Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 08,2021

అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?

జూలియన్‌ అసాంజేను అమెరికాకు అప్పగించరాదంటూ బ్రిటన్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. వికీలిక్స్‌ వ్యవస్థాపకుడు అయిన అసాంజే ఎనిమిదన్నరేండ్లుగా స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు దూరమై ఉన్నారు. ఈ తీర్పు ఆయన విడుదల కోసం ఉద్యమిస్తున్నవారికీ కొంత ఊరటనిస్తుంది. ప్రజాస్వామ్యానికి తామే రక్షకులమని చెప్పుకునే అమెరికా లాంటి దేశాల నిజస్వరూపాన్ని బజారులో నిలబెట్టి, నిలదీసి అందరిని ఆశ్చర్యపరిచిన అసాంజేను అగ్రరాజ్యాలు వేటాడుతున్నాయి. అసాంజేను అరెస్టు చేయడం, అమెరికాకు తరలించేందుకు ప్రయత్నించడం అంటే పత్రికా స్వాతంత్రానికి, ప్రచురణకు ఉన్న హక్కులను హరించడమే. అమెరికా అసాంజేపై ఎందుకు పగపట్టింది అనేందుకు ఆయన బట్టబయలు చేసిన రహస్యాలే నిదర్శనం.
అమెరికా, ఇరాక్‌, అఫ్ఘనిస్థాన్‌పై యుద్ధనేరాల వివరాలను ప్రభుత్వ పత్రాల నుంచే తీసి బట్టబయలుచేశారు. కలోట్రల్‌ మర్‌డర్‌ అనే వీడియోలో ఇరాక్‌లోని ఒక గ్రామంలో మట్లాడుకుంటున్న సాధారణ పౌరులను, ఇద్దరు రాయిటర్స్‌ జర్నలిస్టులను కేవలం సరదాకోసం బాంబులేసి హతమార్చిన అమెరికా సైనిక హెలికాప్టర్‌ దురాగతాన్ని చూపారు. అఫ్ఘాన్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేసే పేరిట అమెరికా, దాని కూటమి దేశాల సైనిక దళాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాయో తెలిపే పత్రాలను ఆయన ప్రపంచానికి తెలియజేసారు. వేర్వేరుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన కోట్లాది సందేశాలన్నీ అసాంజ్‌ వల్లనే లోకానికి తెలిసాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు, వాటిసైనిక వ్యవస్థలపై అమెరికా అంచనాలు తమ అక్రమార్జననూ వేరే దేశాల బ్యాంకులకు తరలించే బడా సంపన్నుల గుట్టు.. వగైరాలు ఆయన చొరవతోనే వెలుగు చూసాయి. లేనిపక్షంలో అవి రహస్యాలుగానే మిగిలిపోయేవి.
చెలసియా మానింగ్‌ ఈ యుద్ధ నేరాలను అసాంజే సహకారంతో సేకరించారు. ప్రధాన మీడియాలో వీటిని చూపేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో విఫలమై వికీలీక్స్‌ ద్వారా బట్టబయలు చేశారు. అందుకే అసాంజే, మానింగ్‌ ఇప్పుడు జైళ్ళలో ఉన్నారు. వారిపై పెట్టిన నేరం అసాంజే నిజమైన జర్నలిస్టు కాదని, మానింగ్‌ ద్రోహి అని. అందుకే వారిని శిక్షించ తలిచారు. వీరు ఇద్దరు ప్రపంచ మానవాళికి అమెరికా నేరస్వరూపాన్ని తెలియచేశారు. వారికి అందులో వ్యక్తి స్వార్థం ఏమీలేదు. అందుకే అమెరికా రక్షణమంత్రి పాంపియో అసాంజే వికీలీక్స్‌ను ప్రభుత్వతరహా నిఘా సంస్థ అని నామకరణం చేశారు. అమెరికా గ్రాండ్‌ జూరీ అసాంజేను కంప్యూటర్‌ ఫ్రాడో చట్టం కింద కుట్ర చేసినట్టు పేర్కొన్నది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి.
కొత్త డిజిటల్‌ యుగం ఇది. దీనితో సోషల్‌ మీడియా నిఘా వ్యవస్థ సర్వేలేన్స్‌ పెట్టుబడిదారీ విధానం, ప్రభుత్వం రక్షణ వ్యవస్థలో ప్రజలందరినీ నిఘా వ్యవస్థ కిందకి తెచ్చి ప్రతిక్షణం గమనిస్తున్నాయి. ఈ కొత్త వ్యవస్థను అసాంజే వినియోగించి కొత్త తరహా జర్నలిజాన్ని సృష్టించాడు. అగ్రరాజ్యం దృష్టిలో ఇది ఆయన చేసిన పెద్ద నేరం, కుట్ర, కంప్యూటర్‌ ఫ్రాడ్‌, హైటెక్‌ నేరస్తుడు ఇంకా ఇలా ఎన్నో...
అసాంజేకు అమెరికా చట్టమే జర్నలిస్టులకు కల్పించిన స్వేచ్ఛ, రక్షణ కల్పించడానికి నిరాకరిస్తున్నది. ఇదే అంశాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే న్యూయార్క్‌ టైమ్స్‌ విలేకరి డానియల్‌ ఇల్స్‌బర్గ్‌ పెంటగాన్‌ పత్రాలు బయటపెట్టాడు. వీళ్ళందర్నీ శిక్షిస్తే అది పత్రికా స్వేచ్ఛపైనే దాడి కదా!?
అసాంజే కేవలం ప్రభుత్వ రహస్య పత్రాలను చేధించి సరిపెట్టుకోలేదు. డిజిటల్‌ మీడియా వ్యవస్థలో ఏదీ రహస్యంగా జరగదు అనే ఒక నమ్మకాన్ని బద్దలకొట్టి, ఆనవాళ్ళు కనపడకుండా ఉండే పరికరాలను కూడా తయారుచేసుకుని వినియోగించాడు. ఇది మరో ముందడుగు.
వికీలీక్స్‌ సర్వర్లను నిలిపివేసి సమాచారం ప్రసారం కాకుండా చేసే ప్రమాదాన్ని ముందే ఊహించిన వికీలీక్స్‌ అనేక సైట్స్‌లోకి దీన్ని బదిలీ చేసింది. డిజిటల్‌ మీడియాలోని మెళుకువలను అన్నింటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బ్రహ్మస్త్రాన్ని అమెరికా నెత్తిమీదనే పెట్టాడు. అందుకే సామ్రాజ్యవాద అమెరికాకు అసాంజే అంటే ద్వేషం.
ట్రంప్‌ అధికారం ముగింపు అంకంలో అనేక మందికి క్షమాభిక్షలు ప్రకటించారు. అసాంజేకు సైతం క్షమాభిక్ష మంజూరు చేసి ఆయనపై సాగుతున్న వేదింపులకు ముగింపు పలికి ఉండవచ్చు. అసాంజేపై అమెరికా మోపిన 17 అభియోగాలకు 175ఏండ్ల శిక్ష పడే అవకాశం ఉన్నది. కొత్త అధ్యక్షుడుకానున్న బైడెన్‌ గతంలో అసాంజేను హైటెక్‌ ఉగ్రవాది అని అన్నారు. ఇక్కడ సమస్య సామ్రాజ్యవాదంది. దాని నిజస్వరూపాన్ని బట్టలూడదీసి బహిర్గతం చేసిన వాళ్ళను, అది అసాంజే అయినా, చెల్సియా మానింగైనా, ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అయినా వాళ్ళను అమెరిక పాలకులు వదుల్తారా?

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.