Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అవలోకనం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 27,2020

అవలోకనం

కోవిడ్‌-19 కల్లోలపు వార్తలతో ఆరంభమైన 2020 మరో నాలుగురోజుల్లో ముగిసిపోతుంది. కానీ కరోనా భయం తొలగలేదు. వ్యాక్సిన్‌ రాలేదు. వచ్చిందని చెబుతున్న వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌కు గురిచేస్తున్న వార్తలు భయకంపితుల్ని చేస్తున్నాయి. అందరూ సురక్షితంగా ఉండే పరిస్థితులు నెలకొనేవరకు ఎవరూ క్షేమంగా ఉన్నట్టు కాదని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్యసంస్థే చెబుతున్నది. వ్యాక్సిన్‌ రావడం ఒక్కటే పరిష్కారం కాదు, కరోనా వైరస్‌ సోకినవారికి చక్కని ఆరోగ్యసేవలు అందడం ముఖ్యం. కానీ 'అందరికీ ఆరోగ్యం'లానే ఇది కలగా మారడం ఒక వాస్తవం. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగవివక్ష వంటి తేడాలు చూపకుండా అందరికీ సమాన ఆరోగ్యసేవలు అందించడం ఆయా దేశాల బాధ్యత అని ప్రపంచ ఆరోగ్యసంస్థ విస్పష్టంగా పలికింది. కానీ 2020లో వైద్య ఆరోగ్యసేవలు ఎంత ఖరీదయిన వ్యవహారంగా పరిణమించాయో తెలిసిందే.
వైద్యరంగాన్ని కార్పొరేట్‌శక్తుల్నించి విముక్తి చేయకుండా అందరికీ సమానమైన ఆరోగ్యసేవలు అందించడం సాధ్యం కాదు. కరోనా కల్లోల కాలంలో ప్రయివేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల పరమ దుర్మార్గమైన దోపిడీ ఎందరి బతుకుల్నో ఛిద్రం చేసింది. సర్కారు ఆస్పత్రుల ద్వారా కరోనా బాధితులకు సేవలు అందిస్తామన్న మాట వట్టిమాటగా మిగలడమూ చూసాం. కరోనా వ్యాక్సిన్‌ పేరుతో చేస్తున్న రాజకీయాలు, కోట్లకు పడగలెత్తాలనే కార్పొరేట్ల కుటిల వాణిజ్య వ్యూహాలు వికృతరూపం దాల్చాయి. నిజానిజాల్ని చెప్పకుండా కరోనా గురించి ప్రచారంలో పెట్టే వార్తలు లేని భయాల్ని కల్పిస్తున్నాయి. మనుషుల్లోని ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భరోసాగా నిలవాల్సిన వ్యవస్థలు మనుషుల్ని భీతావహుల్ని చేస్తున్నాయి.
ఈ ఏడాది మార్చి 20 తరువాత మొదలయిన కరోనా కల్పిత భయాందోళనల్నించి విముక్తి లభించలేదు. లాక్‌డౌన్‌తో మొదలయిన ఇక్కట్లు అనేకరెట్లు పెరిగి బతుకుల్ని చిద్రుపలు చేశాయి. ఆసరా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మాటలతోనే సరిపెట్టాయి. కీలకమైన ఆరోగ్య సంక్షోభం కార్పొరేట్లకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించి పెట్టింది. ఈ ఏడాది ఈ దేశంలోని కొద్దిమంది తప్ప కోట్ల మంది మనో వ్యాకులతతో తల్లడిల్లారు. బతుకు రుజాగ్రస్థమై అల్లాడిపోయారు. ఏడాది చివరలో గడచిపోయిన రోజుల్ని అవలోకిస్తే విషాదమే తప్ప ఆశావహరేఖ ఒక్కటీ కనిపించడం లేదు.
ప్రపంచాన్ని కుదిపేసిన మహా సంక్షోభం మనుషుల్ని ఏకం చేయాలి. మానవుల్లో వివేచనకు దారులు తీయాలి. ఇందుకు విరుద్ధంగా కొంతమంది పేరాశలు ప్రపంచ గమనాన్ని నిర్దేశించే రీతిన కొనసాగడం మానవాళికి విఘాతం. ఎల్లెడలా నిరంకుశత్వపు, అప్రజాస్వామికపు పోకడలు జనం బతుకుల్ని కన్నీటిమయం చేయడం 2020లోని క్రూర వాస్తవం. మనదేశంలో నెలరోజుల తరబడి గడ్డకట్టే చలికి తట్టుకుంటూ ఆందోళన చేస్తున్న రైతులపైన కనీస కనికరం చూపని సర్కారు ధోరణి అత్యంత పాశవికం! కార్పొరేట్లకు దయ, ఆర్ద్రత ఉంటాయని ఎవరయినా అనుకుంటే పొరపాటని నిరూపించిన సంవత్సరమిది.
ఏడాది పొడుగునా గడచిన కాలపు అడుగుజాడల్ని తరచిచూస్తే నియంతలే ధరాధిపతులై రాజ్యం చేసే చోట నిత్యం శ్రమతో లోకాన్ని వెలిగించే వారికి ఏ భరోసా లభించదని తెలిసిపోయింది. కోట్ల మంది వలస కార్మికులకు అండగా నిలిచే ఔదార్యం, నిబద్ధత, బాధ్యత ఈ వ్యవస్థకు లేదని రూఢ అయింది. భారీ ప్రాజెక్టుల, బహుళ అంతస్థుల నిర్మాణాలకు చెమటొడ్చేవారిని 'అభివృద్ధి' దాహపు బేహారులు చిన్నచూపు చూస్తారని తెలిసిపోయింది. తరాలు తిన్నా తరగని ఆస్తులు కూడబెట్టడం కోసం పాకులాడే బిలియనీయర్ల దుర్మార్గం అంతం కానిదే మనుషులు మనుషులుగా మనలేరని బోధపడింది. ఈ వివేచన ఇచ్చిన వెలుగుదారుల్లో శ్రమించేవారంతా ఏకం కావడం అవసరమని తేటతెల్లం చేసింది.
రెక్కలు ముక్కలు చేసుకునేవారి కోసం ఎవరూ రారు. వారిని ఎవరూ ఉద్ధరించరు. ఏ శాసనాలు, ప్రభుత్వాలు వారి క్షేమం కోసం నిర్మితం కావు. వారి శ్రమకి తగినరీతిన విలువకట్టే మాననీయులు, మానవతా దీప్తితో వెలుగొందే మూర్తులు ఇక్కడ ఎవరూ లేరు. సకల కళలు, సారస్వతాలు ఏలినవారి కీర్తిచంద్రికల్ని లెక్కించేందుకు తాకట్టు పడటం ఈ కాలపు వాస్తవం. మీడియా, సోషల్‌మీడియా ఏదైతేనేం శ్రమని శిరోధార్యంగా తలపోసేవారి పక్షాన లేవన్నది మరింత నిజం. కరోనా కాలపు పెను సంక్షోభం కండ్లు తెరిపించింది. ఎవరు ఎటు వైపు నిలబడ్డారో స్పష్టంగా చూపింది. ఏ మాటల వెనుక ఉన్న మతలబు ఏమిటో సాక్షాత్కారింపజేసింది. స్వార్థమే పరమార్థంగా బతకనేర్చిన మనుషుల యవ్వారానికి అసలు మూలాలు ఎక్కడున్నాయో చెప్పకనే చెప్పింది.
అనేకానేక రంగాలలో సరికొత్త తలపోతలకు ప్రేరణగా నిలిచిన 2020 ఈ కొత్త శతాబ్దిలో, మిలీనియంలో వైవిధ్యమైన ఏడాదిగా నిలిచిపోతుంది. ప్రపంచం ఎంత వైజ్ఞానికంగా ఎదిగినా మార్కెట్‌శక్తుల క్రౌర్యం అంత సులువుగా అంతరించదని అర్థం చేయించింది. ఈ లోకాన్ని సుభిక్షం చేసేందుకు ప్రతితరం తనదయిన ప్రయత్నాలు చేస్తుంటుంది. అదే సమయాన ధనస్వాములు బతుకుని సంక్షుభితం చేసే చర్యల్ని అంత త్వరగా విడనాడరు. వారి పన్నాగాల్ని వివేచనతో, విజ్ఞతతో ఛేదించే శక్తులు మరింత బలోపేతం కావాలి. మానవాళి శ్రేయస్సుని ఆకాంక్షించేవారు సంఘటితమవ్వాలి. 2020పైన మన విశ్లేషణలు, ఆలోచనలు, అవలోకనాలు ఇందుకు అనువుగా సాగాలి. ఆగామి కాలానికి కొత్త యోచనలతో స్వాగతం పలకాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

02:39 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

01:10 PM

విరాట ప‌ర్వం నుంచి ప్ర‌త్యేక వీడియో

12:55 PM

అసెంబ్లీ బయట ఆప్‌, ఎస్‌ఏడీ ఆందోళన

12:44 PM

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

12:39 PM

అమ‌ర‌చింత‌లో ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌

12:29 PM

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు‌లో 2.3కిలోల‌ బంగారం పట్టివేత

12:21 PM

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం..బీజేపీ నేత సంచలన ప్రకటన

12:04 PM

టీఆర్ఎస్ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

11:54 AM

ముళ్ల‌పొద‌ల్లో అప్పుడే పుట్టిన ఆడ‌శిశువు

11:44 AM

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఎస్‌బీఐ బంపరాఫర్

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

07:03 AM

హెలికాప్టర్ ప్రమాదంలో ఎంపీ మృతి

06:55 AM

టీడీపీ సీనియర్ నేత కూమారుడు బ్రెయిన్ డెడ్‌తో మృతి

06:49 AM

గెలిపిస్తే గృహిణులకు నెలకు వెయ్యి కానుక

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.