Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ముస్లింల స్థితిగతుల అధ్యయనానికి 2005లో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 19,2020

ముస్లింల స్థితిగతుల అధ్యయనానికి 2005లో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ?

1) అతివాదులు - అనుసరించిన పద్ధతులు ఏవి?
1. విదేశీ వస్తువులను బహిష్కరించడం
2. స్వదేశీ వస్తువులను వినియోగించాలి
3. ప్రభుత్వ పదవులను, గౌరవ బిరుదులను త్యజించడం
4. విద్యావ్యాప్తిని ప్రోత్సహించడం
2) రాజ్యాంగ ముసాయిదా కమిటి?
రాజ్యాంగ ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్తు ఏర్పరించింది. ఇందులో ఒక అధ్యక్షుడు మరియు అరుగురు సభ్యులు కలరు.
అధ్యక్షుడు అంబేద్కర్‌
సభ్యులు - 1. అల్లాడి కష్ణస్వామి అయ్యర్‌
2. N. గోపాలస్వామి అయ్యంగార్‌
3. సయ్యద్‌ సాదుల్లా
4. డా|| KM మున్షీ
5.SPBL మిత్తర్‌ కష్ణమాచారి
6.D.P ఖైతాన్‌ మాదవరావు
3) రాజ్యంగ ప్రవేశిక: ప్రవేశికను పీఠిక దిక్సూచి, ముందు మాట, ఉపోద్ఘాతం అని అంటారు. ఇది సాధించవలసిన లక్ష్యాలను ఆశయాలను తెల్పుతుంది. రాజ్యాంగ సారాంశం మొత్తం ప్రవేశికలో కలదు. అందువల్లనే ఠాకూర్‌ దాన్‌ భార్గవ ప్రవేశికను రాజ్యాంగానికి 'ఆత్మ' వంటిదని పేర్కొన్నారు.
4) స్వాతంత్య్రపు హక్కు
స్వాతంత్య్రపు హక్కు గురించి 19-22 వరకు గల అధికరణలు తెలియజేస్తాయి. అవి : 19 అధికరణ ఆరు రకాల స్వేచ్ఛలను పేర్కొంటుంది.
A. భావ వ్యక్తీకరణ మరియు వాక్కు స్వేచ్ఛ
B. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు, సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ
C. సంఘాలు, సమావేశాలు ఏర్పర్చుకునే స్వేచ్ఛ
D. భారత భూభాగంలో సంచరించే స్వేచ్ఛ
E. భారత భూభాగంలో ఏ ప్రాంతరలోనైనా నివసించే స్వచ్ఛ
F. ఏదైనా వత్తి, వ్యాపారం, ఉపాధి వాణిజ్యాలను నిర్వహించునే స్వేచ్ఛ
నిబంధన 20 - ఒక తప్పుకు ఒక శిక్ష, చట్టాన్ని అతిక్రమించనిదే శిక్షంచరాదు
నిబంధన-21 : జీవించే హక్కు
నిబంధన - 21A : 6 నుంచి 14 సం|| లోపు పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాధమిక విద్య
నిబంధన- 22 : అరెస్టు చేసిన వ్యక్తిని 24 గం||ల లోపు సమీపంలో ఉన్న న్యాయ స్థానంలో హాజరు పరచాలి
5) ఏమైనా నాలుగు ప్రాథమిక విధులను తెల్పండి?
1. స్వాతంత్య్రం కోసం జరిగిన జాతీయోద్యమ ఆశయా లను అనుసరించడం
2. దేశ సంరక్షణ కోసం అవసరమైతే దేశ సేవలో పాల్గొనడం
3. ప్రాణికోటి పట్ల దయ కల్గి ఉండటం
4. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాడటం
6) ఎన్నికల గణం/రాష్ట్రపతి ఎన్ని విధానం :
భారత రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికల గణం - (Electoral college) అంటారు. దీనిలో మూడు రకాల సభ్యులు కలరు. వారు : 1. పార్లమెంటు 2. రాష్ట్ర శాసన సభలు 3. ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నిక నైష్పత్తిక ప్రాతిపదికన ఒక ఓటు బదిలి సూత్రాన్ని అనుసరించి జరుగుతుంది.
7) మహాభియోగ ప్రక్రియ/రాష్ట్రపతి తొలగింపు విధానాన్ని తెలండి.
రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే ప్రక్రియను మహాభియోగ ప్రక్రియ అంటారు. రాజ్యాంగాన్ని అతిక్రమించాడనే అభియోగంతో రాష్ట్రపతిని పదవీచ్యుతిడిని చేసే వీలుంది. మహాభియోగ ప్రక్రియ అనేది పార్లమెంటు అనుసరించే పాక్షిక న్యాయ ప్రక్రియ
8) రాష్ట్రపతి పాలన అధికరణ 356
ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పరిపాలన నిర్వహించనపుడు రాష్ట్ర గవర్నర్‌ ఒక నివేదికను రాష్ట్ర పతికి పంపితే అ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆ రాష్ట్రం లో అధికరణ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తాడు.
9) జాతీయ అత్యవసర పరిస్థితి
భారత భూభాగానికి గానీ లేదా ఏదైనా ఒక ప్రాంతపు, భద్రతకు ముప్పు పొంచి ఉందని రాష్ట్రపతి భావించి నట్లయితే కేంద్ర మంత్రి మండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.
10) ఉప రాష్ట్రపతి విధులేవి.
ఉపరాష్ట్రపతి విధులు రెండు రకాలు
అవి : 1. రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించడం
2. తాత్కాలిక రాష్ట్రపతిగా పని చేయడం
11) కేంద్ర మంత్రి మండలి నిర్మాణం
కేంద్ర మంత్రి మండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు. వారు :
1. కాబినేట్‌ మంత్రులు
2. డిప్యూటి మంత్రులు
3. స్టేట్‌ మంత్రులు
12) సమిష్టి బాధ్యత అనగానేమి?
పార్లమెంటు ప్రభుత్వ లక్షణాలలో అత్యంత ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. ఈ నియమాన్ని బ్రిటీష్‌ రాజ్యాంగం నుండి స్వీకరించారు. అధికరణ 75(3) ప్రకారం మంత్రి మండలి లోక్‌సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది.
13) రాజ్యసభ నిర్మాణం
నిబంధన 80 రాజ్యసభ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. రాజ్యసభను ఎగువ సభ, పెద్దల సభ శాశ్వత సభ అని అంటారు. దీని గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం 24 మంది సభ్యులు కలరు.
14) లోక్‌సభ నిర్మాణం
ప్రజల సభ అని పిలువబడే లోక్‌సభలో గరిష్టంగా 552 మంది ఉంటారు. ప్రస్తుతం 541 మంది ఉన్నారు. ఇందులో ఇద్దరిని రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్‌ తెగకు చెందిన వారిని నియమిస్తారు.
15) కోర్టు ఆఫ్‌ రికార్డు
సుప్రీం కోర్టు ఆఫ్‌ రికార్డుగా పని చేస్తుంది. అనగా తీర్పులు నమోదు చేయబడి భద్రపర్చబడతాయి. దీనినే కోర్టు ఆఫ్‌ రికార్డు అంటారు.
16) న్యాయ సమీక్ష అధికారం అనగానేమి?
న్యాయ సమీక్ష అధికారానికి పుట్టినిల్లు అమెరికా. దేశ శాసన సభలు రూపొందించే చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానాలు కొట్టి వేయడాన్ని న్యాయసమీక్ష అధికారం అంటారు.
17) గవర్నర్‌ విచక్షణాధికారాలు:
1. ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం
2. రాష్ట్ర మంత్రిమండలిని తొలగించటం
3. శాసనసభను రద్దు చేయడం
4 రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్రపతికి సలహా ఇవ్వడం
18) విధాన సభ నిర్మాణాన్ని తెల్పండి?
విధానసభను అసెంబ్లీ అని అంటారు. ప్రతి రాష్ట్రానికి ఒక విధానసభ ఉంటుంది. విధానసభ సభ్యుల సంఖ్య కనీసం 60 గరిష్టం 500 మించరాదు. తెలంగాణ విధాన సభ సభ్యుల సంఖ్య 119. విధాన సభ సభ్యులను వీూA లు అంటారు.
19) శాసనసభ స్పీకర్‌
శాసనసభ కార్యకలపాల నిర్వహణ కోసం విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌ సభను హుందాగా నిర్వహిస్తాడు. శాసనసభ తీర్మానం ద్వారా ఇతన్ని తొలగించవచ్చు.
20) విధాన పరిషత్తు నిర్మాణాన్ని తెలపండి?
విధాన పరిషత్తు సభ్యులు ఈ కింది వారిచే ఎన్నికవుతారు.
1. 1/3 వంతు స్థానిక సంస్థల సభ్యులు
2. 1/3 వంతు శాసన సభ్యులు
3. 1/2 వంతు ఉపాధ్యాయులు
4. 1/2 వంతు పట్టభద్రులు (Graduates)
5. 1/6 వంతు గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.
21) కేంద్ర జాబితాపై ఒక నోట్‌ రాయండి?
జాతీయ ప్రయోజనాలు కలిగిన అంశాలు కేంద్ర జాబితాలో ఉంటాయి. వీటిపై శాసనాలు రూపొందించే అవకాశం పార్లమెంటుకు కలదు. ఇవి రాజ్యాంగం ప్రారంభంలో 94 అంశాలు ఉండేవి (ప్రస్తుతం 99కలవు బ్రుక్‌ ప్రకారం 100)
22) ఉమ్మడి జాబితా
ఉమ్మడి జాబితాను రాజ్యాంగ నిర్మాతలు ఆస్ట్రియా రాజ్యాంగం నుండి స్వీకరించారు. కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాలలో పేర్కొనని అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. వీటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. ప్రారంభంలో 44 ఉండేవి ప్రస్తుతం 52 కలవు)
ఉదా : విద్య, వివాహం, విడాకులు, తూనికలు, కొలతలు, మొదలైనవి.
23) సర్కారియా కమిషన్‌
కేంద్ర ప్రభుత్వం 9 జూన్‌ 1983 రంజిత్‌ సింగ్‌ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పరిచింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల పునఃపరిశీలన దీని ముఖ్య ఉద్దేశం. ఈ మిషన్‌ నివేదికను 230 సిఫారసులతో 24 అక్టోబరు 1987 నాడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
24) నీతి అయోగ్‌ NITI Ayog:
NITI - AYOG (NATIONAL INSTITUTION OF TRANSFORMING INDIA Ayog). ర). ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి అయోగ్‌ను 1 జనవరి 2015 నుంచి అమలులోకి తెచ్చారు. రాష్ట్రాలను బలోపేతం చెయ్యడం దీని విధి. పేదరిక నిర్ములన, అసమానతల తొలగింపు దీని లక్ష్యాలు. నీతి అయోగ్‌ చైర్మన్‌గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
25) గ్రామసభ
గ్రామంలో రిజిస్టర్డ్‌ ఓటర్లు సభ్యులుగా ప్రతి గ్రామ పంచాయితీలో ఒక గ్రామసభ ఏర్పాటవుతుందని 243(4) అధికరణం తెలియజేస్తుంది. సర్పంచ్‌ గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు
26) కంటోన్మెంట్‌ బోర్డు
కేంద్ర ప్రభుత్వం సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలలో పౌరులకు అవసరమైన సదుపాయలను కల్పించడానికి కంటోన్మెంట్‌ బోర్డులను ఏర్పాటు చేస్తుంది. సికింద్రా బాదు ప్రాంతంలో కంటోన్మెంట్‌ బోర్డు ఉంది. భారతదేశంలో 62 కంటోన్మెంట్‌ బోర్డులు కలవు.
27) ఇ-పంచాయతీ
గ్రామ పంచాయతీలను బలోపేతం, స్థానిక ప్రభుత్వ పరిపాలన పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 2 అక్టోబర్‌ 2015 న ఇ- పంచాయతీలను ప్రారంభించింది. తొలుత 2400 గ్రామ పంచాయతీలను ఇ-పంచాయితీలుగా ఏర్పాటు చేశారు.
28) ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటి
పంచాయతీలను బలోపేతం చేయడానికి రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎల్‌.ఎం. సింఘ్వి అధ్యక్షతన 1986లో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సూచిస్తుంది.
29) సర్పంచ్‌
గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధిపతియే సర్పంచ్‌. ఇతన్ని గ్రామంలోని రిజస్టర్డ్‌ ఓటర్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. సర్పంచ్‌ గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
30 బల్వంతరాయ్ మెహతా కమిటీ
సమాజాభివద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల అమలు తీరుని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 1957 సంవత్సరంలో బల్వంతరారు మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టాలని సూచించింది. అవి:
1) గ్రామ పంచాయతీ
2) పంచాయతీ సమితి
3) జిల్లా పరిషత్‌
31) షీ బృందాలు :
మహిళల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం షీ బృందాలను 24 అక్టోబర్‌ 2014 లో హైదరాబాదు పోలీసులు ఏర్పాటు చేశారు. పబ్లిక్‌ ప్రదేశాలలో మహిళలపై వేధింపులను నిరోధించడం వీటి లక్ష్యం. ఇందులో ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, నలుగురు కానిస్టేబుల్స్‌ ఉంటారు
32) మైనారిటీలు అనగా ఎవరు?
కేంద్ర ప్రభుత్వం 6 మతాలను మైనారిటీలుగా గుర్తించింది. వారు 1) ముస్లింలు 2) క్రైస్తవులు 3) సిక్కులు 4) బౌద్ధులు 5) పార్శిలు 6) జైనులు
33) రాజేందర్‌ సింగ్‌ సచార్‌ కమిటి
ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని 2005లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టిస్‌ రాజేందర్‌ సింగ్‌ సచార్‌ అధ్యకుడిగా వ్యవహరించాడు.
34) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌
మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం ఏర్పడింది. ఇది రాజ్యాంగ బద్ధమైన సంస్థ కాదు. కాని శాసనబద్ధమైన సంస్థ. దేశంలో 23 రాష్ట్రాలలో మానన హక్కుల కమిషన్లు ఏర్పాటు చేశారు.
                                                   to be continued.....

- దారావత్‌ సైదులు నాయక్‌
సివిక్స్‌ లెక్చరర్‌
గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌
జహీరాబాద్‌, సంగారెడ్డి జిల్లా
ఫోన్‌: 9908569970

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:43 PM

టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్

09:27 PM

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌

09:18 PM

మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు

09:07 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

08:59 PM

నిర్మల్‌లో చిరుత సంచారం

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.