Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్కు పాదాలకు
మేకులో లెక్కా?
ఉక్కు హృదయాలకు
బెదిరింపులతో చిక్కా?
ఉక్కు సంకల్పాలకు
విజయమే పక్కా
రెండు కన్నీటి చుక్కలే కదా
రైతు సామ్రాజ్యాన్ని
చైతన్య పరిచింది
రెండు కన్నీటి చుక్కలే కదా
దమనకాండకు
చుక్కలు చూపించింది
సత్యం పునాదుల నుంచి
పుట్టిన కన్నీటి చుక్కల ఉదతిని
ఏ జలఫిరంగులు తట్టుకుంటాయి?
మట్టిలో పనిచేసే వాళ్ల
మెదళ్లు ఆలోచిస్తాయా అనుకుంటే
ఏసీ గదుల్లో సేదతీరుతున్న కడుపులను
నింపుతున్నయి ఆ మెదళ్ళే కదా?
ప్రయాణం ఒక్క అడుగుతోటే మొదలవుతుంది
ఉద్యమ ప్రయాణం కూడా అంతే
రైతులంటే ఒక రాష్ట్రం వాళ్ళు కాదు
ఈ దేశానికి ప్రాణవాయువులు
ఒకటి రెండు సింహాలు గర్జిస్తేనే
18 నెలలు ఆగుతామంటున్నారు
దేశమంతా గర్జించే రోజు
తొందరలోనే ఉంది
వాళ్లు టెర్రరిస్టులు కాదు
వేర్పాటువాదులు అంతకన్నా కాదు
ఈ దేశానికి సైనికులను
ఇచ్చిన త్యాగమూర్తులు
కాశీలో అన్నపూర్ణమ్మకు తల్లిదండ్రులు
అబద్ధాల జెండాలు పట్టుకుని
సోషల్ మీడియా మీద
ఊరేగడం వారికి తెలియదు
బంధించబడ్డ మీడియా కూడా
రేపో మాపో వారిని భుజాలకెత్తుకోవాల్సిందే
పెళ్లి చేసేటప్పుడు
పిల్ల... పిల్లగాండ్ల ఇష్టాలను పాటించే
ప్రజాస్వామ్య సంస్కతి మనది
సందర్భం ఏదైనా
సంప్రదాయం పాటించకపోతే
పరాభవం తప్పదు
మందబలం అధికారం
అందిస్తుందేమో కానీ
అధికారాన్ని నిలబెట్టేది
కుటిలత్వం లేని బుద్ధిబలమే
విలువలు లేకుండా రాజకీయాలు
నిలబడతాయేమో
రైతులు లేకుండా
ఏ దేశము నిలబడలేదు
ఉద్యమాలను
ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్లే
గుర్తించగలరు... గౌరవించగలరు
మిగతా వాళ్ళకు
కొంతకాలం పట్టవచ్చు
ఆలస్యం విషంగా
మారేలోపు గుర్తించగలిగితేనే
మాతలకు మాత
సకల సంపత్సమేత
భరతమాతకు విజయం దిగ్విజయం
- ఘనపురం దేవేందర్
90300 33331