Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మయాది'
పెండెం ఫౌండేషన్ ఆహ్వానం
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు గుండాల మండలం బ్రాహ్మణపల్లిలో అమ్మయాది పెండెం ఫౌండేషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం చేస్తున్నారు. ఇందులో సుద్దాల అశోక్ తేజ, పత్తిపాక మోహన్, ఎస్.హరగోపాల్, బండారు మంజుల, బడక మల్లయ్య, బండారు వెంకటయ్య, రవి ప్రసాద్, పెండెం జగదీశ్వర్ పాల్గొంటారు.
నవీన్ కథా పఠనం
ఈ నెల 27న సాహిత్య అకాడెమీ, సహృదయ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాహిత్యవేదిక కార్యక్రమం హనుమకొండ వాగ్దేవి డిగ్రీ, పి.జి కళాశాల మీటింగ హాల్లో సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది. ఇందులో నవీన్ తమ కథల్ని చదివి ఇనిపిస్తారు. ఆ తర్వాత కె.పి.అశోక్‌కుమార్, బన్న ఐలయ్య, రామా చంద్రమౌళి, గిరిజా మనోహర బాబు 'తెలుగు కథ గురించి ప్రసంగిస్తారు.
ఇస్మాయిల్ పురస్కారం కోసం...
ఇస్మాయిల్ పురస్కారం-2015కి గాను, 2014లో వచ్చిన కవిత్వ సంకలనాలను ఇస్మాయిల్ మిత్రమండలి ఆహ్వానిస్తోంది. గత అయిదేళ్ళుగా కాకినాడలోని ఇస్మాయిల్ మిత్రమండలి ఏడాదికి ఒకసారి ఎంపిక చేసిన కవిత్వ సంకలనానికి పురస్కారం అందిస్తుంది. అవార్డు కోసం పుస్తకం మూడు ప్రతులను అక్టోబర్ 15 వ తేదీ నాటికి పంపవలసిందిగా మిత్రమండలి కోరుతోంది. పుస్తకాలు పంపించాల్సిన చిరునామా: వాడ్రేవు వీరలక్ష్మీదేవి, 70-1/సి-2, ఎన్.ఎఫ్.సి.ఎల్. రోడ్డు, కాకినాడ-533003.
పద్య కవితా సంపుటాలకు ఆహ్వానం
సుప్రసిద్ధ కవి డా||నాగభైరవ కోటేశ్వరరావు స్మారక కవితా పురస్కారం - 2015కు నాగభైరవ అవార్డు కమిటీ పద్యకావ్యాలు, పద్య కవితా సంపుటాలను ఆహ్వానిస్తుంది. 2013 నుండి 2015 ఆగస్టు 31 వరకు ప్రచురింపబడిన పద్యకావ్యాలు, పద్యకవితా సంపుటాలు తెలుగు రాష్ట్రాల వారు పంపవచ్చు. సంపుటాల మూడు ప్రతులను 2015 అక్టోబర్ 20లోగా పంపించాలి. చిరునామా : చిన్ని నారాయణరావు, ప్రధాన కర్యాదర్శి, డా||నాగభైరవ అవార్డు కమిటి రూం.నెం. 14, రెండో అంతస్తు, కె.ఎ.సి. ప్లాజా, ఆర్.ఆర్.వీధి, నెల్లూరు-524001, ఫోన్ : 9440202942.
మెర్సీ మార్గరెట్‌కు
పెన్నా పురస్కారం
పెన్నా సాహిత్య పురస్కారం ఆరవ వార్షికోత్సవం అక్టోబర్ 11వ తేదీన నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక పెన్నా సాహిత్య పురస్కారం - 2015 కొరకు పెట్టిన పోటీలో ఉత్తమ కవితా సంపుటిగా ఎన్నికైన 'మాటల మడుగు' కవయిత్రి మెర్సీ మార్గరేట్‌కు పురస్కార ప్రదానం చేస్తారు.
ప్రరవే ఆహ్వానం
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సంయుక్త నిర్వహణలో ఈ నెల 27న వేమూరి అనిల్ కుమార్ స్వాతి సాహిత్య వేదిక ప్రాంగణంలో 'కవితా సందర్భం - 2015' నిర్వహిస్తారు. పి.సత్యవతి, పుట్ల హేమలత, పాపినేని శివశంకర్, శీలా సుభద్రాదేవి, బి.బాబ్జి, విష్ణుప్రియ, విమల, రమా సుందరి, దర్బశయనం శ్రీనివాసాచార్య, వనజ తాతినేని, నల్లూరి రుక్మిణి, సీతారామ్, అనిశెట్టి రజిత, మందరపు హైమావతి, విష్ణుప్రియ, రాజ్యలక్ష్మి, నండూరి రాజగోపాల్, చూపు కాత్యాయని, కొండేపూడి నిర్మల, ఎ.బి.ఎస్.సాయిబాబు, పి.అమరజ్యోతి పాల్గొంటారు.
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాల ఎంపిక
రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ డ చారిటబుల్ ట్రస్టు వారు రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కోసం కవితా సంకలనాల్ని ఆహ్వానిస్తున్నారు. ఎంపిక కోసం 2013 -2015 వరకు ప్రచురితమైన కవితా సంకలనాలు ఐదు ప్రతులను అక్టోబర్ 26, 2015లోపు అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం-2015, రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ డ చారిటబుల్ ట్రస్ట్, బాలాజి నగర్, సిరిసిల్ల -505301, కరీంనగర్ కు పంపవచ్చు.