Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భూతవైద్య నారాయణోహరి | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 09,2021

భూతవైద్య నారాయణోహరి

'భూతం వైద్యోగీతం,
వైద్యం భూతో ద్విగం
మంత్ర తంత్ర యోగం
సర్వం మానసిక రోగం' చీకటి యుగాల్లోకి, అంధ విశ్వాసాల్లోకి పోదాం పోదాం వెనక్కి వెనక్కి, దయ్యాల భూతాల స్థావరాల్లోకి పదండి పదండి.. ఇదీ నేటి మన విద్యాగమన తీరు. వైద్య విద్యలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భూతవైద్యంపై సర్టిఫికెట్‌ కోర్సు(పారా నార్మల్‌)ను ప్రవేశపెట్టి భావి వైద్యులను ఆహ్వానించారు. ఇక వాళ్ళు ఆ సర్టిఫికెట్‌ చేతపట్టుకుని గ్రామాల్లోకి, పట్టణా ల్లోకి వచ్చి ఎముకలు, నిమ్మకాయలు, రక్తచందనాలు, కత్తులు కటార్లతో ధూపదీపాలతో ప్రజలకు పట్టిన రోగాలను తరిమికొట్టబోతున్నారు.
మన విద్యారంగం ఇప్పటికే పరిశోధనారంగంలో వెనుకబడి, నూతన వైజ్ఞానిక సవాళ్ళును ఎదుర్కోలేని అవస్థలో ఉండగా, ఇప్పుడీ కాషాయకరణతో మరింత తిరోగమనం ఆరంభమైంది. కొత్తగా ఎదురయ్యే సవాళ్ళను గత కాలపు విశ్వాసాలలోకి, నమ్మకాలలోకి వెళ్ళి పరిష్కరించుకోవాలనే ఆలోచనలు 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. భారతదేశం విజ్ఞానరంగంలో ఎంతో ముందుకు పోవాల్సి ఉండగా, భావి భారతాన్ని నిర్మించే విద్యా వ్యవస్థలోకి జ్యోతిష్యం, మంత్ర తంత్ర అభ్యసనాలను ప్రవేశపెట్టడం, తిరోగమన ఆలోచనలతో చీకటి యుగాల్లోకి దేశాన్ని నెట్టడం అత్యంత విచారించాల్సిన అంశం.
మన రాజ్యాంగం ఈ దేశపౌరుని ప్రాథమిక బాధ్యతలను స్పష్టంగానే వివరించింది. ఆర్టికల్‌ 51-ఏ(హెచ్‌) ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రీయ భావాల అభివృద్ధికి మానవీయమైన హేతుబద్ధమైన చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పేర్కొంది. ఇంత వివరమైన రాజ్యాంగపు ఆదేశాన్ని కూడా లెక్కచేయకుండా, ఆ రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చి పరిపాలన చేస్తున్న ప్రభుత్వం పారాసైకాలజీ పేరుతో భూతవైద్యాన్ని అధికారికంగా ప్రోత్సహించడం ఎంతటి దారుణమైన విషయం. ఇది పూర్తిగా రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి విరుద్ధమైన విషయం. ఆధునిక భారత ప్రయాణం ఎటుపోతున్నది? భావితరాలకు మనం అందించే వారసత్వం ఇంత అజ్ఞానదాయకమైనదా? ఈ దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తిరోగమన ఆర్థిక వృద్ధి, పేదరికం, ఆకలి, అనారోగ్యం, కనీస మానవ హక్కులలేమి మొదలైన విషయాలపైన ఏ చర్యా లేకుండా గుళ్ళు గోపురాల మీద, దేవుళ్ళు దయ్యాల మీద, మతాలు కులాల మీద చర్చ పెరిగింది. అంటే ప్రజల వాస్తవిక సమస్యలను పరిష్కరించే సత్తాలేని ప్రభుత్వాలు ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయి అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.
తంత్ర విద్య, మంత్రాలు, భూతం, దెయ్యం సైతాన్‌ ఇవన్నీ క్రీస్తుపూర్వపు సమాజంలోని నమ్మకాలు. విజ్ఞానశాస్త్రం, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెందని కాలాలలోని ఈ నమ్మకాలను నేడు తోడితీసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మికత, దేవుడిపైన నమ్మకం పూర్తిగా వ్యక్తిగతమైనవి. దాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. అదే సందర్భంలో ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాపాలన మతానికి అతీతంగా కొనసాగించాలి. ప్రపంచంలో రాజ్యానికి మన రాజ్యాంగం ఒక మచ్చుతునక. ఇలాంటి ఆధునిక ప్రజాస్వామిక యుగంలో మతాన్ని రాజకీయాలతో కలిపి మనుషుల్ని విభజించడం, మనసుల్లో మూఢత్వాన్ని నింపడం అత్యంత దారుణమైన విషయం. కాగా, భూతవైద్యులను అధికారికంగానే తయారుచేసే విధంగా మన విద్యా వ్యవస్థను దిగజార్చడం మరీ బాధాకరం.
భూత వైద్యులను ఇప్పటికీ గ్రామాలలో అక్కడకక్కడ చూస్తుంటాం. మానసిక స్థితి బాగోలేనప్పుడు, సమస్యలు ముంచెత్తి ఆందోళన చెందుతూ భయానికి లోనయినప్పుడు, పరిష్కారాలు చేయలేని స్థితిలో భూతవైద్యుల దగ్గరికి పోతారు. అంటే వాస్తవ పరిష్కారాలు సాధ్యంకాని వేళ మంత్రానికో, తంత్రానికో సాంత్వన చేకూరుతుందనే మానసిక సంతృప్తిని పొందుతారు. దీన్ని ఆసరా చేసుకుని అనేక నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి పేదలు, శ్రామికులు బలవుతూనే ఉన్నారు.
ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలలోంచి వైదొలుగుతూ ప్రజలకు పూర్తి ఆరోగ్యాన్ని, దానికి కావలసిన సౌకర్యాలను కల్పించలేని స్థితిలో, అనారోగ్యానికి వైద్యం అందించలేని దౌర్భాగ్యంలోంచి ఈ మానసిక సంతృప్తి చిట్కాలను ప్రయోగిస్తున్నారు. అంతేకాదు, మూఢ విశ్వాసాలలో ప్రజలు మగ్గుతూ ఉంటే, మతం మత్తులో ఊగిపోతూ ఉంటే వారు దోపిడీ శక్తులకు యధేచ్ఛగా సేవ చేయొచ్చనేది ఇందులోని సారాంశం. అసలు భూతం దోపిడీ. అసలు దయ్యం దోచుకునే వర్గం. దీని ఫలితాలే సామాన్య ప్రజల భౌతిక, మానసిక దుర్భలత్వం.
అశేష ప్రజానీకం అనేక అనారోగ్యాలతో బాధలు పడుతూ ప్రాణాలు సైతం కోల్పోతున్న సందర్భంలో ప్రభుత్వం అందరికీ కావల్సిన వైద్యాన్ని, ఔషధాలను అందించే ప్రయత్నం చేయకుండా ఇలాంటి ఆలోచనలు చేయడం అశాస్త్రీయం. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్‌లేక అనేక మంది పిల్లలు చనిపోయిన సంఘటన ప్రభుత్వ ఆచరణలోని డొల్లతనాన్ని, నిర్లక్ష్యాన్ని తెలుపుతుంది. వీటిని ఎదుర్కొలేని పాలకులు భూతవైద్య సేవలనే ఇవ్వజూపుతారు. కాబట్టి ప్రజలు చైతన్యంతో ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

08:50 PM

వరంగల్ జిల్లాలో విషాదం..

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.