Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుంబెట్టి నాగటికర్రు
నేలపై పర్సుకున్న చీకటితెప్పను
పలుగజీరుతానప్పుడు
గాబర గాబరగ
సగం కడిగిన మందుచేతులతో
బువ్వపెల్ల పిసుకుతూ
పాలుపడుతున్న కంకులకు
పైమందు తానం పోయాలనుకున్నప్పుడు
చెట్టు గొడుగు కింద జేరి
కుంగేపొద్దును సూస్కుంట
అర్రొంచిన వరిగొలుసుల్ల
రాకడ పోకడలు లెక్కగడతానప్పుడు
చేతులు రంపపుకొడవళ్ళుజేసి
కొయ్య'కాళ్ళ గాయాలతొ' పొత్తిపోసినా
పంటఆశను తుఫాను ఊడ్సుకపోయినప్పుడు
అంగట్లో అన్నీ ఉన్న
కరోనాపాము కాటేసినప్పుడు
నోట్లె పడ్తయనుకున్న బువ్వమెత్కులు
గంజిగొట్టుక పోయినపుడు
కాగితాలల్ల మాగిన అప్పు
రాశై మర్లపడ్డప్పుడు
గడియారం ముల్లోలె
ఎన్ని సుడులు దిరిగినా
బతుకు అరికీసు తెల్లారదు
- వడ్లకొండ దయాకర్, 94404 27968