు సాహిత్యం దోహదం చేసిందా అనే చాలా ప్రశ్నలకి తన కార్యక్రమాల ద్వారా జవాబులు చెప్పాడు.
దుర్గాకి తెలుగు సాహిత్యంతో చాలా సంబంధం ఉంది. ప్రాచీన సాహిత్యాన్ని, ఆ తర్వాత వచ్చిన ధోరణులు, తెలుగు కథ, కవిత్వం, నవల, విమర్శల మీద సాధికారిక పట్టు ఉంది. అస్తిత్వ ధోరణులు మీద తనకంటూ ఒక సదభిప్రాయం ఉన్న వ్యక్తిగా కనబడతాడు. కానీ ఎక్కడా ఆన్‌ ద రికార్డ్‌గా తన అభిప్రాయాన్ని వెల్లడి చేయలేదు కానీ, మిత్రుల మధ్యన సంభాషణల మధ్యలో మాత్రం తన అభిప్రాయాల్ని సూటిగా స్పష్టంగా చెప్పేవాడు. ఆయా వర్గాల పట్ల తనకున్న అభిప్రాయం తాను చేసిన కార్యక్రమంలో కనబడింది. తాను ఏర్పాటు చేసిన ''ప్రజ్వలిత'' సంస్థ నుంచి ఇచ్చిన అవార్డులు, లేదా చేసిన సాహిత్య కార్యక్రమాలలో తన ఆలోచనల్ని ప్రతిబింబిచే విధంగా చేశాడు. కేవలం ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి మాత్రమే, తాను కట్టుబడి ఉండలేదనే విషయాన్ని క్రియా రూపంగా చేసి చూపించాడు. ప్రజ్వలిత అనే ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా అతను ఒక అకాడెమీనో లేదా ప్రభుత్వమో లేక చాలా ఎక్కువ నెట్వర్క్‌ ఉన్న సంస్థలు చేసే పనులు కన్నా ఎక్కువ పనులు చేశాడు. ప్రతీవారం ఒక సాహితీ ప్రముఖుడిని తెనాలి వాసులకి పరిచయం చేశాడు. అదొక్కటే కాక ఆ కార్యక్రమాన్ని తెనాలి చుట్టుపక్కల ఉండే పల్లెటూళ్లలో సిటీ కేబుల్‌ ద్వారా ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ద్వారా పల్లెటూళ్ళలోకి కూడా సాహిత్యాన్ని తీసుకువెళ్లిన ఘనతని కూడా నాగళ్ళకి ఆపాదించవచ్చు. 2014లో ప్రారంభం కాబడింది ప్రజ్వలిత. అప్పటినుంచి ఆ సంస్థ క్యాలెండర్‌ ఏనాడు ఖాళీ లేదు. తెలుగు సాహిత్య చర్చల్లో ఎప్పుడూ ప్రజ్వలిత ఉంది. అందుకు ముఖ్య కారణం దుర్గన్న మాత్రమే. కేవలం సాహితీవేత్తలకేకాక మేలిమి మాటల్ని సంపాదకీయాలుగా రాసిన ఎడిటర్‌ మిత్రులకు సైతం తన అవార్డ్‌లని ఇచ్చి తనకు అక్షరం పట్ల ఉన్న మక్కువ చాటుకున్నారు.
పిల్లలు అంటే బోలెడంత మమకారం ఉంది దుర్గన్నకి. గత ఏడాది, సాహిత్యంలో వివిధ భావనలు యువతకి అర్ధం కావాలి అన్న సదుద్దేశంతో ఒక రోజు సదస్సు ఏర్పాటు చేసి, అందులో కవి శివారెడ్డికి ప్రజ్వలిత పురస్కారం ఇచ్చి నెల, ఎన్‌.వేణుగోపాల్‌, ప్రో.రఘు, మల్లీశ్వరి, క్రాంతి శ్రీనివాసరావు వంటి ప్రముఖుల చేత పిల్లలకి వివిధ భావనల మీద సెమినార్‌ పెట్టించి వాళ్ళతో ముఖాముఖి నిర్వహించారు. పిల్లల్లో ఇంకా ఆసక్తి కలిగించాలని, వాళ్ళని మధ్యమధ్యలో కాస్త ప్రశ్నలతో లేదా నవ్వులతో వాళ్ళని ఉత్తేజభరితం చేసేవారు. వాళ్లలో ఇప్పుడు ఎంతమంది వాళ్ల హదయాలని అర్థం చేసుకున్న మనిషి దూరం అయ్యాడని రోదిస్తూ ఉంటారో.
తెనాలి సాంస్కతిక కేంద్రం, ఆ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకువెళ్లారు దుర్గా అన్నా. తన సొంత నిధులతో ఒక భవనం నిర్మించి అందులో ఎంతో మంది కళాకారుల చిత్ర పటాలు సేకరించి ఆ హాలు నిండా అలంకరించారు. ఎంత నిబద్దత ఉండాలి ఆ పని చేయడానికి, ఎంత ప్రేమ ఉండాలి సాహిత్యకారుల మీద. కేవలం ఇది అభిమానం ఒకటే ఉంటే సరిపోయే అంశం కాదు అందుకు మనసులో దఢమైన అభిప్రాయం ఉండాలి. ఎలాంటి విమర్శ వచ్చినా తట్టుకుని ఎదురు నిలబడగలిగే ధైర్యం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడు దుర్గా అన్నా. ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా, ఎన్నో కవితా సంపుటాల్లో కవితా పాదాలు నోటికి కంఠతా వచ్చు, వాటిని సందర్భోచితంగా వాడడం తెల్సు, పద్యాలు, వాటి అర్థాలు, రాగాలు వాటి గానసరళి ఇలా ఒక్కటేమిటి ఎన్నో సాహిత్యపు పరిమళాలు ఉన్న వ్యక్తి. దుర్గా గారితో పాటుగా ఒక సాంస్కతిక బందం ఎప్పుడూ వెంటే ఉంటుంది. అందులో వాయిద్యం, పద్యం పాడే వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈయనతో ప్రయాణం ఎంత దూరం అయినా విసుగు అనిపించదు. అందుకే దూర ప్రాంతాల సాహితీ సభలకు దుర్గ అన్న మాత్రమే కాకుండా ఆయనతో ఒక బందం లాగా కొంత మందితో కలిసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సమూహాలన్ని రెక్కలుతెగిన పక్షుల్లా విలవిల లాడుతున్నారు. దుర్గన్న నిర్యాణం తెలియగానే ప్రజ్వలిత వాఉట్సప్‌ గ్రూప్‌ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు, కళాకారులు ఎంతో ఆర్తితో చేసిన కామెంట్స్‌ అందుకు ఉదాహరణ. నిజానికి సాహిత్యాన్ని సజన చేసే వారికి గుర్తింపు గౌరవం దక్కుతాయి. కాని అతి కొద్ది మందికే దాన్ని ప్రజాపక్షం చేసినందుకు కూడా సాహితీ వేత్తలకు దక్కే గౌరవం దక్కుతుంది. దుర్గా అన్నకు కూడా అలాంటి కొన్ని గొప్ప గౌరవాలు దక్కాయి. సుప్రసిద్ధ ''తానా పురస్కారం'', ఏఎన్నార్‌ అవార్డు, మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్‌ వారు ఖమ్మంలో దుర్గన్న చేస్తున్న క్రియా పూర్వక సాహితీ సేవకు సన్మానం చేసి గౌరవించుకున్నాయి. ఇంకా గుర్తింపు దక్కవలసిన మనిషి ఇదిగో ఇలా ఇప్పుడే వస్తా అని చెప్పి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయాడు.
ఇంత సాహితీ సేద్యం చేసిన దుర్గాప్రసాద్‌. సాహిత్యం వైపు రాలేదా అంటే వచ్చాడు. పదిహేడేళ్లకి తండ్రి చనిపోతే ఆ దుఃఖాన్ని మొత్తాన్ని కాగితం మీద పారబోసుకున్నాడు. తండ్రిని కవితదీరా హత్తుకున్నాడు.
''గతాన్ని మరవడానికి పసితనం కాదు
తెలియని వయసుకాదు
మరిచే ఆలోచన మనసుకు లేదు
మరో ఆలోచన మనసుకు రాదు
కాదులే ఇది స్వప్నం
అవునులే ఇది నగ సత్యం.''
తన హదయం పాషాణం కాదు నర నరానా తన్ను నైరాశ్యం ఆవహిస్తుంటే ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది అని మిణుకు మిణుకుమంటున్న భవిష్యత్‌ని తలచుకుని కుమిలిపోతూ గుండెని చిక్కబట్టుకుని రాసిన వాక్యల్లా అనిపిస్తాయి. అతని ఆవేదనలో అలంకారాలు, అతిశయోక్తుల్తో సంబంధం లేదు ఉండదు. మనం ఎక్కడా ఒక్క మాట కూడా కత్రిమమైన పదాన్నో పదజాలాన్నో చూడం. ఎందుకంటే అది అతని హదయాలాపన. ఇది మాత్రమేకాక ఎన్నో అముద్రిత కవితా పాదాలు ఉన్నాయి. అవన్నీ పరిశీలనగా చూస్తే ఏ గొప్ప కవికి తీసిపోని వాక్యల్లా ఉంటాయి. ఒకవేళ తానే కవిత్వం రాసి ఉంటే కనక, తనకంటూ ఒక వాస్తవిక శైలిని ఏర్పర్చుకునే వారు. కానీ ఆయన మాత్రం తాను కేవలం ఒక మేలిమి రకం పాఠకుడిగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేసాడు, అలాగే ఉన్నాడు. సాహిత్యాన్ని పోషించిన దేవరాయలు లాగా చిరకీర్తిని సంపాదించాడు. తెనాలి నుంచి యావత్‌ తెలుగు నేలమీద తానొక రోల్‌ మోడల్‌ లాగా నిలబడ్డాడు. సాహిత్యాన్ని లేదా ఏ కళనైనా వారసత్వంగా తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు కానీ, ఇలా క్రియరూపంలో ఉన్నదాని ఎవరు భుజాన వేసుకుంటారు, తీసుకున్నా సరే తన కమిట్మెంట్‌ ఉంటుందా, తన ప్లానింగ్‌ ఉంటుందాని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకునే విధంగా పనిచేసిన నాగళ్ల దుర్గా ప్రసాద్‌ మిగిల్చిన పనిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలా అని ఆలోచన చేయవలసిన పని ఒకటి మిత్రులుగా మా మీద ఉంది. ఇంత సేవా తత్పరుడుకి నివాళిగా ఒక జాతీయ స్థాయి అవార్డుని కూడా మిత్రులు ఆలోచన చేస్తే బాగుంటుంది. తాను అనారోగ్యంగా ఉండి కూడా ఒక కరోనా జంటకి తనవంతు సాయం అందిస్తూ తాను ఆ బారినపడి చివరకి మనకి అందనంత దూరాల తీరానికి వెళ్లిపోయిన మహా మనిషికి కన్నీటి నివాళి ఇవ్వడం మన అందరి కర్తవ్యం.
- అనిల్‌ డ్యాని, 9703336688

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మార్క్సిస్టు విమర్శకుడు, కథా రచయిత సింగమనేని నారాయణ
శ్రీశ్రీ వెంట నేను
సత్యం శివం సుందరం
ఖబడ్దార్‌ పాలకులారా
సాహితీ వార్తలు
నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు??
కొత్త తీర్పు రికార్డు
బురద పాదాలు
హైకూలు
కవి కాలంతో పరిగెత్తాలి
బాల సాహిత్య సంపన్నుడు వాసాల నర్సయ్య
ఆగిన అంతశ్చేతన
ఒక జ్ఞాపకం
పల్లె బస్సు
పువ్వులా విచ్చుకునే వరకు
రైతు స్టేటస్‌..!
SORRY DEAR..!?
చేరా రచనల కోసం..
'ఏ క్రిస్మస్‌ కెరోల్‌' చార్లెస్‌ డికెన్స్‌ నవల : ఒక పరిశీలన
భాషాసాహిత్యవేత్త పోరంకి దక్షిణామూర్తి
పసునూరి పాటకి ఎర్ర ఉపాలి పురస్కారం
ఉన్నారా...?
సాహితీ వార్తలు
కన్నీటి చుక్కలు
అక్షర సంఘీభావం..!
ఆత్మను అమ్మకు
కొత్తవాక్యాల కవిత్వం 'ఇన్‌బాక్స్‌'
అచ్చమైన కవి
కంచంలో మేకులు..!
లుప్తమౌతున్న విలువల వేదనా స్రవంతి

తాజా వార్తలు

06:06 PM

షర్మిల ఎదుగుదలను తట్టుకోలేకపోయిన రేవంత్ : దేవెందర్ రెడ్డి

06:02 PM

పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుపై జగన్ సమీక్ష

05:55 PM

గృహ రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ

05:48 PM

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

05:41 PM

మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి

05:30 PM

న్యాయవాదుల హత్య కేసు.. పార్వతీ బ్యారేజీలో కత్తి లభ్యం

05:22 PM

బొల్లారంలో మహిళ దారుణ హత్య

05:12 PM

అమిత్ షాపై పరువునష్టం కేసు వేస్తా : మాజీ సీఎం

05:04 PM

మెదక్‌ జిల్లాలో చిరుత కలకలం

04:56 PM

యువతుల కొత్త తరహా దందా.. పోలీసుల రాకతో వెలుగులోకి..

04:42 PM

మహబూబ్​నగర్​లో గ్రనేడ్ కలకలం..

04:33 PM

కాలేజీ బస్సు బోల్తా..50మంది విద్యార్ధులకు గాయాలు

04:19 PM

దారుణం.. యువతి కాళ్లు చేతులు కట్టేసి ఓ తోటలో...

03:57 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

03:51 PM

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

03:41 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

03:33 PM

పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్​ రావు దంపతుల హత్య : జీవన్ రెడ్డి

03:21 PM

న్యాయవాదుల హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

03:13 PM

టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

03:07 PM

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

03:01 PM

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాన్సీ సెహ్ గల్

02:58 PM

బెంగాల్​లో 8 దశల పోలింగ్​పై సుప్రీంలో పిటిషన్..

02:37 PM

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరికి గాయాలు

02:15 PM

ఈటల, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు..

02:08 PM

ఎన్నికల కోడ్‌ వల్లే చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు..

01:57 PM

ఘోర ప్రమాదం.. టీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

01:51 PM

నటి హిమజకు లేఖ రాసిన పవన్ కళ్యాణ్

01:48 PM

పీఎఫ్ ఖాతాదారులకు షాక్..!

01:43 PM

ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల‌బుల్: కేటీఆర్​

01:35 PM

ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ పొడగింపు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.