1. అశోక చక్రవర్తి కాలం నాటి మౌర్య సామ్రాజ్యంలోని రాష్ట్రాలను, పట్టణాలతో జతపరచండి?
ఎ. ఉత్తరాపథం 1. ఉజ్జయిని
బి. అవంతిరత్త 2. తక్షశిల
సి. దక్షిణాపథం 3. తోసలి
డి. కళింగ 4. సువర్ణగిరి
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-1, బి-3, సి-2, డి- 4
2. శ్రీకృష్ణుని బోధనలు ఏ మతంగా ఆవిర్భవించింది?
1) జైన మతం 2) బౌద్ధ మతం
3) వైదిక మతం 4) వాసుదేవ మతం
3. శాతవాహనుల నాణేలపై ఈ కింది చిహ్నం అత్యధి కంగా కనబడుతుంది?
1) లక్ష్మీదేవి 2) గరుడ
3) నౌక 4) బాణం
4. రెండవ పులకేశికి సమకాలీకుడైన ఉత్తరాపథరాజు?
1) కుమారగుప్తుడు 2) స్కంద గుప్తుడు
3) ఆదిత్యుడు 4) హర్షుడు
5. దక్కన్‌లో రెండూ గొప్ప బౌద్ధమత కేంద్రాలు?
1) అజంతా, ఎల్లోరా
2) నాసిక్, కొల్హాపూర్
3) అమరావతి - నాగార్జునకొండ
4) పైవేవీకాదు
6. అలెగ్జాండర్‌్ ఓడించిన పారశిక చక్రవర్తి ఎవరు?
1) 2వ డేరియస్ 2) 4వ డేరియస్
3) 3వ డేరియస్ 4) పైవేవీకాదు
7. కౌశంబిలోకి అశోక స్తంభాన్ని అలహాబాద్‌కు తరలిం చిన మొగల్ చక్రవర్తి?
1) బాబర్ 2) హుమాయున్
3) అక్బర్ 4) షాజహాన్
8. అర్థశాస్త్రంలోని అధికరణాలు, ప్రకరణాల సంఖ్య?
1) 15 అధికరణాలు, 180 ప్రకరణాలు
2) 10 అధికరణాలు, 180 ప్రకరణాలు
3) 12 అధికరణాలు, 150 ప్రకరణాలు
4) 20 అధికరణాలు, 200 ప్రకరణాలు
9. సముద్రగుప్తుని విజయాలు ఈ శాసనంలో ఉన్నాయి?
1) మొహరౌళి ఇనుప స్తంభ శాసనం
2) అలహాబాద్ స్తంభ శాసనం
3) మాండసోర్ శాసనం
4) నాసిక్ శాసనం
10. 'ఇండికా' గ్రంథ రచయిత?
1) కౌటిల్యుడు 2) పాణిని
3) కాళిదాసు 4) మెగస్తనీస్
11. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల జరిగిన ముఖ్య ఫలితం?
1) గ్రీకు - భారతదేశాల మధ్య రాకపోకలు ఏర్పడినాయి
2) గ్రీకు - భారతదేశం మధ్య వ్యాపారం క్షీణించింది
3) భారతదేశంలో గ్రీకు భాష అభివృద్ధి చెందింది
4) వాయవ్య భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలు విలీనమై, రాజకీయ ఐక్యత ఏర్పడింది
12. మాధ్యమిక సిద్ధాంత స్థాపకుడైన ఆచార్య నాగార్జు నుడు ఈ కింది శాతవాహన రాజు సమకాలీకుడు?
1) గౌతమీ పుత్ర శాతకర్ణి 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) పులోమావి - 1 4) పులోమావి - 2
13. మౌర్యుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు నుంచి లభించేది. పండిన పంటలో రైతుల నుంచి ఎంత భాగం పన్నుగా వసూలు చేసేవారు?
1) 1/6 నుంచి 1/4 వరకు
2) 1/5 నుంచి 1/3 వరకు
3) 1/4 నుంచి 1/6 వరకు
4) 1/3 నుంచి 1/5 వరకు
14. గుప్త రాజుల్లో ఎవరు మొట్టమొదటి సారిగా 'మహారాజాధిరాజు' అనే బిరుదు ధరించాడు?
1) శ్రీ గుప్తుడు 2) ఘటోత్కచుడు
3) మొదటి చంద్రగుప్తుడు
4) రెండవ చంద్రగుప్తుడు
15. కౌటిల్యుని అర్థశాస్త్రంలోని 4వ అధికరణంలో వాడిన 'కంఠిక' అనే పదం ఈ కిందిఅంశాలలో ఒక దాని గురించి చర్చిస్తుంది?
1) సివిల్ కేసుల విచారణ
2) విదేశీ దాడులను ఎదుర్కోవడం
3) క్రిమినల్ కేసుల విచారణ
4) గుఢాచారుల విధులు
16. పంచుమార్క్ గల నాణేలను వీరు ముద్రించారు?
1) నందులు 2) హర్యంకులు
3) మౌర్యులు 4) గుప్తులు
17. నాల్గవ బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కాశ్మీర్‌లో కుందలవనంలో జరిగింది. ఈ సంగీతిని ఎవరి సలహాతో ఏర్పాటు చేశాడు?
1) పార్శవ నాథుని సలహా
2) మహావీరుడి సలహా
3) ఆచార్య నాగార్జుని సలహా
4) ఋషభ నాథుడి సలహా
18. భారతదేశంపై మొదట దండెత్తి వచ్చినవారు?
1) పారశీకులు 2) శాకులు
3) కుషాణులు 4) అరబ్బులు
19. ఈ నదులతో ఒక దానితో 'మగధ' రాజ్యానికి సంబంధం లేదు?
1) గంగా 2) సోన్
3) గండక్ 4) రావి
20. పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి తన రాజధానిని మార్చిన గుప్తుల రాజు?
1) సముద్రగుప్తుడు 2) స్కంధ గుప్తుడు
3) రామ గుప్తుడు 4) రెండవ చంద్ర గుప్తుడు
21. చాంద్‌బార్‌దారు రచించిన 'పృథ్వీరాజ్‌రాసో' ప్రతీహార, సోలంకీ చౌహాన్‌లు మొదలైర రాజపుత్ర వంశాల పుట్టుకను గురించి ఈ కింది విధంగా తెలియజేస్తుంది?
1) రాజపుత్ర శూనులు
2) రాజపుత్రులు వైశ్యులు
3) అగ్నికుల క్షత్రియులు
4) చంద్రకుల వంశస్తులు
22. అల్లావుద్దీన్‌ఖిల్జీ రాణి పద్మినీ కోసమే చిత్తోర్‌పై దాడి నిర్వహించాడని తెలిపిన సమకాలీన రచయిత?
1) బరనీ
2) మాలిక్-మహ్మద్-జయసీ
3) ఫెరిస్టా 4) ఇసామీ
23. ఏ కాకతీయ చక్రవర్తి పాలనాకాలంలో వరంగల్ రాజ్యం ఢిల్లీ సుల్తాన్‌లో విలీనమైంది?
1) మొదటి ప్రతాపరుద్రుడు 2) మహాదేవుడు
3) గణపతి దేవుడు
4) రెండవ ప్రతాపరుద్రుడు
24. ఆగ్రా పట్టణాన్ని తన రాజధానిగా ఎంపిక చేసిన ఢిల్లీ పాలకుడు?
1) అల్లావుద్దీన్ ఖిల్జీ 2) మహ్మద్‌బిన్ తుగ్లక్
3) బహలూల్ లోఢ 4) సికిందర్ లోఢ
25. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం ఏ రాష్ట్ర కూట రాజు నిర్మించాడు?
1) మొదటి కృష్ణుడు 2) రెండవ కృష్ణుడు
3) మొదటి గోవిందుడు 4) రెండవ గోవిందుడు
26. అమోఘవర్షుడి సైనిక విజయాలను కవిరాజ మార్గం అనే గ్రంథం తెలియజేస్తుంది. దీనిని ఏ భాషలో రాశాడు?
1) తమిళం 2) తెలుగు
3) కన్నడం 4) మళయాళం
27. విశిష్టాద్వైత మార్గాన్ని ప్రచారం చేసినవాడు?
1) శంకరాచార్యుడు 2) వల్లభాచార్యుడు
3) మధ్వాచార్యుడు 4) రామానుజాచార్యుడు
28. చోళ రాజుల స్థానిక పరిపాలన వివరాలు తెలుసు కోవడానికి అతి ముఖ్య ఆధారం?
1) తంజావూరు శాసనం
2) తిరువనంతపురం శాసనం
3) ఉత్తర మేరూర్ శాసనం
4) తిరుక్కల్ గుహ శాసనం
29. ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించండి?
1) కల్నల్ టాడ్ - అనల్స్ ఆఫ్ రాజస్థాన్
2) కల్హనుడు - రాజతరంగిణి
3) భవభూతి - ఉత్తర రామ చరిత్ర
4) పైవన్నీ సరైనవే
30. అరబ్బుల సింధూ ఆక్రమణను సత్ఫలితాలియ్యని ఘన విజయం అన్నది ఎవరు?
1) వి.ఎ.స్మిత్ 2) లేన్‌పూల్
3) శ్రీవాత్సవ 4) మజుందార్
31. మహ్మద్‌బిన్ తుగ్లక్ సంస్కరణలో మొదటిది?
1) దో ఆబ్ ప్రాంతంలో భూమశిస్తు రేటు పెంచడం
2) రాగి నాణేల ముద్రణ
3) రాజధాని మార్పిడి
4) సైనిక సంస్కరణలు
32. ఆగ్రా కోటలో పట్టాభిషేకం జరుపుకున్న లోఢి సుల్తాన్?
1) బహలూల్ లోఢి 2) సికిందర్ లోఢి
3) ఇబ్రహీం లోఢి 4) ముర్తుజా లోఢి
33. చోళుల గ్రామపాలనలోని వార్డు సభ్యులను ఈ కింది పద్ధతులలో ఎన్నుకునేవారు?
1) రాజు నియమించే వాడు
2) ప్రజలు ఎన్నుకునేవారు
3) లాటరీ పద్ధతిలో ఎన్నుకునేవారు
4) వారసత్వ పద్ధతిలో ఎంపిక చేసేవారు
34. వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుడు ఏ రాజు వద్ద మంత్రిగా ఉన్నాడు?
1) కాలచూరి బిజ్జలుడు
2) మూడవ తైలవుడు
3) నాలుగవ సోమేశ్వరుడు 4) బిల్లముడు
35. రాజపుత్రులలో మొదట విజృంభించిన వారు?
1) చైహానులు 2) ప్రతీహారులు
3) గహద్వాలులు 4) చందేలులు
36. అమీర్ ఖుస్రూ రాసిన 'ఆషికా' ప్రధాన ఇతివృత్తం?
1) ఖిజిర్‌ఖాన్ సైనిక దాడులు
2) గుజరాత్‌రాజు రాజాకరణ్ చరిత్ర
3) అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ఖిజిర్‌ఖాన్ రాజా కరణ్ కుమార్తెయైన దేవలదేవి ప్రేమ వ్యవహారం
4) ఖిజిర్‌ఖాన్ పట్టాభిషేకోత్సవం
37. 'మహ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పిడ (ఢిల్లీ నుంచి దౌలతాబాద్, దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి) వృథా ప్రయాసకు చిహ్నంగా నిలిచిపోయింది' అని ఏ చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు?
1) వి.ఎ.స్మిత్ 2) లేన్‌పూల్
3) ఆర్.సి.మజుందార్ 4) ఆర్.సి.దత్
38. 'మవన రాజ్య స్థాపనాచార్య' అనే బిరుదును ధరించిన విజయనగర రాజు?
1) శ్రీకృష్ణదేవరాయలు
2) వీర నరసింహ రాయలు
3) అళియ రాయలు
4) సదాశివ రాయలు
39. ఘోరీ మహ్మద్ ఏ యుద్ధంలో గుహద్వాల రాజైన జయచంద్రున్ని క్రీ.శ. 1193లో ఓడించాడు?
1) కనౌజ్ 2) తరైన్
3) చందావర్ 4) జోథ్‌పూర్
40. కనిష్కుడు బౌద్ధమత అభిమానిగా మారడానికి ఈ బౌద్ధ ఆచార్యుడు కారణం?
1) వీర ఆచార్య 2) పార్శ్వా ఆచార్యుడు
3) అశ్వఘోషుడు 4) వసుమిత్రుడు
41. రోమన్ చక్రవర్తుల తరహా బంగారు నాణేలను ముద్రించిన తొలి భారతీయ పాలకులు?
1) శుంగులు 2) కుషాణులు
3) గుప్తులు 4) కణ్వులు
42. మామల్లపురంలోని పంచపాండవ రథాల నిర్మాత?
1) మొదటి మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) భీమవర్మ 4) రవికీర్తి
43. క్రీ.శ. 1604లో 'ఆదిగ్రంథ్'ను ఏ సిక్కు గురువు సంకలనం చేశాడు?
1) గురునానక్ 2) గురుతేజ్ బహదూర్
3) గురు అర్జున్ సింగ్ 4) గురుగోవింద్
44. 'ది-రెహలా' అనే రచన ఈ కింది రచయితది?
1) ఇబన్‌బతూట 2) ఇసామీ
3) బరనీ 4) ఫెరిస్టా
45. మహ్మద్‌బిన్ తుగ్లక్ స్థాపించిన 'దివాన్-ఇ-కోహి' అనే శాఖ అతిముఖ్యమైన విధి?
1) సైనిక సంస్కరణలు
2) విదేశీ వ్యవహారాలు
3) న్యాయపరమైన విధులు
4) వ్యవసాయాభివృద్ధి - బంజరు భూములను సాగు భూములుగా మార్చడం
సమాధానాలు
1.3 2.4 3.3 4.4 5.3
6.3 7.3 8.1 9.2 10.4
11.4 12.2 13.1 14.3 15.3
16.3 17.1 18.1 19.4 20.4
21.3 22.2 23.4 24.4 25.1
26.3 27.4 28.3 29.4 30.2
31.1 32.3 33.3 34.1 35.2
36.3 37.2 38.1 39.3 40.2
41.2 42.2 43.3 44.1 45.4
- దారావత్ సైదులు నాయక్
సివిక్స్ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఫోన్ 9908569970
Authorization