Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బీజేపీకి మరో భంగపాటు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 25,2020

బీజేపీకి మరో భంగపాటు

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల తరువాత జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీకి మరోసారి శృంగభంగం జరిగింది. ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత మొట్టమొదటి సారి జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల (డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌-డీడీసీ) ఎన్నికల్లో వివిధ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటైన పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) ఘన విజయం సాధించిన తీరు అక్కడి ప్రజాభిప్రాయాన్ని దేశ ప్రజల కండ్లకు కడుతోంది. బీజేపీ ఏకపక్ష, నిరంకుశ ధోరణలకు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు! జమ్మూకాశ్మీర్‌లోని 20 జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో 13జిల్లాల కౌన్సిళ్లను పీఏజీడీ కైవసం చేసుకుంది. బీజేపీకి జమ్మూ ప్రాంతంలోని ఆరు జిల్లాలు మాత్రమే దక్కాయి. అయితే, ఈ వాస్తవాన్ని కూడా తిమ్మిని బమ్మి చేసి బీజేపీ ఏదో సాధించిందన్నట్టుగా చెప్పడానికి సంఘ పరివారమూ, వారికి కొమ్ము కాసే గోడీ మీడియా చేస్తున్న ప్రయత్నాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిందనో, కాశ్మీర్‌లో కమలం మొదటిసారి విరబూసిందనో వెలువడుతున్న వార్తలు, వ్యాఖ్యలు ఈ కోవలోవే! ఈ తరహా ప్రచారం ద్వారా వాస్తవాలను మరుగున పెట్టడంతో పాటు, కీలకాంశాలను ప్రజల దృష్టికి రాకుండా చేయడం సంఫ్‌ు వ్యూహం!
జమ్మూ కాశ్మీర్‌లోని 20జిల్లాల్లోని 280స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫరూక్‌ అబ్దుల్లా నేతత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, మెహబూబా ముఫ్తీ నేతత్వంలోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ)లతో పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, జెకె పీపుల్స్‌ మూవ్‌మెంట్‌, సీపీఐ(ఎం) కలిసి పీఏజీడీ కూటమిగా బీజేపీతో ముఖాముఖి తలపడ్డాయి. ఎన్నికల ముందే ఏర్పడిన ఈ కూటమికి 100కు పైగా స్థానాలు దక్కగా, కూటమిలోని వివిధ పార్టీలు సాధించిన సీట్లను విడివిడిగా చూపుతూ బీజేపీ (75 సీట్లు)ని అతి పెద్ద పార్టీగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం గోబెల్స్‌ ప్రచారం కాక మరేమవుతుంది? ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ 23స్థానాలను దక్కించుకుంది. కాశ్మీర్‌ లోయలో సాధించిన స్థానాల గురించి కూడా సంఫ్‌ు పరివారం ఇటువంటి ప్రచారానికే తెరతీసింది. మొత్తం 10జిల్లాలున్న ఈ ప్రాంతంలో 72 సీట్లలో పీఏజీడీ గెలుపొంది, 9జిల్లాలను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు ఎక్కువమంది గెలవడంతో శ్రీనగర్‌ జిల్లాను ఎవరు దక్కించుకుంటారన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. ఇక, కాంగ్రెస్‌ 9స్థానాల్లో గెలవగా, బీజేపీకి దక్కింది మూడంటే మూడే! బీజేపీ బలంగా ఉందని భావించే జమ్మూ ప్రాంతంలో ఆ పార్టీ 71స్థానాలను గెలిచి 6 జిల్లాలను సొంతం చేసుకోగా, 35స్థానాల్లో గెలిచిన పీఏజీడీ నాలుగు జిల్లా కౌన్సిళ్లను కైవసం చేసుకుంది. కుల్గాం జిల్లాల్లో పోటీ చేసిన ఐదు స్థానాలనూ సీపీఐ(ఎం) గెలుచుకుంది. కాశ్మీర్‌ లోయతో పాటు, జమ్మూ ప్రాంతంలోనూ పీఏజీడీ గణనీయమైన ప్రభావం చూపిందన్నది నిర్వివాదాంశం. దీనిని తక్కువ చేసి చూపడానికి బీజేపీ పడరాని పాట్లు పడుతోంది.
నిజానికి బీజేపీకి కనపడుతున్న సంఖ్యాబలం కూడా వాపే తప్ప బలం కాదు. దాదాపు ఏడాదికి పైగా కొనసాగుతున్న నిర్బంధ పరిస్థితులు ఎన్నికల సమయంలోనూ కొనసాగాయి. బీజేపీకి చెందిన అతిరథ మహారథులు జమ్మూకాశ్మీర్‌ అంతా తిరిగి ప్రచారం చేయగా, కాంగ్రెస్‌తో పాటు పీఏజేడీి నేతలకు ఆ అవకాశం లభించలేదు. వీరిలో కొందరు ఇప్పటికీ గహనిర్బంధంలో ఉండగా, మిగిలిన వారిపైనా ఆంక్షలు కొనసాగాయి. సభలు, సమావేశాలు స్వేచ్ఛగా నిర్వహించే పరిస్థితి లేదు. బీజేపీతో సమాన అవకాశాలు లభించి ఉంటే పీఏజేడీ మరిన్ని సీట్లను సాధించి ఉండేద నడంలో సందేహం లేదు. అయినా, పీఏజేడీకే ప్రజానీకం జై కొట్టారంటే వారి అభిమతం స్పష్టం! జమ్మూకాశ్మీర్‌ ప్రజలు ఆర్టికల్‌ 370, 35ఎ రద్దును నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అదే ప్రజా తీర్పు! నరేంద్ర మోడీ నేతత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలి! వికృత భాష్యాలకు పోకుండా ప్రజల మనోభీష్టానికి పట్టం కట్టాలి. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేలా 370, 35ఎ అధికరణాలను పునరుద్ధరించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

03:08 PM

నేడు సాయంత్రం ముగియనున్న ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

02:39 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

01:10 PM

విరాట ప‌ర్వం నుంచి ప్ర‌త్యేక వీడియో

12:55 PM

అసెంబ్లీ బయట ఆప్‌, ఎస్‌ఏడీ ఆందోళన

12:44 PM

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

12:39 PM

అమ‌ర‌చింత‌లో ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌

12:29 PM

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు‌లో 2.3కిలోల‌ బంగారం పట్టివేత

12:21 PM

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం..బీజేపీ నేత సంచలన ప్రకటన

12:04 PM

టీఆర్ఎస్ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

11:54 AM

ముళ్ల‌పొద‌ల్లో అప్పుడే పుట్టిన ఆడ‌శిశువు

11:44 AM

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఎస్‌బీఐ బంపరాఫర్

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

07:03 AM

హెలికాప్టర్ ప్రమాదంలో ఎంపీ మృతి

06:55 AM

టీడీపీ సీనియర్ నేత కూమారుడు బ్రెయిన్ డెడ్‌తో మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.