Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టిని నమ్మిన మౌనదీక్షితుడు వాడు
కాలం పలువిధాల కసిరినా..
విపత్తులు కొత్తఎత్తులతో చిత్తు చేసినా..
నిస్వార్థంగా మట్టినే నమ్మినోడు వాడు.!
వలపలదాపలు చుట్టుముట్టినా
అప్పుల కుప్పలు దహించినా..
బురదమన్నును ..స్వేదజలాన్ని
లేపనాలుగా పూసుకుంటూ..
నాగలికర్రుని..అరకమేడిని వదలడువాడు.!
నిరంతర రూధిర సింహనాదమై
అడుగుముందుకేసే ధరనిపుత్రుడు వాడు.!
గొప్పగా చెప్పే వాగ్ధానాలలో
గోడలనంటేసుకున్న సూక్తులలో
కోతల రాజ్యపు
ఒట్టి చేతుల
మట్టి మారాజు వాడు
చట్టాలు హక్కులన్నీ కాలరాస్తూ..
దళారీల చుట్టాలై కొమ్ముకాయడాన్ని
ఉద్యమమై ప్రశ్నించిన ప్రతీసారి..
రోడెక్కిన పెయిడ్ ఆర్టిస్ట్ పిలువబనా..
హక్కులకై గొంతెత్తి నిలదీసినపుడు
ఉగ్రవాదులుగా ముద్రపడినా..
నలుగురి శ్రేయస్సుకై
మట్టినేనమ్మిన మట్టి మనిషివాడు
ఉనికి సంరక్షణకై..
మద్దతు ధరల సాధనకై..
నడుంకట్టి..
మట్టి గుండెల తెగువ చూపిన
ఎముకలు కుళ్ళిన- వయస్సు మళ్ళిన
వద్ధుల్లారా...
రక్తం మరిగే-రోషం పొంగే
యువకుల్లారా...
చలిగాలుల బెదిరింపులు
నీటిఫిరంగుల ఎదురుదాడులు
ఎండ వానలకెండి తడిసిన
మీ తనువుల ముందు
పిల్ల పిచుకలు..
సాగాలి ఈ పోరాటం
ఉక్కుపాదల చట్టాలను
నిలువరించే ఉద్యమంగా
కొనసాగాలి ఈ బిగిపిడికిళ్ళు
లక్ష్య సాధనా.. సంకల్పదీక్షతో
ఇదే హలం వీరులకు
నా కలం తెలిపే..
అక్షర సంఘీభావం... సాక్షర సంఘీభావం....!
- గుడిసె.రాజశేఖర్,
9885717740