Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మంచితనపు స్పర్శని అందించిన కథలు | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 03,2020

మంచితనపు స్పర్శని అందించిన కథలు

కథలన్నిటా కేంద్రకం చిన్న వస్తు బిందువు. ఇతివత్తమేమో-పెద్ద పరిధి కలదిగా కనిపిస్తుంది. కథా నిర్మాణ పద్ధతుల్లో, ఇదీ ఒక పద్ధతి. శివకుమార్‌ కథనం, చాలా సరళంగా, స్పష్టంగా ఉంటుంది. పాత్ర చిత్రణలో కొన్ని చోట్ల పరోక్ష ప్రమేయాన్ని అద్భుతంగా చూపుతారాయన.

పి.వి.ఆర్‌.శివకుమార్‌ సుప్రసిద్ధ రచయిత. నాలుగు దశాబ్దాలకు పైబడి సాహిత్యం- అందునా ముఖ్యంగా కథ, నవల, నాటక రచన- ప్రవత్తిగా అక్షర యానం చేస్తున్నారు. శివకుమార్‌ చింతన పరులు, బుద్ధి జీవి. జ్ఞానం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. అధ్యయనం, అనుభవం, ఆత్మ పరిశీలన అనేవి ఆ గమనానికి 'సత్తువ' నిస్తాయి.
'శివకుమార్‌ కథానికలు' సంపుటి 2010 లో వచ్చింది. ఇది రెండవ కథానికా సంపుటి. దీనిలో 21 కథలు ఉన్నై. (కథ - కథానిక - ఈ రెండూ ఈనాటి సాహిత్య వ్యవహారంలో సమానార్ధకాలే! ఆ రెండిటి మధ్యన గల సాంకేతిక భేదాలు సంపూర్ణంగా తెలిసినా, ''యద్యదాచరతి శ్రేష్ఠః'' భావనతో నేను రెంటినీ ఒకటిగానే వాడతాను!)
ఈ సంపుటిలోని 21 కథల్నీ చదివి, ఆయా వస్తువుల్ని విహంగ వీక్షణ చేసినప్పుడు, ప్రాథమికంగా, శివకుమార్‌ తానుగా చెప్పుకున్న మనో భావానికి అనుగుణంగానే అవి ఉన్నాయని తెలుస్తుంది. 'ఏది రాసినా అది ఆదర్శవంతంగా ఉండాలీ అనేది ఆయన సద్భావన. ఆదర్శవంతం అంటే- మనిషిలో మంచిని పెంచేది అనీ, మనిషిని ఉన్నతీకరించేది అనీ, తద్వారా సమాజా భివద్ధిని పెంచేది అనీ మనకు తెలుసు. ఆయన రచనా పరివస్య ఈ ఫల సిద్ధి కొరకే సాగుతున్నది. ఎలా అంటే? ఇదిగో ఇలా......
'కిరణం' స్వాతిలో పదివేల రూపాయలు బహుమతి పొందిన కథ. నగరీకరణ ప్రజలకు పంచుతున్న దౌర్భాగ్యాల్లో, అనారోగ్యాల్లో మొట్ట మొదటిది- వాతావరణ కాలుష్యం, రెండవది సహజ ప్రకతి వనరుల విధ్వంసం. వీటి వలన చిన్న పిల్లల్లో పోషక లోపం; తెలియని రోగాల దాడి. ఈ కథలో హవిస్‌ పరిస్థితి అదే. వాడిని, తాత భద్రయ్య తీసుకుపోయి, గ్రామ వాతావరణంలో నియమ బద్ధమైన ఆహారం, వ్యాయామం అందిస్తూ, సూర్యరశ్మి తగిలే విధంగా వాడి దైనందిన కార్య క్రమాన్ని నిర్ణయిస్తాడు. అలా సాకు తాడు. హవిస్‌ సంపూర్ణ ఆరోగ్య వంతుడౌతాడు. మన మంతా మరచి పోతున్న ప్రాథమిక ఆరోగ్య సూత్రాల్ని గుర్తు చేసిన మంచి కథ.
మానవ సంబం ధాలన్నీ, ఆర్ధిక సంబం ధాలవు తున్నాయనే వాస్తవం కుడి, ఎడమల ఋజు వౌతున్న సందర్భం-వర్తమానం. గతంలో ప్రాణ స్నేహితులే. ఇవాళ ఒకడు సెలబ్రిటీ. మిత్రుడు వెళితే-గుర్తు పట్టడు; లేక పట్టనట్టు నటిస్తాడు! దూరం నుంచి చూస్తే ఆకాశం; దగ్గరకు పోతే 'శూన్యం'! కథ పేరూ ఇదే!
మానవ సంబంధాలో పగుళ్ళు ఈనాడు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఎక్కడో ఏదో ఉన్నదని పోయి పోయి, ఎంత దూరం పోయినా శాంతిలేని జీవితం మిగులుతున్నది. 'అగాధం' కథలో ఇతివత్తం ఇదే! పడుచు పెళ్ళాన్ని అనుమానించి, ఆమె జీవితాన్ని వ్యధ పరచిన మొగుడిని భరించక తప్పని స్థితి- గాయత్రిది. ఆ స్థితే ఆమెకు 'శాశ్వతం'. కథ పేరూ అదే!
ఒకరి అవసరం, అనివార్యమైన దుస్థితీ మరొకరికి అవకాశాలవు తున్నాయి. లోకరీతి ఇది. భర్త లేని మంగని బావగారే కాటు వేయజూశాడు. ఆమెకింక మిగిలింది మొండి ధైర్యమే! పామునే నిలవేసింది. మంది క్షేమాన్నీ, జంతు క్షేమాన్నీ కూడా సాధించింది. 'రాకూడని అతిథి' కథ ఇది.
'న్యాయం నీకోటీ-నాకోటీ' కథలో 'ప్రతి మనిషీ మరియొకరిని దోచుకొనేవాడే' అన్న వాస్తవం పారదర్శక మైంది. కర్ఫ్యూ వాతావరణం నేపథ్యంగా సాగిన కథ.
'కొత్త మలుపు' కథలో, తన చిన్ననాటి స్నేహితురాలు శ్రీమాలే ఇవాళ ఎక్స్‌ ట్రా నటి లలిత అనే భావనలో ఆమెని ఆదరించబోయిన సినీ రచయిత సర్వాన్నీ 'దోచుకుని' జారుకుంటుంది ఆ చిన్ననాటి స్నేహితురాలు! కొన్ని కొన్ని యాదచ్ఛిక సంఘటనలు- సద్యస్ఫూర్తితో ప్రవర్తించేట్టు చేస్తాయి. ఫోన్‌ నంబరు తప్పుగా డయల్‌ చేస్తే, దాన్ని అందుకున్న పెద్దాయన చివరకి ఒక అపరిచిత శవదహనానికి డబ్బు ఇచ్చి, పాడె కూడా మోస్తాడు. అదే 'ఋణానుబంధం'.
'చిగురు' కథలో కూడా ఇలాగే జరుగు తుంది. పక్కింట్లో, యజమా నురాలి క్రూరత్వానికి బలై పోతున్న పిల్లవాడిని చేర దీసి, తనతో తీసుకుపోతాడు సీతారామయ్య- ఒక అప నింద మోస్తూ! వయసు మీదపడి, మతి మరపు రోగం బారిన పడిన తల్లి పట్ల తన బాధ్యతని గుర్తెరిగిన కొడుకుని 'రేపన్నది నీదికాదు' లో చూస్తాము.
'మాకేం మిగిల్చారు నాన్నా' అనేది స్పష్టమైన సూటి ప్రశ్న. ఈ తరం మనుషులకి క్రిందటి తరం వారిచ్చిన బహుమతి విధ్వంసమైపోయిన పర్యావరణాన్నీ, జీవావర ణాన్నే నా? ఆలోచనాత్మక కథనంతో సాగిపోయిన కథ ఇది.
పరిస్థితులూ, పరిసరాలూ, బతుకుతున్న బతుకూ ఎంత అనుకూలంగా లేకపోయినా, తమ అవసరాల ప్రాధమ్యం నెత్తిన మొట్టుతున్నా, పొరుగు వారినీ, వారి ఇక్కట్లనీ అర్థం చేసుకుని, మానవీయ స్పందనని చూపగలవారు నిజంగా ఉత్తములే. 'ఇరుకు' కథలో మిత్రుడు తన ఆత్మీయ పడుచు జంట తమదైన ఏకాంతానికి నోచుకోని అవస్థని గమనించి, ప్రత్యామ్నాయం చూపుతాడు. 'ఊరి చివరి ఇల్లు' లో తన ఇంట్లో అద్దెకున్న బడుగు బాపడి బాధని గమనించి, ఇల్లు అమ్ముకు పోదామని వచ్చినవాడు తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ కథ కన్నడం లోకి అనువదించబడి, అనువాద కథలపోటీలో రెండవ బహుమతి పొందింది. మంచితనపు స్పర్శని అందించిన కథలు ఇవి.
కథా రచయిత బాధ్యతల్లో ముఖ్యమై నది- వర్తమాన సామా జిక వాస్తవాలకి స్పందిం చటం, వాటిని కథాగతం చేసి, కళా రూపాలుగా అక్షరీకరించటం. శివ కుమార్‌ రాసిన 'మీరేమంటారు' కథ- విజయవాడలో ఒక ఎం.యల్‌.ఏ. హత్యానంతరం జరిగిన అల్లర్లని ఇతివత్తం చేసుకుంటే, 'ముం(బొం)బాయి' కథ- అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ముంబైలో జరిగిన అల్లర్ల నేపథ్యాన్ని కథాత్మకం చేసింది. రెండిటిలోనూ, సామాన్య జనం స్పందన, సగటు మనుషుల చిత్తశుద్ధి, మంచితనం- పారదర్శకమౌతాయి.
ఈ కథల ఆత్మని ఇలా వివరించటం-శివకుమార్‌ చింతనలో, రచనలో వస్తు వైవిధ్యం, వస్తు విస్తతీ, ఎంత నిబిడంగా ఉన్నాయో తెలపటానికే. ఆయన కథలన్నిటా కేంద్రకం చిన్న వస్తు బిందువు. ఇతివత్తమేమో-పెద్ద పరిధి కలదిగా కనిపిస్తుంది. కథా నిర్మాణ పద్ధతుల్లో, ఇదీ ఒక పద్ధతి. శివకుమార్‌ కథనం, చాలా సరళంగా, స్పష్టంగా ఉంటుంది. పాత్ర చిత్రణలో కొన్ని చోట్ల పరోక్ష ప్రమేయాన్ని అద్భుతంగా చూపుతారాయన.
'పడుచు పెళ్ళాన్ని గారాబం చేస్తే అలుసు తీసుకుని, నెత్తికెక్కుతుందేమో నన్న భయం సదాశివది. ముసలి అన్నయ్యని నమ్ముకుని, తనని నిరాకరి స్తోందన్న కోపం కాశ్యపది. పూర్వజన్మ పాపాలకి ప్రతిఫలం ఈ జన్మ అన్న నిర్వేదం గాయత్రి ది...' ఇది ఒక్క ఉదాహరణ. కథా శిల్పం మీద పట్టుని ఇలాంటి వర్ణనలూ, వాక్యవిన్యాసాలు తెలుపుతాయి.
మంచి కథలో కల్పన, వాస్తవికత- తగు పాళ్ళలో ఉండాలంటారు విజ్ఞులు. ఈ గుణ నైపుణ్యాన్ని శివకుమార్‌ కథల్లోనూ చూడగలం. అందుకే అవి మంచి కథలుగా అటు పత్రికల ఆదరణని, ఇటు పాఠకుల అభిమానాన్నీ చూరగొం టున్నాయి. నిరాడంబరమైన శైలీ, శిల్పాలు కూడా ఆయన కథలకి చదివించే గుణాన్ని సంతరించి పెడుతున్నాయి.
- విహారి
9848025600

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సహృదయ ప్రేమికునికి నివాళి
సాహిల్‌ ఎందుకు రావాలి?
భూమిపుత్రులు
నేను వేచివున్నాను!..
దేశమంటే మేమే
రైతుకు జేజేలు
హారు ! ఆనంద భూమి
సాహితీ వార్తలు
అలిశెట్టి యాదిలో...
'సామ్యవాదం సాగుబాటు చేస్తాను నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను'
కలగంటున్న దృశ్యం!
ఒక చలి దేశం, కొన్ని చలి దేహాలు
అది
సాహితీ వార్తలు
కొత్త తొవ్వ
విత్తనం తల ఎత్తి మొలకెత్తితే...
ప్రాభాత సమీరం
'నోట్స్‌ ఫ్రం అండర్‌ గ్రౌండ్‌' దోస్తోవిస్కీ నవల, ఒక పరిశీలన
సమ'కాలిన' సమస్యలకు సరైన అయింట్మెంట్‌ అయినంపూడి కవిత్వం
కొత్త పేజీ మొదలు
నస్రీన్‌ ఖాన్‌ కు హేమలత స్మారక పురస్కారం
నేల నీది, రేపు నీది
దుస్సప్నం
మట్టి పాదాల మార్చ్‌
ప్రజాగొంతుకలై కదలిన కలాలు, గళాలు
ఆఖరి అస్త్రం 'ఐదోస్తంభం'!
మార్నింగ్‌ వాక్‌
ఇంటిచెట్టు
మేమో...మీరో
రెండు మార్కెట్లు

తాజా వార్తలు

10:02 AM

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 2.7కేజీల బంగారం పట్టివేత

09:59 AM

పెరిగిన పెట్రో ధరలు

09:21 AM

విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది

09:02 AM

రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు

08:47 AM

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు..

08:28 AM

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్‌చల్

08:03 AM

కిలిమంజారోను అధిరోహించిన తెలంగాణ యువతి

07:57 AM

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం

07:49 AM

టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

07:46 AM

నేడు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

07:44 AM

నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్..ఉదోగ్యు‌ల‌ నుంచి..!

07:27 AM

ప్రేమోన్మాది దారుణం..కత్తితో యువతి చేతి వేళ్లు తెగిపోయేంత..!

07:03 AM

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

07:01 AM

రష్మిక మందన్నకు భారీ షాక్...

06:54 AM

ఢిల్లీ‌లో ఘోర అగ్ని‌ప్ర‌మాదం

06:45 AM

కుక్క‌ల‌ను త‌ప్పించ‌బోయి చెట్ల‌లోకి దూసుకెళ్లి‌న కారు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

06:32 PM

కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.