Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అమెరికా పావుగా భారత్‌... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 31,2020

అమెరికా పావుగా భారత్‌...

భారతదేశంపై అమెరికాకు ఇంత శ్రద్ధ ఎందుకు? ఆదేశ అధికారులు కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? భారతదేశం మీద, ఈ ప్రాంతం మీద అమెరికాకు ఎందుకు ఇంత ప్రేమ? అందుకు అమెరికా రూపొందించిన కొన్ని డాక్యుమెంట్లు పరిశీలిస్తే అందులో 2017లో రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహం, 2020లో చైనా పట్ల అమెరికా వ్యూహం అనే డాక్యుమెంటు అగ్రస్థానంలో ఉంటాయి. వీటికి తల్లిలాంటిది 1992లో రూపొందించిన ''రక్షణ ప్రణాళిక మార్గదర్శకాలు'' అనే వ్యూహపత్రం. 1991లో రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి వరకు అమెరికాకు ధీటుగా ఉన్న సోషలిస్టు రష్యా కూలిపోవడంతో బహుళ దృవ ప్రపంచం స్థానే ఏకదృవ ప్రపంచం వైపు అమెరికా ప్రయత్నాలు సాగాయి. ఈ పత్రంలో సోవియట్‌ యూనియన్‌ కూలిపోవడంతో ఏర్పడిననూతన పరిస్థితిలో ప్రపంచంలో కమ్యూనిజం యొక్క భావాజాలం, పరపతి సన్నగిల్లుతుందని ఈ నేపథ్యంలో అమెరికా ఎటువంటి పాత్ర పోషించాలని ఆపత్రం వ్యూహరచన చేసింది. అందులో ఇక ముందు అప్పటి వరకు సోవియట్‌ ఇచ్చిన గట్టి పోటీ ఏ దేశం ఇవ్వకుండా చూసుకోవడం, దానితో పాటు ఏ ప్రాంతీయ కూటమీ ఒక ప్రపంచ శక్తిగా ఎదగకుండా జాగ్రత్త పడటం అనే రెండు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది. ఈ లక్ష్యాల సాధనకోసమే అమెరికా ప్రపంచం మీద పెత్తనం చెలాయించేందుకు పూనుకుంటున్నది.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు అమెరికా నాయకుడిగా వ్యవహరిస్తున్నది. ఏదేశం అయినా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే దానిపైకి విరుచుకుపడటం, ఆ దేశాల అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం, అధికార మార్పిడికి పూనుకోవడం, దానికి తన ఆర్థిక సైనిక శక్తిని చూపుతూ ఒక ఆధిపత్య శక్తిగా వ్యవహరిస్తున్నది. దీనికి గట్టిపోటీ లాటిన్‌ అమెరికాలో ప్రగతిశీల, వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడటంతో మొదలై చైనా సోషలిస్టు ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఒక ప్రపంచ శక్తిగా ఏర్పడటంతో అమెరికాకు అది ఒక సవాలుగా మారింది. ఈ రెండు పరిణామాలతో ప్రపంచ పరిస్థితి ఏకధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు మళ్ళింది. ఈ కొత్త పరిస్థితిని అమెరికా సామ్రాజ్యవాదం తట్టుకోలేక ఆగ్రహానికి గురవుతున్నది.
లాటిన్‌ అమెరికా దేశాలలో ప్రగతిశీల, వామపక్ష ప్రభుత్వాలున్న బొలీవియా, వెనెజులా లాంటి దేశాలలో సైనిక కుట్రతో ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేసి అమెరికా భంగపాటుకు గురి అయింది. వీటన్నింటికంటే అమెరికా చైనాను పెద్ద సవాలుగా నిర్ధారించుకుంది. ఎందుకంటే చైనా కేవలం ఒక ఆర్థిక శక్తిగా మాత్రమే పోటీదారు కాదు, అదిఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం.. అంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రతినిధిగా ఉన్నది. అందుకే అమెరికా రక్షణ మంత్రి పాంపియో పదేపదే చైనాను కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తున్నదని ఎత్తిచూపుతుంటారు. ఎందుకంటే చైనా కమ్యూనిస్టుపార్టీ ఆ దేశాన్ని సోషలిస్టు ఆర్థిక పంథాలో నిర్మిస్తున్నందుకు అది పెట్టుబడిదారీ పంథాకు వ్యతిరేకమని ఎత్తిచూపుతుంటారు. అందుకని దాన్ని కొనసాగనివ్వకూడదని ప్రకటిస్తుంటారు. దీనికి ఒక కారణం ఏమిటంటే రష్యా పతనంతో సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంతాలు ప్రపంచంలో అంతమైపోయినట్లు ప్రకటించిన అమెరికాకు చైనా సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ సోషలిజం పతనం కాలేదని నిరూపించి తన విశిష్టతను చాటుకుంటున్నది.
అమెరికా చైనాతో వాణిజ్యం నడిపింది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టింది. కాలక్రమంలో చైనా ప్రభుత్వ ఆలోచనలో మార్పు వస్తుందని ఆశించింది. అది జరగకపోగా, ప్రపంచీకరణలో భాగమైన నయా ఉదారవాద ఆర్థిక విధానాన్ని చైనా తన షరతులలో స్వీకరించింది. చైనాను అంతర్గతంగా దెబ్బకొట్టాలనే పథకం విఫలమైంది. దానితో అమెరికా చైనాలో అంతర్గతంగా కల్లోలం సృష్టించడానికి టిబెట్‌, హంగ్‌కాంగ్‌లో నిరసనలను ప్రేరేపిస్తున్నది. హంగ్‌కాంగ్‌ నిరసన కారులను అమెరికాకు పిలిపించుకుని తమ పూర్తి మద్దతును ప్రకటించింది.
చైనాపై అమెరికా టారిఫ్‌లు విధించింది. వాణిజ్యంలో అనేక ఆటంకాలను సృష్టించింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో వివాదం పుట్టించింది. అయినా చైనా రెచ్చిపోకుండా తన ఆర్థికశక్తిని దీక్షతో పెంచుకుంటున్నది. అమెరికా చైనా మధ్య వాణిజ్యంలో చైనాదే పైచేయిగా ఉన్నది. దీనితో అమెరికా తను ఒక్కటే చైనాను ఢకొీనడం కష్టమని గ్రహించి చైనా చుట్టూ సైనిక కూటములను ఏర్పాటు చేసుకుంటున్నది. అందులో కీలకమైన క్వాడ్‌ కూటమిలో భారత్‌ అంతర్భాగమైంది.
అమెరికా సామ్రాజ్యవాదుల లక్ష్యం చైనాను కట్టడిచేయడం మాత్రమే కాదు, చైనాను ఖతం చేయ్యాలనేదే దాని లక్ష్యం. ఒకమాటలో చెప్పాలంటే సోషలిజం, కమ్యూనిజంను అంతం చేయాలనీ, మళ్లీ ఏకదృవ ప్రపంచం ఏర్పాటుచేసి తన సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనీ చూస్తున్నది. ప్రపంచంలో ప్రగతిశీల శక్తులు, వామపక్షాలు ఈ ప్రయత్నాన్ని ఓడించాలి. ఆనాడైనా, నేడైనా కమ్యూనిజాన్ని అంతం చేయాలనేది అమెరికన్‌ పాలకవర్గం లక్ష్యం. అమెరికన్‌ పాలకుల చేతిలో పావుగా మారేందుకు భారత ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఇదొక ప్రమాదకర సంకేతం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
భజన పరాయణత్వం!

తాజా వార్తలు

10:01 PM

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌

09:49 PM

వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం

09:22 PM

ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని

09:04 PM

లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి

08:43 PM

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం

08:18 PM

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

07:58 PM

సౌదీ అరేబియాలో విషాదం..భారతీయ నర్సులు దుర్మరణం

07:50 PM

బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు

06:50 PM

పునరావాసం కల్పించాలి

06:48 PM

ఘనంగా రేణుక దేవి కళ్యాణ మహోత్సవం

06:47 PM

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..

06:37 PM

మందు బాబులకు కొత్త సమస్య..

06:24 PM

ఏపీలో 106 కరోనా కేసులు నమోదు

06:18 PM

ఖమ్మం జిల్లాలో జేసీబీలు..ట్రాక్టర్లు పీఎస్‌కు తరలింపు

05:58 PM

మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే బూతు పూరాణం..ఆడియో వైరల్

05:43 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్

05:39 PM

సహజీవనాన్ని లైంగికదాడిగా భావించ‌లేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

05:21 PM

ఐఫోన్‌ ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. యాపిల్‌ జ్యూస్‌ వచ్చింది..

05:02 PM

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం

04:46 PM

త్వరలోనే బీజేపీ పనైపోతుంది..

04:30 PM

వకీల్ సాబ్ నుంచి రానున్న 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్

04:13 PM

మోసపోయిన 'భీష్మ' డైరక్టర్ వెంకీ కుడుముల

04:00 PM

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

03:54 PM

నా దేవుడి ను మళ్ళీ కలుసుకున్నాను : బిగ్ బాస్ ఫేం అశూ రెడ్డి

03:34 PM

ఘోర రోడ్డు ప్రమాదం..

03:25 PM

ఏసీబీకి చిక్కిన ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి

03:09 PM

రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి

02:57 PM

కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన ప్రకటన

02:44 PM

హత్రాస్ బాధితురాలి తండ్రి హత్య

02:26 PM

తెలంగాణపై కేంద్రం వివక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.