Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మళ్లీ కన్యాశుల్కం! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 05,2021

మళ్లీ కన్యాశుల్కం!

''యదహ్నాత్‌ కురుతే పాపం..
తదహ్నాత్‌ ప్రతిముత్యతే'' అనే మంత్రంతో పాటు ''సంధ్యా వందనం చేస్తే ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే పోతాయష'' అంటూ దాని అర్థం కూడా చెప్తాడు అగ్నిహోత్రావధాన్లు కన్యాశుల్కంలో! వీడి పిలక వాడికి, వాడి పిలక వీడికి ముడేసి డబ్బులు గుంజి బతుకెళ్లదీసే రామప్పపంతులు ''అవునవును, నేనూ రోజూ సంధ్యావందనం చేద్దామనే అనుకుంటున్నా'' నంటాడు. ఇది గురజాడ అప్పారావు గారు వేసిన గూగ్లీల్లో ముఖ్యమైనది. అంటే రోజూ పాపాలు చేస్తూ సంధ్యావందనం చేసి కడిగేసుకోవచ్చ నేది రామప్పపంతులు ఆలోచన!
తప్పులు చేసిన వారు బీజేపీలో చేరితే గంగలో మునిగినంత పుణ్యమొస్తుందనీ, వారు స్వచ్ఛంగా, పరిశుద్ధులై బయటికొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులవారు చెప్పడం చూస్తే పై సంభాషణ గుర్తుకురాకమానదు. మళ్లీ 'కన్యాశుల్కం' రోజులొచ్చినాయేమో! 19వ శతాబ్దం చివరికి (1892), 21వ శతాబ్దం రెండవ దశకానికి 'తప్పు', 'పాపం' అనే మాటలకు మస్తు తేడా ఉందని మనకు తెల్సు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ నాయకులెవరైనా, ఆ మాటకొస్తే ఏ పార్టీ నాయకుడైనా, నాయకురాలైనా ఎన్ని తప్పులు చేసినవారైనా బీజేపీలో చేరితే అవన్నీ మాఫీ చేస్తామని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. తప్పొప్పులు ఫైనలైజ్‌ చేసే చిత్రగుప్తుడు తమ కొత్వాలేనని అన్యాపదేశంగా హింట్‌ కూడా ఇచ్చారు బీజేపీ పెద్దలు. నమ్మకంలేకుంటే బంగ అధినేత్రిని అడగండి. కాషాయం ధరించిన తర్వాత 'శారదాస్కాం'లో నుంచి ముకుల్‌రారుని ఎలా బయటికి లాగామో, ఏవిధంగా కాచుకున్నామో చూసుకోండన్నంత ధైర్యం కనపడటం లేదా ఆ ప్రకటన వెనక. వివిధ 'స్కాంస్టర్ల'ను పార్టీలో కలిపేసుకుని పునీతం చేయడమే తమ పార్టీ ''పంత''మని కమలనాథులు బల్లగుద్దిమరీ వాదిస్తున్నారు.
శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లను సృష్టించిన 'వ్యాపం' స్కాంలో సుప్రీంకోర్టు 634 మంది డిగ్రీలైతే రద్దుచేసింది కానీ, దాని సృష్టికర్తలైన బీజేపీ నాయకులపై ఏ చర్యలూ లేవు కదా! కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను 2020 మార్చి 23న మళ్ళీ మధ్యప్రదేశ్‌లో పట్టాభిషిక్తుణ్ణి చేయడం కోసమే దేశంలో మార్చి 24 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించలేదు మోడీ!
కాంగ్రెస్‌ పాలన అవినీతి గబ్బుకొడుతున్న నేపథ్యంలో 2014లో మోడీ సింహాసనాధీశుడైనాడు. 'న ఖావూంగా', 'న ఖానేదూంగా' అనేది మోడీగారి నినాదం ఆనాడు. ప్రజలు దాన్ని నమ్మారు. తాను దేశానికే 'చౌకీదార్‌'ని అన్నాడు. ప్రజలు దాన్నీ నమ్మారు. ఈ ఆరేండ్లలో జరిగిన స్కాంలన్నీ బీజేపీ నేతల చుట్టూ జరిగినవే. అంబానీ / అదానీల్లాంటివారికి ప్రయోజనం చేకూర్చినవే. వారు సుద్ధపూసలూ కారు, వీరు పరిశుద్ధాత్మలూ కారు! ''ఒక వ్యక్తి గుణగణాలపై నీకు స్పష్టతలేకపోతే అతని మిత్రులవైపు చూడు'' అన్న జపాన్‌వారి సూక్తి గీటురాయిగా పరిశీలిస్తే... 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తప్ప కనీసం 'లోక్‌పాల్‌'ని నియమించేందుకు మోడీగారి బీజేపీకి మనసొప్పలేదు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న తరుణంలో ఆ రాష్ట్రంలో 'లోకాయుక్త'ను ఎందుకు నియమించలేదని హత్యకు గురైన ఓ ఆర్టీఐ కార్యకర్త తండ్రి హైకోర్టులో పిల్‌ వేసినా అప్పటి రాష్ట్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకుంటే.. కేంద్ర (యూపీఏ) ప్రభుత్వం నియమించింది. నన్నడగకుండా.. నాతో సంప్రదించ కుండా లోకాయుక్త నియామకానికి కేంద్ర ప్రభుత్వానికేమి హక్కుందని ఆనాడు కోర్టులో దావా వేసిన పెద్దమనిషి నేటి భారత ప్రధాని.
జాతీయ భద్రతా సలహాదారుగా మోడీ ఏరికోరి నియమించుకున్న అజిత్‌ దోవల్‌ పుత్రరత్నం కేమెన్‌ ఐల్యాండ్‌లో హెడ్జ్‌ఫండ్‌ నిర్వహిస్తున్నాడని తెల్సినా చర్యలెందుకులేవో, నోట్లరద్దు ప్రకటించిన నాలుగు రోజుల్లో దేశంలో ఏ సహకార బ్యాంకులోకి రానన్ని నోట్ల కట్టలు అమిత్‌షా డైరెక్టర్‌గా వున్న బ్యాంకులోకి దేవుడి హుండీలోకొచ్చినట్టు ఎందుకొచ్చాయో పరిశీలిస్తే - మా ''గంగ'లో మునగండి.. మీ పాపాలన్నీ పుణ్యాలుగా మారుస్తామనే'' బీజేపీ నేతల అసలు స్వభావం అర్థమౌతుంది.
మన దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులను ముంచి మహరాజుల్లా విదేశాలకెళ్లి అక్కడ సర్వభోగాలు అనుభవిస్తున్న విజరుమాల్యాలు, నీరవ్‌మోడీలు, మెహుల్‌ చోక్సీలతో బీజేపీ నేతల సంబంధబాంధవ్యాలు చూస్తే కన్యాశుల్కం - రామప్పపంతులు గుర్తుకురాకమానరు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.