Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అక్రమ మానవ వ్యాపారం, వెట్టిచాకిరి, నిషేధించే నిబంధన ఏది? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 21,2020

అక్రమ మానవ వ్యాపారం, వెట్టిచాకిరి, నిషేధించే నిబంధన ఏది?

(నిన్నటి తరువాయి)
2. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను వివరించండి ?
పరిచయం : ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని IIIవ భాగంలో 235 వరకు గల అధికరణలు పొందు పరిచారు. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. ఇవి రాజ్యాంగం ప్రారంభంలో 7 ఉండేవి. ప్రస్తుతం 6 మాత్రమే కలవు. అవి:
1. సమానత్వపు హక్కు నిబంధన 14-18 :
నిబంధన 14 : చట్టం దష్టిలో అందరూ సమానమే. చట్టం మూలంగా అందరికి సమాన రక్షణ కల్పించాలి.
నిబంధన 15: మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానం వీటిలో ఏ ఒక్క దాన్ని ఆధారంగా ప్రభుత్వం పౌరుడి మీద వివక్షత చూపరాదు.
నిబంధన 16 : అంటరానితనం (అస్పృశ్యత) పాంటించుట నేరంగా పరిగణించడం జరిగింది.
నిబంధన 18: సైనిక లేదా విద్యా సంబంధమయినది తప్ప ఇతర బిరుదులను ప్రభుత్వం ఇవ్వకూడదు.
2. స్వాతంత్య్రపు హక్కు నిబంధన 19-22 : అధికరణ 19 : పౌరులకు ఆరు రకాల స్వేచ్ఛను తెలుపుతుంది.
(A). భావవ్యక్తీకరణ, వాక్కు స్వేచ్ఛ
(B). ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు, సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ.
(C). సంఘాలు, సమూహాలు, ఏర్పరచుకునే స్వేచ్ఛ
(D). భారత భూభాగమంతా సంచరించే స్వేచ్ఛ
(E). భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛ
(F). ఏదైనా వత్తి ఉపాధి, వ్యాపార, వాణిజ్యాలను నిర్వహించు కునే స్వేచ్ఛ.
గమనిక : అధికరణ 19(F) ఆస్తిని సంపాధించుకునే స్వేచ్ఛ 1978 సం||లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
అధికరణ 20 : ఏ వ్యక్తిని చట్టాన్ని అతిక్రమించనిదే శిక్షకు గురి చేయరాదు. ఒక తప్పుకు ఒకే శిక్ష విధించాలి.
అధికరణ 21 : జీవించే హక్కు. దీనిని ప్రాణ రక్షణ హక్కు అని కూడా అంటారు. 21(A) 6-14 సం||ల పిల్లలందరికీ ఉచిత విద్యను ప్రభుత్వం అందించాలి. 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేర్చబడింది.
అధికరణ 22 : అరెస్టు చేసిన వ్యక్తిని కారణం తెలపకుండా నిర్బంధించరాదు. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గం||లలోపు సమీపంలోని న్యాయస్థానంలో హాజరు పరచాలి.
3. పీడనాన్ని నిరోధించేందుకు అధికరణ 23-24 :
అధికరణ 23:అక్రమ మానవ వ్యాపారం, వెట్టిచాకిరి, ఇతర రూపాలలో బలవంతంగా పనిచేయించడం నిషేధం.
అధికరణ 24 : 14 సం||లలోపు పిల్లలను కర్మాగారాలు గనులు తదితర ప్రమాదకరమైన వత్తులలో పని చేయించరాదు.
4. మతస్వాతంత్య్రపు హక్కు అధికరణ 25-28 :
అధికరణ 25: ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరిం చడానికి, ప్రచారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కలదు.
అధికరణ 26: మతపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవ డానికి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది.
అధికరణ 27 : ప్రకారం మతాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తులపై ఏ విధమైన పన్నులు విధించరాదు.
అధికరణ 28 : ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని పొంది నడుపబడుతున్న విద్యాసంస్థల్లో మత బోధన నిషేధం.
5. సాంస్కృతిక, విద్యా విషయ హక్కు అధికరణ 29-30 :
అధికరణ 29: ప్రకారం ప్రతి పౌరుడు తన స్వీయభాష లిపిని సంస్కృతిని కాపాడుకోవచ్చు.
అధికరణ 30: ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాల వారు విద్యా సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే స్వేచ్ఛ కలదు.
గమనిక: నిబంధన 31 ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 సం||లో ఆస్తి హక్కుల జాబితా నుండి రద్దు పరిచారు. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్దమైన హక్కుగా రాజ్యాంగంలో XII వ భాగంలో నిబంధనలు 300(A)లో కొనసాగుతుంది.
6. రాజ్యాంగ పరిహారపు హక్కు అధికరణ 32 : ఈ హక్కును ప్రాథమిక హక్కులకు కంచెగాను, రక్షణ కవచంగాను, భద్రత వలయంగా పేర్కొరటారు. అంటే వ్యక్తుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగినట్లయితే నిబంధన 32 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్లను (1. హెబియస్‌ కార్పస్‌, 2. మండమస్‌ 3. ప్రొహిబిషన్‌ 4. కోవారెంటో 5. షెర్షియోరరీ) జారీ చేసి రక్షిస్తుంది. కావున డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ ఈ హక్కును ప్రాథమిక హక్కులకు 'ఆత్మ' వంటిదని అభివర్ణించెను.
3. ఆదేశిక సూత్రాలను వివరించండి?
పరిచయం: రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ రాజ్యాంగం నుండి గ్రహించారు. రాజ్యాంగంలోని IV వ భాగంలో నిబంధన 36-51 వరకు పొందుపరిచారు. శ్రేయోరాజ్య స్థాపన వీటి లక్ష్యం. ఇది 3 రకాలు. అవి :
1. సామ్యవాద సూత్రాలు : నిబందన 38, 39, 41, 42, 43, 46, 47
నిబంధన 38 : ప్రజలందరికి సామాజిక న్యాయాన్ని అందిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కషి చేయాలి.
నిబంధన 39 : ప్రజలందరికి జీవనభతిని కల్పించడం, జాతీయ సంపదను వికేంద్రీకరించడం, స్త్రీ పురుషులకు సమాన వేతనాలు అందించబడతాయి.
నిబంధన 41: నిరుద్యోగిత, వద్ధాప్యం, అంగవైకల్యం తదితర పరిస్థితులలో సహాయం. పని హక్కు, విద్యా హక్కును కల్పించాలి.
నిబంధన 42 : స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం కార్మికులకు పనిచేసేందుకు తగిన పరిస్థితులను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
నిబంధన 43. కార్మికులందరికీ కనిస జీవన వేతనం మెరుగైన పని గంటలు కల్పించడం.
నిబంధన 46 : షెడ్యూల్‌ తెగల, కూలాల మరియు అల్ప సంఖ్యాకులకు విద్యారంగ సదుపాయాలను ప్రభుత్వం అందించాలి.
నిబంధన 47: ప్రజల జీవన ప్రమాణాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషక ఆహారాన్ని అందించాలి.
2) గాంధేయవాద సూత్రాలు: నిబంధనలు 40, 43, 44, 47, 48, 49 (ఎ)
నిబంధన 40: ప్రభుత్వం గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసి అధికారాలను కల్పించి వీటిని స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలి.
నిబంధన 43 : గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా గాని సామూ హిక రంగాలలో గాని కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయడం.
నిబంధన 46 : బలహీన వర్గాల వారికి విద్య, ఆర్థిక సదుపా యాలను అందించడం.
నిబంధన 47: మద్యం మత్తుపదార్థాల నిషేధం.
నిబంధన 48: ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యవసాయన్ని నిర్వహించి, పశువులు, గోవులను వధించడం నిషేధం
48(ఎ) : పర్యావరణాన్ని పరిరక్షించి అడవులు, వన్య ప్రాణు లను సంరక్షించడం.
నిబంధన 49 : చారిత్రక, జాతీయ ప్రాముఖ్యత వున్న ప్రదేశాల ను సంరక్షించడం
3) ఉదారవాద సూత్రాలు: నిబంధనలు 44, 45, 50, 51
నిబంధన 44 : దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
నిబంధన 45 : బాల్యంలో పిల్లల సంరక్షణ మరియు 6సం||ల పిల్లలందరికి పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలి.
నిబంధన 50 : కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి.
నిబంధన 51: అంతర్జాతీయ శాంతి భద్రతను ప్రోత్సహిస్తూ దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం
4 భారత రాష్ట్రపతి సాధారణ అధికారాలను గురించి వర్ణించండి?
పరిచయం : భారతదేశ ప్రథమ పౌరుడు దేశానికి రాజ్యాంగ బద్దమైన అధిపతియే భారత రాష్ట్రపతి. దేశ అస్థిత్వాన్ని కాపాడటం ఇతని బాధ్యత. దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. ప్రస్తుత భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌. భారత రాష్ట్రపతి అధికారా లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి.. 1. సాధారణ అధికారాలు 2. అత్యవసర అధికారాలు 1. కార్య నిర్వహణాధికారాలు : నిబంధన 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి చెందు తాయి. ఆ అధికారాలను రాష్ట్రపతి నేరుగా గానీ లేదా అతడి ద్వారా నియమించబడిన వ్యక్తులచే గాని నిర్వహిస్తాడు. రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్‌లను ప్రధాన మంత్రిని, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులను మరియు వివిధ కమిషన్‌ల చైర్మన్‌, సభ్యులను నియమిస్తాడు.
2. శాసనాధికారాలు : నిబంధన 79 ప్రకారం రాష్ట్రపతి పార్ల మెంటులో అంతర్భాగం, పార్లమెంట్‌ అనగా లోకసభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి. రాష్ట్రపతి పార్లమెంట్‌ ఉభయ సభలను సమావేశ పరచడం, వాయిదా వేయడం మరియు కేంద్రమంత్రి మండలి సలహాపై లోక్‌సభను రద్దుచేసే అధికారం కలదు. లోకసభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మంది విశిష్ఠ వ్యక్తులను నామినేట్‌ చేస్తాడు. పార్లమెంటు ఉభయసభలు సమావేశంలో లేనపుడు అధికరణ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేస్తాడు.
3. ఆర్థికాధికారాలు : కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్‌ను సభ్యులు పార్లమెంటులో ప్రవేశపెట్టేలా చూస్తాడు. ఇతడు భారత సంఘటిత నిధిని నిర్వహి స్తాడు. ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో లోక్‌సభలో ప్రవేశ పెట్టాలి. ప్రతి 5 సం||లకు ఆర్థిక సంఘం చైర్మన్‌, సభ్యులను నియమి స్తాడు. ఆ సంఘం, కాగ్‌ నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తాడు.
4. న్యాయాధికారాలు: రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. కోర్టు విధించిన శిక్షలను తగిన కారణమున్న పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయడానికి శిక్ష అమలు కాకుండా వాయిదా వేయడానికి, ఒక రకమైన శిక్షను వేరొక రకం శిక్షగా మార్చడానికి శిక్షని పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి కలదు.
5 సైనిక అధికారాలు: రాష్ట్రపతి భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు. ఆ హౌదాలో త్రివిద దళాలకు అధిపతులను నియమిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధాన్ని ప్రకటించడం, సంధి ఒడంబడికలు కుదుర్చుకోవడం వంటి అధికారాలు ఇతనికి కలవు.
6. దౌత్య అధికారాలు : రాష్ట్రపతి ఇతర దేశాలలో భారత రాయబారులను నియమిస్తాడు. ఇతర దేశాలు భారతదేశానికి నియమించిన రాయబారుల నియామక పత్రాలను స్వీకరిస్తాడు. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలు రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి.
5) భారత ప్రధానమంత్రి అధికారాలను వర్ణించండి?
పంచయం : కేంద్ర ప్రభుత్వ వాస్తవ (నిజమైన) కార్య నిర్వాహక అధిపతియే భారత ప్రధానమంత్రి. ప్రభుత్వాధినేతగా కేంద్రంలో అపారమైన అధికారాలను, అసంఖ్యమైన విధులను కలిగి ఉంటాడు. నిబంధన 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
1. ప్రధానమంత్రి - కేబినెట్‌ నాయకుడు : ప్రధానమంత్రి ఆదేశాలకనుగుణంగా మంత్రి మండలి విధులను నిర్వహిస్తుంది. మంత్రి మండలి ఏ వ్యక్తినైనా తొలగించే లేదా నియమించే అధికారం ప్రధానమంత్రికి ఉంది. ఇతడు మంత్రులు మధ్య శాఖలు మార్చగలడు. ప్రధాన మంత్రి కేబినెట్‌ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
2. ప్రధానమంత్రి - మెజార్టీ పార్టీ నాయకుడు : ప్రధాన మంత్రి ప్రజల సభ అయిన లోక్‌సభలోని మెజార్టీ పార్టీ నాయకుడు. ఇతడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి.
3. ప్రధానమంత్రి పార్లమెంటు నాయకుడు : ప్రధాన మంత్రి ప్రభుత్వాధినేతగా, పార్లమెంటు నాయకుడిగా పరిగణించబడతాడు. ''ఇతడు కేబినెట్‌ నిర్ణయాలను పార్లమెంటుకు తెలియజేస్తాడు. ప్రభుత్వ విధానాలను దేశీయ, విదేశీ పార్లమెంటు సభ్యులకు వివరిస్తాడు.
4. ప్రధానమంత్రి - రాష్ట్రపతి, మంత్రి మండలి మధ్య వారధి : ప్రధాన మంత్రి రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి మధ్య వారధిలా వ్యవహరిస్తాడు. ఇతడు మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం, రాష్ట్రపతి ఇచ్చే సూచనలను మంత్రిమండలికి తెలియజేయడం చేస్తాడు. మంత్రులెవరైనా రాష్ట్రపతిని కలవాలంటే ముం దుగా ప్రధానమంత్రి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
5. ప్రధాన మంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకుడు : కేంద్ర ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి దేశ ప్రజల ఉన్నతి, అభివద్ధికి తోడ్పడే పథకాలను, విధానాలను, కార్యక్రమాలను కేంద్ర మంత్రి మండలితో కలిసి రూపొం దించి అమలు పరుస్తాడు. ప్రభుత్వ యంత్రాంగం అంత కూడా ప్రధాని ఆదేశానుసారం నడుస్తుంది.
6. ప్రధానమంత్రి దేశానికి నాయకుడు : ప్రధానమంత్రి దేశ నాయకుడిగా ప్రభుత్వాధినేతగా పార్లమెంటు లోపల, బయట ఇతడి వ్యాఖ్యలు దేశానికి ముఖ్యమైన విగా ఉంటాయి. ఇతర దేశాలను సందర్శించినప్పుడు, ప్రధానమంత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇతని అభిప్రాయం జాతి అభిప్రాయాలు పరిగణించబడతాయి.
ముగింపు: ప్రధానమంత్రి పదవి దేశ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైనది, విశిష్టమైనది. ప్రధానమంత్రి శక్తి, సామర్థ్యాలపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రిని చుక్కల్లో చంద్రుడు, పడవను నడిపేవాడు, కేంద్ర ప్రభుత్వం అనే ప్రాకారానికి మూల స్తంభం లాంటివాడు అని అభివర్ణిస్తారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:15 AM

జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..

11:07 AM

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ

11:05 AM

ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత

10:49 AM

గణతంత్ర వేడుకల్లో ఘర్షణ

10:48 AM

దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు

10:45 AM

మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్

10:43 AM

టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి

10:40 AM

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

10:38 AM

జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

10:27 AM

పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్

09:54 AM

రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం

09:49 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:47 AM

ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

09:38 AM

ట్రక్కును ఢీకొన్న అంబులెన్సు: ఐదుగురి మృతి

09:05 AM

బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్య

08:59 AM

అదుపు త‌ప్పి పొలాల్లో‌కి దూసుకెళ్ళి‌న పెళ్లి బ‌స్సు‌

08:50 AM

నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..!

08:29 AM

ప్రియుడికి ఎయిడ్స్‌ ఉందని తెలిసినా ప్రియురాలు..!

08:25 AM

రాజేంద్రనగర్‌లో అర్ధ‌రాత్రి అగ్ని‌ప్ర‌మాదం

08:10 AM

కోయంబత్తూర్‌లో నాటుబాంబు పేలుడు కలకలం

07:51 AM

మందుబాబులకు భారీ షాక్...

07:33 AM

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:30 AM

నేడు అయోధ్య మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

07:20 AM

కాశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!

07:17 AM

ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్‌ మార్చ్‌

06:58 AM

నేడే కిసాన్‌ గణతంత్ర పరేడ్‌

06:51 AM

నేడు ఉప్పల్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీ

06:48 AM

డివైడర్ ను ఢీ కొట్టిన బస్సు: 12 మందికి గాయాలు

10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.