Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అల్ఫాబెట్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్ | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

అల్ఫాబెట్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్

అంతర్జాతీయం
వీఘర్‌ ముస్లింలకు మద్దతుగా అమెరికాలో బిల్లు

వీఘర్‌ ముస్లిం మైనార్టీలను చైనా ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభ (దిగువ సభ) బిల్లును ఆమోదించింది. వీఘర్‌ మానవ హక్కుల విధానం చట్టం-2019 పేరుతో రూపొందించిన ఈ బిల్లుపై 2019 డిసెంబర్‌ 3న చర్చ జరిపింది. ఎగువసభ అయిన సెనేట్‌ ఇంతకు ముందే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా ప్రభుత్వం జింగ్‌యాంగ్‌ రాష్ట్రంలోని దాదాపు పది లక్షల మందిని సామూహికంగా నిర్బంధ కేంద్రాల్లో పెట్టింది. అమెరికా బిల్లును చైనా తీవ్రంగా ఖండించింది. వీఘర్‌ ముస్లింలను నిర్బంధించలేదని, వత్తి విద్యలో శిక్షణ ఇస్తున్నామని తెలిపింది.
భారత్‌-జపాన్‌ రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో నవంబర్‌ 30న భారత్‌-జపాన్‌ రక్షణ, విదేశాంగ శాఖల(2+2) మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్‌ తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌, జపాన్‌ తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగి, రక్షణ మంత్రి టారో కొనో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సహా అంతర్జాతీయ విభాగాలకు ఇచ్చిన హామీలను పాకిస్తాన్‌ అమలు చేయాలని భారత్‌, జపాన్‌ ఆ దేశాన్ని కోరాయి.
ప్రస్తుత దశాబ్దంలోనే అధిక ఉష్ణోగ్రతలు
చరిత్రలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుత దశాబ్దం (2010-2019)లోనే నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు 2019 డిసెంబర్‌ 3న జరిగిన ఐక్య రాజ్యసమితి వార్షిక సమావేశంలో వాతావరణ మార్పులు మానవాళి సామర్థ్యాన్ని ఏవిధంగా అధిగమిస్తున్నాయో తెలిపింది. పారిశ్రామికీకరణ ముందు సమయం (1850-1900) లోని సగటు ఉష్ణోగ్రత కంటే 2019 ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సుమారు 1.1 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) వెల్లడించింది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2019 మొదటి 3 స్థానాల్లో నిలిచిందని పేర్కొంది. గత 12 నెలల్లో గ్రీన్‌ల్యాండ్‌ మంచు పలకల్లో సుమారు 329 బిలియన్‌ టన్నుల మంచు కరిగిపోయిందని వివరించింది.

జాతీయం
పౌష్టికాహార గీతాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
పౌష్టికాహార లోప రహితంగా మన దేశాన్ని 2022 నాటికి తీర్చిదిద్దాలన్న సందేశంతో రూపొందించిన భారతీయ పోషణ గీతాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు 2019 డిసెంబర్‌ 3న దిల్లీలో ఆవిష్కరించారు. ప్రముఖ గీత రచయిత ప్రసూన్‌ జోషి ఈ గీతాన్ని రాశారు. ప్రఖ్యాత గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు.
దమణ్‌ దీవ్‌, దాద్రా-నాగర్‌ హవేలీల విలీనం
రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న దమణ్‌ దీవ్‌, దాద్రా-నాగర్‌ హవేలీలను ఇకపై ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
అత్యుత్తమ ప్రాంతీయ శిక్షణా కేంద్రంగా జీఎంఆర్‌ ఏవియేషన్‌
జీఎంఆర్‌ గ్రూపునకు చెందిన విమానయాన నైపుణ్యాల శిక్షణా సంస్థ జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీకి (జీఎంఆర్‌ ఏఏ) అత్యుత్తమ ప్రాంతీయ శిక్షణా కేంద్రం హోదా లభించింది. ఇక్కడ ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) 6వ విడత శిక్షణ (ట్రెయిన్‌ ఎయిర్‌ ప్లస్‌) కార్యక్రమంలో జీఎంఆర్‌ ఏఏకు రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (ఆర్‌టీసీఎసీ) గుర్తింపును ఐసీఏఓ ఇచ్చింది. భారత్‌లో ఈ హోదా పొందిన మొట్ట మొదటి విమానయాన శిక్షణా సంస్థ జీఎంఆర్‌ ఏఏ. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని జీఎంఆర్‌ ఏఏ, దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సహకారంతో ఐసీఏఓ నిర్వహించింది.
ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్‌ ప్రొటక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) చట్టానికి చేసిన సవరణకు రాజ్యసభ 2019 డిసెంబర్‌ 3న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌ సభ నవంబర్‌ 27నే ఆమోదించింది. ఎస్పీజీ (సవరణ) బిల్లు-2019 ప్రకారం ఇకపై దేశ ప్రధాని, అధికార నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే రక్షణ వ్యవస్థ సేవలు అందు తాయి. బిల్లుపై జరిగిన చర్చలో 'ప్రధానికి కేటా యించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఐదేళ్ల పాటు ఎస్పీజీ రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు' అని హోం మంత్రి అమిత్‌షా వివరించారు.
జూన్‌ నుంచి ఒకే దేశం-ఒకే రేషన్‌ అమలు
వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న 'వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌ కార్డ్‌' పథకం 2020, జూన్‌ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ రేషన్‌ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం (ఎఫ్‌పీఎస్‌) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగ లుగుతారు. వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌ కార్డ్‌ విషయమై కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ 2019 డిసెంబర్‌ 3న మాట్లాడుతూ... బయోమెట్రిక్‌ లేదా ఆధార్‌ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కార్పొరేట్‌ పన్నుల భారం తగ్గింపుకు పార్లమెంట్‌ ఆమోదం
కార్పొరేట్‌ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి 2019 డిసెంబర్‌ 5న పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకువచ్చిన ట్యాక్సేషన్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు, 2019కు పార్లమెంటు ఓకే చెప్పింది.
హజ్‌ యాత్ర డిజిటలీకరణ
పవిత్ర హజ్‌ యాత్ర వివరాలన్నింటినీ పూర్తిగా డిజిటల్‌ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి దేశం గా భారత్‌ అవతరించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ తెలిపారు. వచ్చే ఏడాది యాత్ర కు వెళ్లనున్న భారతీయులకు మక్కా-మదీనాలో కల్పించే వసతులు, అక్కడి రవాణా సదుపాయాలు, ఇ-వీసాల సమా చారమంతటినీ యాప్‌ల ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు.
కేంద్రం, రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ ఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విష యంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల విని యోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు డిసెంబర్‌ 2న నోటీసులు జారీ చేసింది. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడి యాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
అయోధ్య తీర్పుపై పునఃసమీక్ష పిటిషన్‌
అయోధ్య భూ వివాదంపై ఇచ్చిన తీర్పును పునః సమీక్షించా లంటూ 2019 డిసెంబర్‌ 2న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని 'రామ్‌ లల్లాకు' ఇవ్వాలని, సున్నీ వక్ఫ్‌ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరేచోట 5 ఎకరాల భూమిని కేటాయించాలని 2019 నవంబర్‌ 9న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఈ కేసులో ఎం.సిద్ధిఖ్‌ అనే కక్షిదారుకు చట్టబద్ధ వారసుడు, 'జామియత్‌ ఉలేమా ఎ హింద్‌' అధ్యక్షుడు మౌలానా సయ్యద్‌ అషద్‌ రష్డీ పునఃసమీక్ష పిటిషన్‌ వేశారు. 14 అంశాలపై ఆయన సమీక్ష కోరారు. ముస్లింలకు ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలన్న ఆదేశాన్ని ఆయన ప్రశ్నించారు. వేరే భూమి కావాలని ముస్లిం కక్షిదారులు కోరలేదన్నారు.
మహారాష్ట్ర శాసనసభ విశ్వాస పరీక్షలో నెగ్గిన ఠాక్రే
మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం 2019 నవంబర్‌ 30న విశ్వాస పరీక్షలో నెగ్గింది. బీజేపీ సభ్యులు 105 మంది ఓటింగును బహిష్క రించారు. 288 సీట్లున్న అసెంబ్లీలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వా నికి 145 మంది మద్దతు అవసరం కాగా 169 ఓట్లు వచ్చాయి. తీర్మానం నెగ్గిన తర్వాత శాసన సభ్యులకు, మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఠాక్రే కతజ్ఞ తలు తెలిపారు. శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ఢిల్లీవాసులకు ఉచిత వైఫై
దేశ రాజధానిలో నివసించే పౌరులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా అందించే సరికొత్త వైఫై పథకాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ 2019 డిసెంబర్‌ 4న ప్రకటించారు. నగరవ్యాప్తంగా 11,000 హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ నెల 16న 100 హాట్‌స్పాట్‌లను ప్రారంభిస్తామని వెల్లడించారు. నెట్‌ స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ నుంచి 150 ఎంబీపీఎస్‌ వరకు, గరిష్ఠంగా 200 ఎంబీపీఎస్‌ వరకు ఉంటుందని చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ 2015 ఎన్నికల్లోనే ఉచిత వైఫై పథకాన్ని ప్రకటించింది.
'ఐఎండీబీ' ర్యాంకింగ్స్‌లో ప్రియాంకకు తొలిస్థానం
ఐఎండీబీ 'టాప్‌ 10 స్టార్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అండ్‌ టెలి విజన్‌' జాబితాలో ప్రియాంక చోప్రా తొలి స్థానంలో నిలిచారు. ఐఎండీబీ ప్రో స్టార్‌ మీటర్‌ ర్యాంకింగ్స్‌ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఈ జాబితా రూపొం దిస్తారు. నెలకు 200 మిలియ న్లకు పైగా వీక్షణల డేటాను విశ్లేషించి, ఆయా నటులకు సంబంధించి సంవత్సరం పొడవుగా సాధించిన 'వీక్షణల' ద్వారా ర్యాంకులు ప్రకటిస్తారు. సల్మాన్‌ హీరోగా నటించిన 'భారత్‌' సినిమాలో నటించిన నటి దిశా పటాని రెండవ స్థానంలో ఉండగా, 'వార్‌' నటుడు హతిక్‌ రోషన్‌ మూడవ స్థానంలో ఉన్నారు. కియారా అద్వానీ నాల్గవ స్థానం సాధించగా, సూపర్‌ స్టార్స్‌ అక్షరు కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌ వరుసగా ఐదు, ఆరవ స్థానాల్లో ఉన్నారు.
చేతుల శుభ్రతలో కేరళకు ప్రథమ స్థానం
చేతుల శుభ్రత విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మూడు, నాలుగో స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు నిలుస్తున్నాయి. 2018 జూన్‌-డిసెంబరు మధ్య కేంద్ర గణాంకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 76వ జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అన్నం తినే ముందు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకుంటున్నారా? నీటితోనే కడుక్కుంటున్నారా? అని ప్రశ్నిస్తే తెలుగు రాష్ట్రాల్లోని 60% కుటుంబాలు నీటితోనే అని తేల్చి చెప్పాయి. మరుగుదొడ్డికి వెళ్లొచ్చాక మాత్రం సబ్బు నీటితోనే చేతులు శుభ్రం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌లో 54%, తెలంగాణలో 73% కుటుంబాలు స్పష్టం చేశాయి.
స్వచ్ఛత ర్యాంకింగ్‌లో కేఎల్‌ డీమ్డ్‌ వర్సిటీ ప్రథమం
కేంద్ర మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వశాఖ జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛత అవార్డుల్లో కె.ఎల్‌.డీమ్డ్‌ వర్సిటీ మొదటి స్థానం దక్కించుకుంది. దిల్లీలో 2019 డిసెంబర్‌ 3న నిర్వహించిన ఉన్నత విద్యాసంస్థల స్వచ్ఛ క్యాంపస్‌ ర్యాంకింగ్‌-2019 అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ చేతుల మీదుగా కేఎల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి కోనేరు శివ కాంచనలత ఈ అవార్డు అందుకున్నారు.
భారతీయ రైల్వే పనితీరు అధ్వానం : కాగ్‌
రైల్వే శాఖ పనితీరును కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుబట్టింది. 2017-18లో రైల్వేల నిర్వహణ నిష్పత్తి 98.44 శాతం ఉందని కాగ్‌ పేర్కొంది. అంటే రూ.100 రాబట్టు కునేందుకు రూ.98.44 రెల్వే ఖర్చు పెట్టిందని వెల్లడించింది. గత పదేళ్లలో ఎన్నడూ పరిస్థితి ఇంత అధ్వానంగా లేదని తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను 2019 ఈ నెల 2న పార్లమెంట్‌కు అందజేసింది. 2017-18లో రూ.1,665.61 కోట్ల లాభంలో ఉండాల్సిన రైల్వేశాఖ రూ.5,676.29కోట్ల నష్టాల్లో ఉందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. ఖర్చు, ఆదాయం మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉందనేది ఈ నిర్వహణ నిష్పత్తి (ఆపరేటింగ్‌ రేషియో) ద్వారా తెలుస్తుంది.

ప్రాంతీయం
'దిశ' నిందితుల ఎదురుకాల్పులపై దర్యాప్తు
దేశాన్ని పట్టి కుదిపేసిన 'దిశ' కేసులో నలుగురు నిందితులు 2019 డిసెంబర్‌ 6 తెల్లవారుజామున పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. 'దిశ' హత్య కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించడంపై కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. దీనిపై తక్షణం నిజ నిర్ధారణ బందంతో దర్యాప్తునకు ఆదేశించింది. ఎదురు కాల్పులపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకొని 2019 డిసెంబర్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లో ఇంటెల్‌ డిజైన్‌ సెంటర్‌ ప్రారంభం
చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ ఇండియా... డిజైన్‌, ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబా ద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడు గుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు 2019 డిసెంబర్‌ 2న ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎక్సా స్కేల్‌ సూపర్‌ కంప్యూటర్‌ అభివద్ధిలో హైదరాబాద్‌ ఇంటెల్‌ కేంద్రం పాలు పంచుకుంటుందని ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజా ఎం కోడూరి వెల్లడించారు. ఇది యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకోనుంది.
రాజీవ్‌శర్మ పదవీకాలం పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ పదవీ కాలాన్ని నాలుగేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం 2019 నవంబర్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన రాజీవ్‌శర్మ 2016 నవంబరు 30న పదవీవిరమణ పొందారు. తర్వాత ఆయనను ప్రధాన సలహాదారు పదవిలో సీఎం కేసీఆర్‌ నియమించారు.
జయేశ్‌ రంజన్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ పోలార్‌ స్టార్‌ అవార్డు
స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో చేసిన కషికి తెలంగాణ ఐటీ, పరిశ్ర మల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ 'రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ పోలార్‌ స్టార్‌' అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని స్వీడన్‌ రాయబార కార్యాలయం లో స్వీడన్‌ రాజు కార్ల్‌ గుస్తాఫ్‌, రాణి సిల్వియా 2019 డిసెంబర్‌ 4న జయేశ్‌ రంజన్‌కు ఈ అవార్డును అందజేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అవార్డును స్వీడన్‌ దేశ ప్రయోజనాలకు తోడ్పడే వారికి అందజేస్తారు.
జాతీయ స్థాయిలో 'తెలంగాణ ఆవిష్కర్తల' ప్రతిభ
ముంబయికి చెందిన జాగతి సుస్థిర ప్రగతి సంస్థ.. కోకకోలా సహకారంతో నిర్వహించిన జాతీయ స్థాయి నూతన ఆవిష్కరణల పోటీలో తెలంగాణకు చెందిన నలుగురు ఆవిష్కర్తలు బహుమతులు సాధించారు. ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఆరుగురికి బహుమతులు దక్కగా.. అందులో నలుగురు తెలంగాణ వారున్నారు. మండోజి నర్సింహాచారి (పునర్వినియోగ విభాగం), ఉదరు నాడివాడె, రాజేశ్‌ సరాఫ్‌(నీటి స్వచ్ఛత), గోదాసు నర్సింహ (చెరువుల శుద్ధి) ప్రతిభను చాటారు. దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జాగతి సంస్థ మూడేళ్లుగా పోటీలను నిర్వహిస్తోంది.
రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు
జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక, డెయిరీ, మత్స్యశాఖ మంత్రి చైర్మన్‌గా 13 మంది కేంద్ర, రాష్ట్ర అధికారులు, వివిధ సంస్థలకు చెందిన మరో ఏడుగురు సభ్యులుగా బోర్డును ఏర్పాటు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.
రాష్ట్రంలో ఇంటర్‌ అపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌
తెలంగాణ రాష్ట్రంలో న్యాయ విచారణలో సాంకేతిక విప్లవం ప్రారంభమైంది. ఏదైనా నేరం జరిగినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు జరిగే ప్రక్రియలన్నీ ఇకమీదట ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. 'ఇంటర్‌ అపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌)గా పిలిచే ఈ ప్రక్రియను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ 2019 డిసెంబర్‌ 4న ప్రారంభించారు. దేశంలోనే తొలి సారిగా కొంతకాలం క్రితం వరంగల్‌ పోలీస్‌ యూనిట్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇది కాగితరహిత విధానమే కాకుండా వేగం, పారదర్శకతతో కూడినది. విలువైన మానవవనరుల ఆదాకు దోహదం చేసేది కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడీ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తం చేశారు.
మండలానికి రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు
సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పునర్విభ జించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ మండలంలో ఇక రెండు వ్యవసాయ సహకార సంఘాలు ఉండనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ 2019 డిసెంబర్‌ 4న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 905 వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. 272 మండలాల్లో ఒక్కోటి చొప్పున మాత్రమే ఉన్నాయి. 81 మండలాల్లో అసలే లేవు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అసలు లేని మండలాల్లో రెండు చొప్పున, ఒక్కటి మాత్రమే ఉన్న మండలాల్లో మరొకటి చొప్పున కొత్తవి ఏర్పాటు కానున్నాయి. సహకార సంఘాలు పంటరుణాలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
లాభదాయక పదవుల జాబితాలో 28 కార్పొరేషన్ల తొలగింపు
లాభదాయక పదవుల జాబితా నుంచి తెలంగాణలోని 28 ప్రభుత్వ రంగ సంస్థ (కార్పొరేషన్‌)ల చైర్మన్‌ పదవులను ప్రభుత్వం తొలగించింది. ఇందుకోసం వేతనాలు, పింఛన్ల చెల్లింపులు, అనర్హతల తొలగింపు చట్టాన్ని సవరిస్తూ 2019 డిసెంబర్‌ 4న ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్పొరేషన్‌ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవులకు లాభదాయక పదవుల నిబంధన వర్తించకుండా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని భావించారు. రాష్ట్ర మంత్రి మండలి దీనికి ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా ఆర్డినెన్స్‌ జారీ అయింది.

వార్తల్లో వ్యక్తులు
అల్ఫాబెట్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్
భారత సంతతికి చెందిన గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ కు అద్భుత అవకాశం దక్కింది. మాతసంస్థ ఆల్ఫాబెట్‌కు సైతం ఆయనే సీఈఓగా వ్యవహరించనున్నారు. ఈ సాంకేతిక దిగ్గజం సహ వ్యవ స్థాపకులు పేజ్‌ తన సీఈఓ స్థానం నుంచి, బ్రిన్‌ తన ప్రెసిడెంట్‌ హోదా నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ 2019 డిసెంబర్‌ 3న ప్రకటించింది. ప్రస్తుత గూగుల్‌ సీఈఓ బాధ్యతలతో పాటు.. ఆల్ఫాబెట్‌ సీఈఓ పగ్గాలనూ పిచారునే చేపట్టనున్నారు. రెండు దశాబ్దాల కిందట గూగుల్‌ను ఏర్పాటు చేసిన పేజ్‌, బ్రిన్‌లు 2015లో పిచారును గూగుల్‌కు సీఈఓగా చేసి.. వారు ఆల్ఫాబెట్‌లోకి వెళ్లారు. ఇపుడు రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్రను మరింత పరిమితం చేసుకున్నారు.

అవార్డులు
ది సెలైంట్‌ వాయిస్‌ చిత్రానికి జాతీయ అవార్డు
ప్రతి చెరువుకు ఓ స్వరం ఉందనే సందేశాన్నిస్తూ చెరువుల పరిరక్షణపై అవగాహనతో తెరకెక్కిన 'ది సెలైంట్‌ వాయిస్‌' అనే లఘు చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. హైదరా బాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్‌ సునీల్‌ సత్యవోలు దర్శకుడిగా, అన్షుల్‌ సిన్హా నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. సీఎంఎస్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాకు రెండో స్థానం దక్కింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్‌ చేతుల మీదుగా సునీల్‌, అన్షుల్‌ పురస్కారం అందుకున్నారు.
లియోనెల్‌ మెస్సీకి గోల్డెన్‌ బాల్‌ పురస్కారం
అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీని 'బ్యాలన్‌ డి ఓర్‌' (గోల్డెన్‌ బాల్‌) అవార్డు-2019 లభించింది. ప్రతి యేటా ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు ఫిఫా అందించే ఈ ప్రతిష్టాత్మక పురస్కా రాన్ని మెస్సీ ఆరోసారి గెల్చుకోవడం ద్వారా కొత్త చరిత్ర సష్టించాడు. గతేడాది వరకు ఐదుసార్లు చొప్పున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌), మెస్సీ ఈ అవార్డు సాధించి సమఉజ్జీగా నిలిచారు. తాజా పురస్కారంతో రొనాల్డోను వెనక్కి నెట్టి మెస్సీ అత్యధికసార్లు ఈ అవార్డు గెల్చుకున్న ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్‌ సాధించే వారికి ఇచ్చే 'గోల్డెన్‌ బూట్‌' అవార్డును, ఫిఫా బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డును మెగాన్‌ గెల్చుకోవడం విశేషం.
దివ్యాంగులకు ఉపరాష్ట్రపతి పురస్కారాలు
ప్రపంచవ్యాప్తంగా 2019 డిసెంబర్‌ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. న్యూఢిల్లీ లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపికైన దివ్యాంగులకు ఆయన పురస్కారాలు అందజేశారు. రోల్‌ మోడల్‌ విభాగంలో నారా నాగేశ్వరరావు (సరూర్‌నగర్‌, రంగారెడ్డి), ఉత్తమ ఉద్యోగి విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డా.ఐవీ శ్రీనివాసరెడ్డి అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌ బేగంపేటలోని దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ బ్లైండ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రెయిలీ ముద్రణ సంస్థకు దేశంలోనే 'ఉత్తమ బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌-2019'గా ఎంపికైంది. ఫౌండేషన్‌ వ్యవ స్థాపకులు, దేవనార్‌ పాఠశాల కరస్పాండెంట్‌ జ్యోతిగౌడ్‌ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
భారత్‌ జీడీపీ వద్ధిరేటు 5.1 శాతమే : క్రిసిల్‌
భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు 2019 డిసెంబర్‌ 2న ప్రకటించింది. దేశంలో ఊహించిన దానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) 4.75 శాతం వద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్‌-మార్చి) మాత్రం వ ద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి కో-ఆపరేటివ్‌ బ్యాంకులు : ఆర్‌బీఐ
సెంట్రల్‌ రిపాజిటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్స్‌ (సీఆర్‌ఐఎల్‌సీ) పరిధిలోకి రూ.500 కోట్లు, అంతకు మించి ఆస్తులు కలిగిన అన్ని అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులను తీసుకు రావాలని ఆర్‌బీఐ నిర్ణయిం చింది. పెద్ద రుణాల మంజూరుకు సంబంధించిన సమాచారాన్ని సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోని సంస్థలు ఆర్‌బీఐకి వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, ఆర్థిక సంస్థలు దీని పరిధిలో ఉన్నాయి. ఇటీవలి పీఎంసీ బ్యాంకు స్కామ్‌ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయానికి వచ్చింది.

సైన్స్‌ & టెక్నాలజీ
గ్యాస్‌ ఇంజిన్లలో ధ్వని నియంత్రణ మార్గం కనుగొన్న ఐఐటీ-ఎం బృందం
గ్యాస్‌ ఇంజిన్ల నుంచి వచ్చే భారీ ధ్వనులను నియంత్రించే మార్గాన్ని ఐఐటీ మద్రాసుకు చెందిన ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.ఐ.సుజిత్‌ నేతత్వంలోని పరిశోధకుల బృందం కనుగొంది. విద్యుత్తు ప్లాంట్లు, విమాన ఇంజిన్లలో ఉపయో గించే కొన్ని రకాల సాధారణ గ్యాస్‌ టర్బైన్లలో సంభవించే అవాంఛనీయ శబ్దాలు వాటి పరిసరాల్లో ఉన్న వారిని ఆందో ళనకు గురిచేస్తుంటాయని ఐఐటీ పరిశోధకులు పేర్కొన్నారు. వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా టర్బైన్‌ పరిశ్రమ సంవత్సరానికి లక్ష కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలిపారు. ఉపగ్రహ ప్రయోగాలకు ఉపయోగించే ప్రారంభ జనరేషన్‌ రాకెట్ల థర్మోఎకోస్టిక్‌ డోలనం కారణంగా అంతరిక్ష ప్రయోగాలు విఫలమవుతున్నాయని వారు అంచనా వేస్తున్నారు. పెద్ద ధ్వనులు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను ప్రభావితం చేస్తాయని, ఈ కారణంగా నష్టం సంభవిస్తోందని వారు వెల్లడించారు. ఇందుకు విరుగుడుగా ధ్వనుల నియంత్రణకు కొత్తమార్గాన్ని అన్వేషించినట్లు వెల్లడించారు.
తొలిసారి సమాచారం పంపిన నాసా ప్రోబ్‌
సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లిన అంతరిక్ష నౌక పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ మొట్టమొదటిసారి భూమికి సమాచారం పంపింది. ఇది సూర్యుడికి సంబంధించిన అనేక మిస్టరీలను ఛేదించేందుకు ఉపయోగపడుతుందని నాసా వెల్లడించింది.

క్రీడాంశాలు
రోజర్‌ ఫెడరర్‌ గౌరవార్థం వెండి నాణేలు
ప్రపంచ టెన్నిస్‌ వేదికలపై విశేష ప్రతిభ కనబరుస్తున్న తమ విఖ్యాత ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ గౌరవార్థం వెండి నాణేలు విడుదల చేయాలని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్‌ కరెన్సీలో 20 ఫ్రాంక్‌ విలువైన నాణేలపై ఫెడరర్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన బ్యాక్‌హ్యాండ్‌తో కనిపిస్తాడు. 2020, జనవరి 23న ఈ నాణేలను లాంఛనంగా జారీ చేస్తామని స్విస్‌ మింట్‌ తెలిపింది. ఇప్పటికైతే మొత్తం 55 వేల నాణేలను ముద్రించినట్లు పేర్కొంది. జీవించివున్న వ్యక్తి ముఖచిత్రంతో ఇలా నాణేలను విడుదల చేయడం స్విట్జర్లాండ్‌ చరిత్రలో ఇదే తొలిసారి.
న్యూజిలాండ్‌కు స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) న్యూజిలాండ్‌ క్రికెట్‌ను జట్టును 'క్రిస్టోఫర్‌ మార్టిన్‌-జెన్‌కిన్స్‌ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌' అవార్డుకు ఎంపిక చేసింది. కెనడాలోని హామిల్టన్‌ నగరంలో 2019 డిసెంబర్‌ 3న జరిగిన కార్యక్రమంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ), బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌లు ఉమ్మడిగా స్పిరిట్‌ అవార్డును కివీస్‌ జట్టుకు అందజేశారు.
ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ విజేతగా కర్ణాటక
సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక సొంతం చేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌లో 2019 డిసెంబర్‌ 1న జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు ఒక పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది. ముందుగా కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం తమిళనాడు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఈ టోర్నిలో కర్ణాటక జట్టుకు మనీశ్‌ పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సయ్యద్‌ మోడీ ఓపెన్‌ టోర్ని రన్నరప్‌గా సౌరభ్‌
సయ్యద్‌ మోడీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 టోర్నీలో భారత షట్లర్‌ సౌరభ్‌ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో 2019 డిసెంబర్‌ 1న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్‌ సౌరభ్‌ (మధ్యప్రదేశ్‌) 15-21, 17-21తో ప్రపంచ 22వ ర్యాంకర్‌ వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. విజేత వాంగ్‌ జు వెకి 11,250 డాలర్లు (రూ. 8 లక్షలు), రన్నరప్‌ సౌరభ్‌ వర్మకు 5,700 డాలర్లు (రూ. 4 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
శ్రీలంక జట్టు హెడ్‌ కోచ్‌గా ఆర్థర్‌ నియమాకం
శ్రీలంక జట్టు హెడ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను శ్రీలంక క్రికెట్‌ బోర్డు 2019 డిసెంబర్‌ 5న నియమించింది. అతనితో పాటు జింబాబ్వే ఆటగాడు గ్రాంట్‌ ఫ్లవర్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ సకేర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా, షేన్‌ మెక్‌డెర్మట్‌ను ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించింది. ఆర్థర్‌ గతంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు.
కఠ్మాండూలో దక్షిణాసియా క్రీడలు ప్రారంభం
నేపాల్‌ రాజధాని కఠ్మాండూలో 13వ దక్షిణాసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. నేపాల్‌ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి 2019 డిసెంబర్‌ 1న ఈ క్రీడలను ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో భారత్‌, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, భూటాన్‌, మాల్దీవులు దేశాల నుంచి 2,715 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 26 క్రీడాంశాల్లో 1119 పతకాల కోసం క్రీడాకారులు పోటీ పడతారు. భారత్‌ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో బరిలో ఉన్నారు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 308 పతకాలు సాధించింది.
ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ బాబ్‌ విల్లీస్‌ కన్నుమూత
ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ బాబ్‌ విల్లీస్‌(70) 2019 డిసెంబర్‌ 4న మృతి చెందారు. భీకర ఫాస్ట్‌ బౌలర్‌గా పేరున్న విల్లీస్‌ 1982 నుంచి 1984 వరకు 18 టెస్టులు, 29 వన్డేల్లో ఇంగ్లాండ్‌ జట్టుకు నాయకత్వం వహిం చాడు. 90 టెస్టుల్లో 325 వికెట్లు పడగొట్టాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.