Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆగని ఆపదలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 26,2020

ఆగని ఆపదలు

యూకేలో రూపం మార్చుకున్న కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ ఈ రోజు ప్రపంచ ప్రజలను మళ్ళీ భయబ్రాంతులకు గురిచేస్తున్నది. ఎప్పుడో సెప్టెంబర్‌లోనే అక్కడ మ్యుటేషన్‌ పొందిన కరోనా ఇప్పుడు దాని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తతంగానే కరోనా వైరస్‌ ప్రభావం నుంచి సాధారణజీవనంలోకి అడుగుపెడుతున్న ప్రజలకు ఈ స్ట్రెయిన్‌ హెచ్చరికలు చేస్తోంది. బ్రిటన్‌లో తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో తిరిగి విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అందుకని అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించారు. క్రిస్మస్‌ వేడుకలను కూడా కట్టడిచేశారు. విమాన సర్వీసులూ రద్దుచేశారు.
ఈ సందర్భంలో బ్రిటన్‌ నుంచి భారత్‌కు పన్నెండు వందల మంది వచ్చారు. వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించే పనిని ప్రభుత్వం చేపట్టింది. మనహైదరాబాద్‌కు కూడా పాజిటీవ్‌ కేసులు దిగుమతి అయ్యాయి. అవి స్ట్రెయిన్‌ కేసులేనా కాదా అనేది తేలాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా కరోనాకు వాక్సిన్‌ తయారై అందరికీ అందించటానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఇదో కొత్త బాంబు పేలింది. వాక్సిన్‌ వస్తోందన్న సంతోషాన్ని, కరోనాను ఎదుర్కొంటామన్న ధైర్యాన్ని ఈ స్ట్రెయిన్‌ కబళించివేసింది. కొత్తగా విస్తరిస్తోన్న కరోన పాతదానికంటే డెబ్బయిశాతం ఎక్కువ విస్తరణ సామర్థ్యాన్ని కలిగి ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు యూఎన్‌ఓ చెబుతోంది. అయితే కోవిడ్‌-19 కన్నా ఇది ప్రమాదకరమైన వైరస్‌ అని, దీంతో మరణాల రేటు పెరుగుతుందని ఇంకా నిర్థారణ కాలేదు. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యూకే మాత్రం కొత్త వైరస్‌ విస్తరణతో యుద్ధం చేస్తూనే ఉంది.
ఇక అసలు విషయమేమంటే.. ప్రకృతిలో ఉన్న ప్రతి జన్యువూ మార్పులకు గురవుతూనే ఉంటుంది. ఈ వైరస్‌ మ్యుటేషన్‌ కూడా అందులో భాగమే. ఈ మ్యుటేషన్‌ అనేది పరిణామ క్రమంలో సాధారణమైన అంశం. ఈ మ్యుటేషన్‌ రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి పర్యావరణంలో కలిగే మార్పుల వల్ల, రెండోది పునరుత్పత్తి క్రమంలో. వాతావరణంలో మార్పులు నూక్లియర్‌ రేడియేషన్‌ వల్ల అతినీలలోహిత కిరణాలు జీవజాలంపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. క్యాన్సర్‌ వంటి వ్యాధులకు కారణమిదే. ఈ పరిణామాలు జీవావరణంపై కలుగచేస్తున్న ఫలితమే ప్రాణాంతక కరోనా.
ఐక్యరాజ్యసమితి తన యూఎన్‌డీపీ నివేదికలో ముందుగానే కోవిడ్‌-19 తరువాత వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంగానే తెలిపింది. శాస్త్రవిజ్ఞానం కూడా కరోనా ఒక ఉదాహరణ మాత్రమేనని, రాబోయే కాలంలో ఇలాంటివి చాలా వస్తాయని చెపుతోంది. ఈ విపత్తులు, సంక్షోభాలు సాధారణ మవుతున్నప్పుడు, వీటిని ఎదుర్కోవడానికి మనం, మన ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా? అనేది ఓ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నివేదికలో ఇంకా ఏముందంటే జీవావరణ విధ్వంసమే విపత్తులకు కారణమని తేల్చి చెప్పింది.
మనిషి తన ఆవరణంతో ప్రవర్తిస్తున్న తీరు, జంతువులతో వ్యవహరించే తీరులో వచ్చిన మార్పులు ప్రమాదాలను ఎగదోసాయి. జంతువులను చంపి వాటి మాంసాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్‌, అంతర్జాతీయ లాభాల మార్కెట్‌గా మార్చిన తరువాత, ఆ మాంసం కోసం లక్షలాది జంతువులను అసహజమైన, కృత్రిమమైన రీతిలో ఒకేచోట పెంచటం మూలాన సహజ జీవాభివృద్ధి సంక్షోభంలో పడింది. అదుకనే మెక్సికన్‌ నవలాకారుడు తన నవలలో పందుల పెంపకాన్ని, వాటిని చంపటాన్ని వర్ణిస్తూ... 'ఇక్కడ పందుల అరుపులు తప్ప ప్రతి ఒక్కటీ వ్యాపారమే' అని పేర్కొంటాడు. నిత్యం ఆ జంతువులను మూకుమ్మడిగా చంపుతున్నప్పుడు అవి అరిచే తీరును భయంకరంగా వివరిస్తాడు. అప్పుడు అక్కడి వ్యాపారులు అవి అరవకుండా ఎలా చంపాలో తెలుసుకుని అమలు చేస్తారు.
ఈ విషయాలను వివరించటమెందుకంటే మన జీవన పద్ధతులు, వ్యాపార మౌలిక స్వభావాలు, మార్కెట్‌ లాభాలు మొదలైన వ్యవహారాలతో పాటు ఉత్పత్తి, పంపిణీ విధానాలు ఇప్పటికైనా మారకపోతే నిత్యం ఇక ఇలాంటి విపత్తులే ఎదురవుతాయనేది అతిశయోక్తి కాదు. అక్షర సత్యం. ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచించకుండా వ్యాక్సిన్‌లు, మందులు మాత్రమే పరిష్కారంగా కనిపెడుతూపోతే ప్రతి మాసానికొక కొత్త వాక్సిన్‌ అవసరమవుతుంది.
కానీ, మన ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ల కోసం మార్చివేస్తున్న సందర్భంలో..ఆ కార్పొరేట్లు వ్యాపారుల సరళికి భిన్నంగా ప్రజానుకూల, పర్యావరణ రక్షణ చర్యలను చేపడుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కొత్త విపత్తులు ముంచుకొస్తున్న వేళ కూడా ప్రజల రక్షణ కోసం పరితపించడం మాని, సామాన్య రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో మునిగిపోయిందీ ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ ఆపదలపై దృష్టిపెట్టి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుందాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

08:50 PM

వరంగల్ జిల్లాలో విషాదం..

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.