Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎగిసిపడింది ఓ ఉద్యమం
దోచుకునే వ్యవస్థ మారాలని..
అదరక బెదరక లొంగక సాగుతోంది
నల్ల చట్టాలను ఉపసంహరించాలని..
ఎవరి కోసం ఎందుకోసం ఎవరడిగారు
ఈ చట్టాలు కావాలని !!?
ఢిల్లీ గద్దెపై ఆసీనులైన పెద్దలారా మీకు
కనబడట్లే రైతు ఆత్మఘోష ?
వినబడట్లే రైతు గుండె భాష ?
కని విని ఎరగనట్టు కాకమ్మ కథలు చెబుతున్నారా!!?
నాగలి విడిచి నాలుగు రోడ్లపై నిల్చున్నాడు..
గొడ్డు గోధను మరిచి గోడు వెళ్లబోసుకుంటున్నాడు..
చేను చెలకలకు దూరమై చేతులెత్తి వేడుకుంటున్నాడు..
చెమట చిందించే వాడు మీకు చులకనా ??
పిడికిలి బిగించితే మీ పదవి ఉంటదా ?
నిరసన జ్వాల మిమ్ము దహించివేయదా ?
రైతు దీక్ష జనసంద్రమై మిమ్ము ముంచివేయదా?
ఖబడ్దార్ పాలకులారా ...
కార్పొరేట్ కు కొమ్ము కాయకు
కర్షకుల వైపు కాస్త కన్నెత్తి చూడు..
రైతే రాజని గొంతెత్తి అరుస్తావ్ కధ
నేడు ఎందుకీ శిక్ష !!?..
రైతే దేశానికి వెన్నుముక అంటావ్ కధ
నేడు ఎందుకీ గోస !!?..
ఇకనైనా కన్నుతెరిచి రైతు గాథ చూస్తారో !!
రైతుల ఉసురు తగిలి గద్దె దిగుతారో
తేల్చుకోండి ఓ పెద్ద మనుషుల్లారా ...
- మహేష్ వేల్పుల,
9951879504