Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆఫీసు పదిలం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

ఆఫీసు పదిలం

మన ఆలోచనలకీ, కండ్లముందు కనిపించే వాస్తవాలకీ నడుమ అంతరం అనుపమానం. కరోనా-లాక్‌డౌన్‌ ఆరంభంతో ఇండ్ల నుంచి పని చేయడం (వర్క్‌ ఫ్రమ్‌ హౌం) మొదలయింది కొందరికి. వీరి సంఖ్య లక్షల్లోనే ఉంది. కొత్తలో అంతా బాగానే అనిపించింది. అయినవాళ్ళ మధ్య పని చేసుకోడం హాయిగానే తోచింది. భార్య/భర్త పిల్లాపాపలతో కుటుంబంలో ఏంచక్కా పనిచేసుకోవచ్చని తలపోశారు. కానీ రోజులు, వారాలు, నెలలు గడుస్తున్న కొద్దీ దృశ్యం మారింది. ఇంటి కన్నా ఆఫీసు పదిలం అనుకోడమే కాదు అంటున్నారు ఎందరో.
పదినెలలుగా ఇంట్లోంచి పనిచేస్తున్నవారి మానసికావస్థ చిత్రంగా పరిణమించింది. గుక్కతిప్పుకోనివ్వకుండా పెరిగిన పనిభారం హతాశుల్ని చేసింది. ఇంట్లో ఉన్నామనే గానీ ఎడతెగని పనితో అలసిపోతున్నామని 81శాతం మంది ఉద్యోగులు ఇటీవల జరిపిన ఒక సర్వేలో చెప్పారు. ఇల్లే ఆఫీసుగా మారడం అంత సులువు కాదనీ, సౌకర్యమూ కాదనీ ఈ సర్వే గణాంకాలు తేల్చి చెప్పాయి. కార్పొరేట్‌ కంపెనీలు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయడానికి అదనంగా పని చేయాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంటిపనినీ, ఆఫీసు పనినీ సమన్వయం చేసుకోడం సంక్లిష్టమైన వ్యవహారమని అరవైశాతం మంది ఉద్యోగులు అన్నారు. ఇంట్లోంచి పనిచేయడం ఎంతమాత్రం సంతోషంగా లేదని 55శాతం మంది జీరబోయిన కంఠాలతో చెబుతున్నారు.
ఇంట్లోంచి పని చేయడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చన్న భావన తలకిందులయింది. మధ్యతరగతి కొంపలు ఇందుకు అనువు కావన్నది అనుభవంలో బోధపడింది. నెలకు లక్ష, రెండు లక్షలు సంపాదించేవారు సైతం రెండు పడకగదుల ఇంట్లోనే పొద్దుపుచ్చుతున్నారు. మూడు పడకగదుల ఇల్లు అన్నది చాలామందికి ఓ విలాసం. రెండు గదుల ఇంట్లో భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉండటం, సర్దుకుపోవటం అంత చిన్న విషయం కాదు. నిజానికి చాలా ఇండ్లలో పడకగదులు స్టోర్‌రూముల మాదిరిగా ఉంటాయి.
దంపతులు ఇద్దరు పనిచేసేవారయితే ఇంట్లోంచే పని చేయడం కష్టసాధ్యం. తాము పని చేస్తూ, పిల్లలకు వండిపెడుతూ, వారి ఆలనాపాలనా చూస్తూ గడపాల్సి రావడం ఇబ్బందికరం. కొన్నిసార్లు పిల్లల అరుపులో, అల్లరో, భార్య లేదా భర్త కేకలో పనికి అంతరాయంగా పరిణమిస్తాయి. పనిలో పూర్తిగా లీనం కాలేని పరిస్థితి దంపతుల మధ్య గొడవలకు దారితీసిన వైనం 'వర్క్‌ ఫ్రమ్‌ హౌం' వద్దే వద్దు అనుకునేలా చేసింది.
అందరూ ఇంట్లోనే ఉండటం కారణంగా ఏకాంతం భగమైంది. ఆఫీసువాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్‌లు, ఫోన్‌లో మాట్లాడాలంటే ఏకాంతం కావాలి. ఇతర శబ్దాలేవీ వినిపించకూడదు. ఒకరు పనిలో ఉంటే మరొకరు టీవీ చూడలేరు. కనీసం మిత్రులతో ఫోనులో మాట్లాడలేరు. ఎదుటివారి ఏకాంతాన్ని భగం చేయకుండా నోర్మూసుకొని కూర్చోవాల్సి రావడం సర్కస్‌ విన్యాసంగా పరిణమించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లోంచే పని చేయడం చెప్పుకోలేని ఇక్కట్లకు దారితీసింది.
ఈ నేపథ్యంలోనే ఇంటి కన్నా ఆఫీసు పదిలం అన్నది వాస్తవం. ఇంట్లో పిల్లలనో, భార్యనో ఒక మాట అనేసి, వాళ్ళముందే మనస్ఫూర్తిగా పనిలో లీనం కాలేరు. అయ్యోపాపం అనవసరంగా నోరు జారాననే నేరపూరిత భావనలో అల్లాడుతారు. ఇదివరలో కోపం వస్తే ఒక మాట అనేసి బయటకు వెళ్ళేవారు. ఆఫీసుకు వచ్చాక ఇంటినీ, కుటుంబాన్నీ మరిచిపోయి పనిలో నిమగమయ్యేవారు. ఇప్పుడు పొట్లాడుకుంటూనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ పని చేయాల్సి రావడం ఎంత సంక్లిష్టం. మధ్యతరగతి కొంపల్లో 'ఏకాంత మందిరాలు', 'కోపగృహాలు', 'అలకతో గారాలు' పోవడానికి ప్రత్యేకించిన గదులేం ఉండవు. అందరూ స్టోర్‌రూమ్‌ల వంటి ఒకటీ రెండు పడకగదుల్లోనే సర్దుకుపోవాలి. నగరాల్లోనైనా, పట్టణాల్లోనైనా ఇదే సాధారణ దృశ్యం.
ఇంటి నుంచే పని సుఖప్రదమూ, సౌకర్యవంతమూ కాదని కరోనా-లాక్‌డౌన్‌ అనుభవం తెలియజెప్పింది. పని ప్రదేశం, నివాస స్థలం వేరుగా ఉంటేనే అందం, ఆనందం. ఇంటికొచ్చాక ఆఫీసు గురించి ఆలోచించక్కర్లేదు అనే భావనలోనే సౌఖ్యం ఉంటుంది చాలామందికి. కానీ ఇల్లు, ఆఫీసు ఒకటే అయితే ఈ సౌఖ్యం బొత్తిగా ఉండదని కరోనా కల్లోల కాలం చెప్పింది. 'ఇంటి నుంచే పని' అన్నది ఆడవాళ్ళ మీద అదనపు భారం మోపింది. పిల్లలకీ, శ్రీవారికీ సేవలు చేయడంలో ఆడవాళ్ళ రెక్కలూడ్చుకుపోతున్నాయి. ఇంటిపనే ఒక యాతన అంటే, ఇక ఇంట్లోనే తిష్టవేసిన భర్త, పిల్లల డిమాండ్లు తీర్చడానికి అరవచాకిరీ చేయాల్సి రావడం కనాకష్టం. ఈ కారణంగానే ఉద్యోగాలు చేసే మహిళలు ఇంటి కన్నా ఆఫీసు పదిలం అనుకుంటున్నారు.
రంగనాయకమ్మ ఒక నవలలో సౌకర్యవంతమైన ఇల్లు అంటే కనీసం ఆరుగదుల ఇల్లు అయి ఉండాలని అన్నారు. కానీ సగటు భారతీయులకు అది ఒక కల. నెరవేరని ఆదర్శం. కోట్లమంది భారతీయులు ఒంటిగదిలోనే కాపురముండటం చేదునిజం. రెండు పడకగదుల ఇంటికోసం చేసిన అప్పు తీర్చడానికే బతుకంతా చాకిరీ చేయడం మధ్యతరగతి నైజం. ఈ గుడుగుడుగుంచం బతుకులకు 'వర్క్‌ ఫ్రమ్‌ హౌం' అన్న భావన సరిపడని వ్యవహారం. ఇది కరోనా కాలం నేర్పిన పాఠం. ఇంతకు మించి ఆలోచించడానికి వీలు పడనిది మధ్యతరగతి చైతన్యం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
భజన పరాయణత్వం!

తాజా వార్తలు

10:01 PM

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌

09:49 PM

వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం

09:22 PM

ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని

09:04 PM

లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి

08:43 PM

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం

08:18 PM

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

07:58 PM

సౌదీ అరేబియాలో విషాదం..భారతీయ నర్సులు దుర్మరణం

07:50 PM

బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు

06:50 PM

పునరావాసం కల్పించాలి

06:48 PM

ఘనంగా రేణుక దేవి కళ్యాణ మహోత్సవం

06:47 PM

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..

06:37 PM

మందు బాబులకు కొత్త సమస్య..

06:24 PM

ఏపీలో 106 కరోనా కేసులు నమోదు

06:18 PM

ఖమ్మం జిల్లాలో జేసీబీలు..ట్రాక్టర్లు పీఎస్‌కు తరలింపు

05:58 PM

మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే బూతు పూరాణం..ఆడియో వైరల్

05:43 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్

05:39 PM

సహజీవనాన్ని లైంగికదాడిగా భావించ‌లేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

05:21 PM

ఐఫోన్‌ ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. యాపిల్‌ జ్యూస్‌ వచ్చింది..

05:02 PM

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం

04:46 PM

త్వరలోనే బీజేపీ పనైపోతుంది..

04:30 PM

వకీల్ సాబ్ నుంచి రానున్న 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్

04:13 PM

మోసపోయిన 'భీష్మ' డైరక్టర్ వెంకీ కుడుముల

04:00 PM

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

03:54 PM

నా దేవుడి ను మళ్ళీ కలుసుకున్నాను : బిగ్ బాస్ ఫేం అశూ రెడ్డి

03:34 PM

ఘోర రోడ్డు ప్రమాదం..

03:25 PM

ఏసీబీకి చిక్కిన ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి

03:09 PM

రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి

02:57 PM

కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన ప్రకటన

02:44 PM

హత్రాస్ బాధితురాలి తండ్రి హత్య

02:26 PM

తెలంగాణపై కేంద్రం వివక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.