Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పార్టింగ్‌ గిఫ్ట్‌ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 29,2020

పార్టింగ్‌ గిఫ్ట్‌

కన్యా శుల్కంలో ''డాన్సింగ్‌ గర్ల్‌'' మధురవాణికి ''పార్టింగ్‌ విజిట్‌'' కోసం గిరీశం తపనపడే సందర్భం కూడా ఆమె నుంచి విడిపోతున్నప్పుడేనన్న సత్యం మనకెరుకే! ఆప్తులు విడిపోతున్న సందర్భంలో ఈ ''పార్టింగ్‌'' అనేది రెండువందల సంవత్సరాల ఇంగ్లీషోడి పాలనలో మగ్గిన ఫలితంగా దక్కిన మాట!
''హౌడీ మోడీ'', ''నమస్తే ట్రంప్‌'' అనే తిరణాల కోసం వేల కోట్లు (రూపాయలు/డాలర్లు) ఖర్చు చేసినా ఇండియన్‌ అమెరికన్ల ఓట్లు ట్రంప్‌ బుట్టలో పెద్దగా రాలలేదు. అయినా పోతూ పోతూ ''లిజియన్‌ ఆఫ్‌ మెరిట్‌'' చీఫ్‌ కమాండర్‌ స్థాయి పురస్కారం మోడీ సాబ్‌ను వరించింది. గత 30/35 సంవత్సరాల నుంచి ఏ అధ్యక్షుడూ ఏ దేశాధినేతకూ (నేటి ట్రంప్‌లా) ఈ పురస్కారమియ్యలే! ఇది అమెరికా మిలటరీ హెడ్‌ కార్వర్టర్స్‌ పెంటగన్‌ ఇచ్చే పురస్కారం. సాధారణంగా సైనికాధికారులకు ఇస్తూంటారు. 1949లో మనదేశానికి చెందిన నాటి ఫీల్డ్‌ మార్షల్‌ జనరల్‌ కె.ఎమ్‌. కరియప్పకు అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారిట్రూమాన్‌ ఇచ్చారు. ''భక్తులు'' మైమరిచి ఆలపిస్తున్న బృందగానంలో గాని, గోడీ మీడియా ఆలాపనల్లోగాని, జె.సి.నడ్డా వంటి గణాచార్యుల కీర్తనల్లోగాని కనపడే కామన్‌ అంశమేమంటే ఇది ''మోడీ దార్శనికతకు, ప్రపంచశాంతి కోసం ఆయన చేస్తున్న కృషి''కి అందిన పురస్కారమట!
''బొంకరా! మంకెన్నా అంటే మా వూరి మిరియాలు తాటికాయలంత ఉన్నా''యన్నాడట వెనకటి కెవరో! ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిసిన తర్వాత, అమెరికానే సర్వంసహాధికారిగా వెలిసిన తర్వాత, అమెరికా ప్రయోజనాలే ప్రపంచ ప్రయోజనాలుగా చెలామణిలోకి వచ్చిన తర్వాత, అమెరికా ఊడిగానికి మనదేశాన్ని దిగజార్చేందుకు వెంపర్లాడుతున్నది మోడీ బృందం. ఈ దశలో ''లిజియన్‌ ఆఫ్‌ మెరిట్‌''ను పరిశీలించాలి. ఇది మోడీ ఒక్కడికే దక్కిన పురస్కారం కాదు. ఆస్టేలియా, జపాన్‌ ప్రధానులు స్కాట్‌ మోరిసన్‌, షింజో అబెలకు కూడా ''లిజియన్‌ ఆఫ్‌ మెరిట్‌'' అవార్డు దక్కింది. కారణం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన నాలుగు దేశాల కూటమి 'క్వాడ్‌'లో ఇవన్నీ సభ్యదేశాలు. భాగస్వాములు. భారత ప్రధాని ''దార్శనికత''కే అమెరికా మెచ్చి మేకతోలు కప్పిందని 'భక్తులు' పారవశ్యంతో చేసే పలవరింపులు భ్రమలు వెదజల్లేందుకే! చైనాతో సుమారు నాలుగువేల కి.మీ.కు పైగా సరిహద్దు గల భారతదేశాన్ని మించిన ''మొనగాడు'' అమెరికాకు ఇంకెక్కడ దొరుకుతారు? ప్రపంచంలో అమెరికా ఒక్కటే సూపర్‌ పవర్‌గా వెలుగొందాలనేది దాని ఆకాంక్ష. చైనా క్రమంగా ఆర్థిక శక్తిగా పెరగడం దానికి మింగుడు పడటం లేదు. అందుకు పన్నిన ఉచ్చు 'క్వాడ్‌', దాన్లో మనదేశం ఒక ప్రధాన పాత్రధారి. ఈ పురస్కారం వెనక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు రక్షించుకునే మరో చమత్కారం కూడా ఉంది. 2008లో అమెరికాతో మనదేశం అణుఒప్పందం చేసుకున్నప్పటి నుంచి వామపక్షాలు, ముఖ్యంగా సీపీఐ(ఎం) హెచ్చరిస్తున్న అంశమేమంటే మనదేశం అమెరికా ''డంపింగ్‌ గ్రౌండ్‌''గా మారుతుందని! అంటే కేవలం అణు ఒప్పందానికి సంబంధించిన వెస్టింగ్‌ హౌస్‌ కార్పొరేషన్‌, జి.ఇ. వంటి సంస్థలే గాక వారి వ్యవసాయ ఉత్పత్తులూ, డైరీ, పౌల్ట్రీ ఉత్పత్తులూ మనదేశంలో వెల్లువెత్తుతాయని నెత్తినోరూ కొట్టుకుని మొత్తుకున్నాయి వామపక్షాలు. నేడదే నిజమై సాక్షాత్కరిస్తోంది. దాని ఫలితమే స్వాతంత్య్రానంతరం అతిపెద్ద ప్రజావెల్లువ నేడు ఢిల్లీని 'ఘెరావ్‌' చేస్తున్న విషయం కండ్లకు కడుతోంది.
'రద్దు' తప్ప ఏదైనా కోరండని మోడీ సర్కార్‌, రద్దే తప్ప మరేదీ అవసరం లేదని 'మహౌద్యమం' డిమాండ్‌ చేయడంతో పీట ముడిపడింది. రైతు ఉద్యమం వెనుక ''రాజకీయాలు''న్నాయంటాడు మోడీసాబ్‌. తమ ఉద్యమంలోకి రాజకీయ నాయకులను 'నిషేధించామ'ని రైతులు తెగేసి చెప్పినా ప్రభుత్వ ధోరణి మారట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతు చట్టాలతో ముందుకు సాగాలని మోడీ సర్కార్‌ ప్రయత్నం. ఏమైనా వీటి రద్దు సాధించాల్సిందేనని ముఖ్యంగా మండీల వల్ల ప్రయోజనం పొందిన ''హరిత విప్లవ'' రాష్ట్రాలు, ప్రాంతాల రైతాంగం బిర్రుగా నిలబడ్డారు. నిన్నటి కేసీఆర్‌ ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ రైతులు పూర్తిస్థాయి ఉద్యమంలో దూకాల్సిన పరిస్థితి. కేసీఆర్‌ ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదట! కొనుగోళ్ళు అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదట! మొన్నటి భారత్‌ బంద్‌లో తమ కార్యకర్తలు పూర్తిస్థాయిలో పాల్గొన్న విషయం పక్కనబెట్టి రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నేడు కేసీఆర్‌ చేతులెత్తేయడం కసాయి చట్టాలకు రైతులను బలి చేయడమే. పైగా కేంద్ర చట్టాలు అందుకు అనుమతిస్తున్నాయట! దీనికి వ్యతిరేకంగానే కదా భారత్‌బంద్‌ జరిగంది. తమ అనుయాయులందర్నీ పాల్గొనమని ఆర్డరేసిన సంగతి కారు సారు యాద్‌మరిచినట్టుంది. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరట! అంటే ఐ.కె.పి. కేంద్రాలు మూతబడి అక్కడ పనిచేసే గ్రామీణ హమాలీలూ ఉపాధి కోల్పోతారన్నమాట! కీలకాంశం రైతుల్ని కార్పొరేట్‌ గద్దలకి, రాబందులకు ఎరగా వేస్తున్న మోడీకే వంతపాడుతున్నారు కేసీఆర్‌..!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.