Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ భూమికి ?సమాజానికి
మధ్య నీనెక్కడో వేలాడుతున్నవాణ్ణి
వొక గాయానికి ?పసరు మందుకు
మధ్య నీనిప్పుడు విలవిలలాడుతున్నవాణ్ణి
మూఢత్వం మూర్ఖత్వానికి
మధ్య నీనెప్పటికి నలుగుతూనేవున్నవాణ్ణి
చేపితే నమ్ముతావో లేదో తెలియదు కానీ
ఈ ప్రేమలేని ప్రపంచంలో మనిషికోసం
ఓ పిడికెడు ప్రేమను కలకంటున్నవాణ్ణి.
వొక వైపు రాజ్యం గుండెలమీద
చావదేబ్బలుకొడుతుంటే
బిగించినపిడికిలిని వదలని వాణ్ణి
మరొక వైపు ఆధిపత్యం గొంతుపిసుకుతుంటే
మట్టిని పిసుకుంటున్న వొట్టి భగప్రేమికుడ్ని
నిజానికి దుఃఖం ప్రేమలో పడిపోయి
దుఃఖిస్తున్న వాణ్ణి.
పాతబడిపోయిన గోడలకు
కొత్త పెయింటింగ్ వేసుకుంటూ
గుండెల్లో కలల లైట్లను
వెలిగించుకుంటున్న వాణ్ణి
చీకట్లోజీవిస్తూ నాలుగు వెలుగువాక్యాల్ని
రాసుకుంటున్న వాణ్ణి
బట్టల్ని పిండుకుంటూ ఊహల్లో
దేశాన్ని కడుగుతున్న వాణ్ణి
ఇల్లు ఊడుస్తూ దేశాన్ని
శుభ్రం చేస్తున్న అనుకొనే వాణ్ణి
నీతిగా నేనే బతకకుంటే
దేశమేట్ల నిజాయితిగా
బతుకీడుస్తుందని అనుకుంటున్నవాణ్ణి
ఈ జనారణ్యంలో ఒక కొత్తమనిషిని
ఉహించుకుంటున్నవాణ్ణి
కనపడని ఆ విమానాల నవ్వుల్ని రాసుకోలేక
కనపడుతున్న ఈ ఆకలిభారత దేశాన్ని
చూస్తూ గర్విస్తున్న వాణ్ణి
నేను ఏడిస్తేనైనా
ఈ లోకం ఏడుస్తుందని
ఆ ఏడుపుల్లో దేశం కడగబడుతుందని
గట్టిగ నమ్ముతున్నవాణ్ణి
మళ్ళీ చెప్తున్నా
మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటా
స్వారీ డీయర్
మతం ,కులం అజ్ఞానాంధకారంలో
ఈ దేశం చాలా వెనకబడిపోయిందని
నవ్వుతునందుకు
ముందుకెళ్లాడానికి వెనకాడుతుందని
సిగ్గుపడుతునందుకు.
- పేర్ల రాము,
9642570294