Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శ్రీశ్రీ వెంట నేను | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Mar 01,2021

శ్రీశ్రీ వెంట నేను

శ్రీశ్రీ అనే రెండక్షరాలు వింటే మనసు పొంగిపోతుంది. కవిత్వం అంటే ఏమిటో తెలియని నా విద్యార్థి దశలో శ్రీశ్రీ కవిత్వం పాటల్లా నా ముందు వాలాయి. 'మహాప్రస్థానం' పుస్తకాన్ని ఎవరి చేతిలో చూసినా అదేదో అద్భుతాన్ని చూసినట్లు చూస్తూనే ఉండిపోయేవాడిని. శ్రీశ్రీ గురించి, శ్రీశ్రీ కార్యకలాపాల గురించి, కవిగా ఆయన ఎంతటి మహా కవో, ఎవరు మాట్లాడినా వళ్ళంతా చెవులు చేసుకుని వినేవాడిని. ఇంటర్‌ మీడియట్‌ (1978 - 80) కొత్త గూడెంలో చదువుకొనేప్పుడు మా పక్క రామచంద్రా కాలేజి ఫంక్షన్‌కు జ్వాలాముఖి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. ఆయన ఉద్వేగభరిత ప్రసంగం, మధ్య మధ్యలో శ్రీశ్రీ కవితల్ని వల్లె వేయడం, ప్రసంగానికి ఇంత అద్భుతమైన శక్తి వుందా అన్నట్లు ఆశ్చర్యపరిచినా శ్రీశ్రీ కవిత్వం విషయంలో మాత్రం నాకు ఆసక్తి పెరిగింది.
ప్రసంగాన్ని తిరిగి ఒప్పచెప్పలేను, కాని శ్రీశ్రీ కవితల్ని మాత్రం ఆయన మాటల్లో విన్నంతవరకు పెద్ద గొంతుతో పాడటం మొదలుపెట్టాను. 'మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది'- నాలోకి అలా శ్రీశ్రీ ప్రవేశించాడు.
ఇంటర్‌ పరీక్షల్లో తప్పాక, తిరిగి మా ఊరు వెళ్ళలేక కొత్తగూడెంలోని సింగరేషి కాలరీస్‌ యూనియన్‌ ఆఫీసులో (సి.ఐ.టి.యు అనుబంధం) ఆఫీసు బారుగా చేరాను. తెల్లారగట్ల ప్రజాశక్తి దినపత్రికలు పంచడడం, పగలంతా ఆఫీసు బారుగా పని చేయడం, రాత్రిళ్ళు ఆఫీసులో పడుకోవడం... అక్కడే టేబుళ్ళ మీద దరువేసుకుంటూ పాటలు నేర్చుకోవడం- రెండేళ్ళ పాటు ఇలా సాగాక ఇంటర్‌ పూర్తయింది. పాట మాత్రం అదనంగా నాకు దక్కింది. కంజిర వాయిస్తూ ఊరేగిం పుల్లో, మహాసభల్లో, విద్యార్థి సంఘాల ఎన్నికల్లో శ్రీశ్రీ కవితల్ని పాటలుగా పాడేవాడిగా గుర్తింపు పొందాను. పుచ్చలపల్లి సుందరయ్య, మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, సీతారాం ఏచూరి వంటి వారి ముందు శ్రీశ్రీ కవితల్ని గానం చేసే అరుదైన అవకాశం కలిగింది. ''పతితులారా... భ్రష్టులారా... భాధా ర్పదష్టులారా.. ఏడవకండి, ఏడవకండీ''... అనే పాటను రాష్ట్ర మహాసభలో ఉద్వేగంగా పాడి వేదిక దిగుతున్నప్పుడు మోటూరు హనుమంతరావు గారు గుండెలకు హత్తుకున్న సంఘటనలెప్పటికీ మర్చిపోలేను. ఖమ్మంలో (1983?) జరిగిన ఎస్‌.ఎఫ్‌.ఐ. రాష్ట్ర మహాసభల్లో శ్రీశ్రీ పాటల్ని కంజిర దరువుతో పాడినపుడు అప్పటి ఆలిండా ఎస్‌.ఎఫ్‌.ఐ. నాయకుడు సీతారాం ఏచూరి ఇచ్చిన అభినందనలు ఎన్నటికీ మరువలేను. ఆ సభల్లో మహబూబ్‌నగర్‌ నుంచి ప్రతినిధిగా పాల్గొన్న నేటి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అప్పటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూన్నప్పుడు ఎంతో గర్వంగా అన్పిస్తుంది.
శ్రీశ్రీ పాటలు పాడటం వల్ల నాకు కలిగే ఆనందం ఒక ఎత్తైతే, శ్రీశ్రీ పాటలు పాడటం వల్లే నా జీవితం మలుపులు తిరిగిందనేది మరో వాస్తవం. ఇది విచిత్రంగా అనిపించవచ్చు కానీ, వాస్తవమని నా జీవితమే చెబుతుంది. ఇంటర్‌ పాసై డిగ్రీ చదవాలని వున్నా, అంత స్తోమత లేని దశలో మా కార్‌పల్లిలో కమ్యూనిస్టు కుటుంబంగా వున్న కె.యల్‌.నరసింహా రావుగారు, దుర్గాదేవిగారు నా శ్రీశ్రీ పాటలు విని, నా గురించి తెలుసుకుని డిగ్రీ చదివించడానికి ఏర్పాటు చేశారు. వారి కుటుంబంలో నాకు మూడవ కొడుకుగా స్థానమిచ్చారు. మా అమ్మ కొండపల్లి దుర్గాదేవి నా పాటలు విని ఎంత మురిసిపోయేదో, ఒకసారి హురాబీని పిలిచి, 'వీడు నా దగ్గరనే వుంటాడు బూబమ్మ, ఎంత మంచి కొడుకును కన్నావ్‌' అని అన్న ఆ మాటలు ఇవాళ్టికి ఆమె ముందు కృతజ్ఞతతో మోకరిల్లేట్లు చేస్తాయి. అలా శ్రీశ్రీ పాటల వల్ల డిగ్రీ, పి.జి. వరకు చదువుకునే అదృష్టం కలిగింది. శ్రీశ్రీ సమాజాన్ని ఎంత మార్చాడో ఏమోకాని నా జీవితాన్ని గొప్ప మలుపు మాత్రం తిప్పాడు.
డిగ్రీ, పీజీలు చదువుతున్నపుడు ఖమ్మం, హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేయడం, శ్రీశ్రీ పాటలు పాడటం, దాని వల్ల వచ్చిన గుర్తింపు అంతా యింతా కాదు. విద్యార్థి మహాసభల కోసం, విశాఖ, తిరుపతి, గుంటూరు, విజయవాడ వంటి ప్రదేశాలు వెళ్ళడం, శ్రీశ్రీ పాటలు పాడటం నేను ఎన్నడూ మరిచిపోలేని అనుభవాలు. ఆరుద్ర ముందు విశాఖలో పాడటం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ సభలో ఎన్టీఆర్‌, ఆరుద్ర వంటి వారి సమక్షంలో శ్రీశ్రీ గీతాల్ని ఆలపించడం, వారి మెచ్చుకోలు ఇవన్నీ శ్రీశ్రీ వల్ల నాకు లభించిన జ్ఞాపకాలు.
ఇంకో ముఖ్య విషయం, ఎం.ఏ. అయ్యాక తెలుగు పండిత శిక్షణలో చేరాను. అక్కడే శ్రీశ్రీ నా జీవితాన్ని ఇంకో మలుపు తిప్పాడు. నాకో జీవన సహచరిని ఇచ్చాడు. నా సహాధ్యాయి డా. పి.లక్ష్మి శిలాలోలిత నేను పాడే శ్రీశ్రీ పాటల్ని విని, నన్ను వలచింది. ఎం.ఫిల్‌ కోసం నా ఫీజుల్ని తనే కట్టి పరిశోధన పూర్తిచేసేట్లు సహకరించింది. శ్రీశ్రీ కవిత్వాన్ని నేను ఇష్టపడి, గానం చేయడం ద్వారా భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం కలగడమే కాదు, చదువుకోలేని ఆర్థిక స్థోమత ఎప్పుడూ నాకు అడ్డంకిగా మారకుండా కాపాడింది.
ఒక సాయంత్రం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారి యింట్లో సాహిత్య మిత్రులం కలిశాం. ఎన్‌.వేణు గోపాల్‌ 'కవితా ఓ కవితా'ను ఉద్వేగంగా గానం చేశాక, నేను 'పతితులారా.. భ్రష్టులారా' పాడాను. పాట పూర్తయ్యాక అందరి ప్రశంసలు అందు కుంటున్న సమయంలో, ఓల్గా గారు ప్రశంసా పూర్వకంగా నా నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం నా పాటకు అదో అపురూపమైన అవార్డు.
శ్రీశ్రీని పాడే అవకాశం సభల్లో ఈ మధ్య కాలంలో నాకు దొరకక పోయినా, ఆత్మీయుల సమక్షంలో, ఇంట్లో అవకాశం వచ్చినప్పుడల్లా పాడుకుంటూ శ్రీశ్రీని స్మరించు కుంటాను. శ్రీశ్రీ మాటలేని, పాటలేని జీవితాన్ని నేను ఊహించుకోవటం కష్టం.

- యాకూబ్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రగతిశీల కళాసైనికుడు సఫ్దర్‌ హష్మి
యువతరంగ ప్రస్థానం
చేదెక్కిన జీవితం!
పిల్లి మెడకు గంటకట్టేదెవరు?
నివురు
మహాత్మా...!!
అంబేద్కర్‌
17న 'అంబేద్కర్‌ సూర్యుడు' ఆవిష్కరణ
సాహితీ సోపతి పదేండ్ల ప్రస్థానం
'కేరె జగదీష్‌ గారు వందనాలు'
'నిజం' కవిత్వంలో నియోలాగిజమ్‌
కవితాకాశపు తూరుపు అంచున విరిసిన అక్షర నక్షత్రాల రంగుల హరివిల్లు 'నెయిసెస్‌'
తండ హరీష్‌ గౌడ్‌ కు సాహితి పురస్కారం
'తొలి కిరణాలు''
ఏప్రిల్‌ 11 న 'తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌' సదస్సు
నీ కోసం
బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌
అగ్రహారపు టోపోగ్రఫిని గ్లోరిఫరు చేసిన కథలు
ఆసాంతమూ కథలన్నీ నోటికి అందాకా హృదయం నవ్వుతుంది.
చరిత్ర కావాలి
ఆగమాగం బిజీ బిజీ
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం
సాహితీ సోపతి పదేండ్ల పండుగ
పీచర్‌ సునీతా రావు అవార్డుల కోసం రచనలకు ఆహ్వానం
'సిలివేరు సాహితీ కళాపీఠం' వారి నాలుగో వార్షికోత్సవం
ద వర్జిన్‌ అండ్‌ ద జిప్సీ (నవల)- ఒక పరిశీలన
తెలంగాణా తెలుగు ప్రాచీనతా నిదర్శనం
సాహితీ వార్తలు
బతుకు పాఠం
మనదీ దేశ ద్రోహమే!

తాజా వార్తలు

09:50 AM

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

09:37 AM

మూడో రోజు వైఎస్ షర్మిల దీక్ష

09:34 AM

నిజామాబాద్‌లో కోవిడ్ మృతదేహాలు తారుమారు

09:25 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

09:09 AM

రేపు నగరంలో వ్యాపార సంస్థల మూసివేత

09:04 AM

ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా

08:47 AM

బెంగాల్‌లో ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

08:42 AM

పసివాడిపై పెద్దనాన్న పైశాచికం..ముఖంపై వాతలు పెడుతూ..!

08:25 AM

ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా బాధితులు పరారీ

08:12 AM

తండ్రిని హత్య చేసిన తనయుడు

08:05 AM

సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు

07:50 AM

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

07:44 AM

తిరుపతిలో కొనసాగుతున్న పోలింగ్

07:37 AM

ఆంక్షల వేళ అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.!

07:23 AM

సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ కమెడియన్ మృతి

07:12 AM

కరోనా కొత్త లక్షణాలు..ఈ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే.!

06:50 AM

ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు

06:48 AM

ఇంటర్‌ ప్రథమ సంవత్సర అడ్మిషన్ల స్ర్కీనిం పరీక్ష వాయిదా

06:41 AM

తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ నేడే

06:39 AM

నేడు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్

06:34 AM

ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా

09:38 PM

పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన.. చెన్నై విజయలక్ష్యం 107

09:30 PM

ఆసుపత్రిలో డెడ్ బాడీ తారుమారు

09:23 PM

అర్ధరాత్రి సమయంలో ఇంటికి పిలిపించి..

08:47 PM

నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం

08:41 PM

లంచం కేసులో పోలీసులకు బిగుసుకుంటున్న ఉచ్చు

08:13 PM

కరోనా పాజిటివ్‌.. యువకుడు ఆత్మహత్య

07:57 PM

మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్

07:37 PM

లవర్స్ ను తుపాకితో కాల్చిన పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో

07:27 PM

ఏపీలో భారీగా పెరిగిన కేసులు..కరోనాతో 20 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.