Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చరిత్ర రచన | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

చరిత్ర రచన

ఎవరి చరిత్ర వారు రాసుకోకపోతే ఆధిపత్యవర్గాల చరిత్రనే చరిత్రగా చెలామణయ్యే ప్రమాదం ఉంది. శతాబ్దాల మానవ ఇతిహాసం చెబుతున్న సత్యమిది. ఇరవయ్యోకటో శతాబ్దంలోనూ వివేచనాపరులు మేల్కొనకపోతే పెత్తందార్ల చరిత్రనే మానవాళి చరిత్రగా రుద్దబడుతుంది. మన సమీపగతాన్ని కూడా మనం రికార్డు చేసుకోకపోవడం కారణంగా దుర్మార్గులు దేశభక్తులుగా, దేశభక్తులు ఉగ్రవాదులుగా, హింసావాదులుగా ముద్రవేయబడుతున్నారు. ఇది వర్తమానానికే కాదు రానున్న కాలానికి అతి పెద్ద ద్రోహం. మన చరిత్ర నుంచి మనం వెలివేయబడటం.
ఝాన్సీలక్ష్మీబాయి గురించి గొప్పగా చదువుకున్నాం. కత్తి చేతపట్టి యుద్ధరంగంలో కాకలు తీరిన యోధురాలిగా శత్రుమూకల్ని చీల్చి చెండాడిన ఝల్కారీబాయిని మాత్రం చరిత్ర విస్మరించింది. పరిణతి చెందిన రాజనీతివేత్తగా, జన శ్రేయస్సుని కోరిన మంత్రాంగంతో ముందు నిలిచిన నాయకురాలు నాగమ్మ కుట్రదారుగా చరిత్రలో నమోదయింది. అసలు కుట్రదారుడయిన బ్రహ్మనాయుడు వీరోచిత పురుషునిగా చరిత్రకెక్కాడు. పరాజితుల ఉనికినే కాదు, వారి చరిత్రని రూపుమాపడానికి ఆధిపత్యవర్గాలు ప్రయత్నిస్తాయనడానికి ఇదొక దాఖలా.
బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన టిప్పు సుల్తాన్‌ దేశభక్తినీ చరిత్ర విస్మరించింది. లొంగిపోవడానికి, సాగిలపడటానికి అంగీకరించని టిప్పు తిరుగుబాటు తత్వం స్ఫూర్తిదాయకం. చివరిశ్వాస వరకు ధిషణ ధిక్కారాన్ని ప్రదర్శించిన టిప్పు ఓ ఆత్మగౌరవ పతాక, దోపిడీని ప్రతిఘటించే శక్తులకు ప్రతీక. కానీ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రరచనలో అతనికి తగిన అధ్యాయం సమకూరలేదు. ఇది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహం కాషాయ పాలకుల హయాంలో నిర్లజ్జగా కొనసాగుతున్నది.
ప్రజల విప్లవాలను, వారి చారిత్రక పోరాటాలను స్మరించడం అధికారంలో ఉన్న పెత్తందారీ వర్గాలకు నచ్చదు. కనుకనే సిలబస్‌ని కూడా మార్పుచేర్పుల పేరిట ఏమారుస్తున్నారు. చరిత్ర రచనాక్రమానికి పెనుముప్పుగా పరిణమించే ఈ వైనాన్ని గురించి రొమిల్లా థాపర్‌ వంటి చరిత్రకారులు హెచ్చరిస్తున్నారు. చరిత్ర నిర్మాణంలో జనపక్షం నిలిచిన వ్యక్తుల, శక్తుల చరిత్రని మాయం చేసే కుట్రలపై అప్రమత్తం చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లోనే కాదు చరిత్రరచనా రంగంలోనూ ప్రతీపశక్తుల కుట్రలు పెట్రేగుతున్న కాలమిది.
నిశ్శబ్దంగా మన కాళ్ళ కింద నేలనే కాదు, మన చరిత్రను కూడా ఛిద్రం చేస్తున్న తీరుని అవలోకించాలి. ఎవరి అనుభవాలు వాళ్ళు రాసుకోడమే కాదు, ఎవరి చరిత్రని వాళ్ళు రాసుకోవాలి. తమ ఉనికిని కాపాడుకోవటం కోసం తాపత్రయపడిన ఆదివాసీలను రాక్షసులుగా, కిరాతకులుగా ముద్ర వేసిన చరిత్ర ఎంత అమానుషమైనదో గుర్తించాలి. కొందరు ఊరవతల ఉండటమే సమంజసం అన్న రీతిన సూత్రాల్ని, సూక్తుల్ని సృజించిన పండితుల ద్రోహాన్ని గురించి ప్రశ్నించడంతోనే సరిపోదు. ఇవాళ ఎవరి చరిత్రని వారు రాసుకోవాలి. తమ మూలాల గురించీ, తాతముత్తాతల శ్రమైక జీవనం గురించి ఆత్మకథాత్మక రచనల ద్వారా తెలియజెప్పాలి. తద్వారా అసలుసిసలు సామాజిక చరిత్ర రచనకు తగిన వనరులు సమకూరుతాయి. శతాబ్దాలుగా అక్షరాలకు దూరమైన వారు అక్షరంపై అధికారం సంపాదించడంతోనే సరిపెట్టుకోకూడదు. తమ అక్షరాల్ని పదునెక్కిన ఆయుధాలుగా మలిచేందుకు తమ చరిత్రని తాము లిఖించాలి. ఇక్కడ ఎవరూ సామాన్యులు కాదు, జీవన పోరాటంలో ఢక్కామొక్కీలు తిన్న అసామాన్యులే. ఎవరి బతుకు పోరాటం వారికి ప్రత్యేకం. ఒక్కొక్కరి జీవనయానం ఒక్కో చారిత్రక గ్రంథం.
మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు తమ జీవితాల గురించి తాము రాయడానికి పూనుకుంటే చరిత్రకెక్కని గాథలెన్నో గ్రంథస్థమవుతాయి. 'మనకు తెలియని మన చరిత్ర' వంటి పుస్తకాలే ఇందుకు ఉదాహరణ. మన సమీపగతం మనకు తెలియాలంటే ఆత్మకథలు, ఆత్మకథాత్మక రచనలు, జీవితచరిత్రలు, మన పల్లెల్లో మనవాళ్ళు చేసిన పోరాటాలు కాగితాల మీద కెక్కాలి. తెలుగునాట గత వందేళ్ళకాలంలో వెల్లువెత్తిన పోరాటాలు, విప్లవాలు అనేకం. వాటిని ఒక పద్ధతిగా నమోదు చేసిన దాఖలాలు లేవు. కొందరు వ్యక్తుల, నేతల అనుభవాలు మాత్రమే సరిపోవు. సమగ్రమైన చరిత్ర పుస్తకాలకు ఎక్కాలి. కమ్యూనిస్టు ఉద్యమానికి వందేండ్లు పూర్తయిన సందర్భమిది. ఈ శతాబ్ది ప్రస్థానం మీద గ్రంథాలెన్నో వెలువడాలి. అలాగే ఈ దేశంలో అనేకానేక విప్లవాలకు గ్రామాలు, రైతులే ఇరుసుగా ఉన్నారు. ఇవాళ కాషాయ పాలకుల మెడలు వంచే రీతిన యాభై రోజులుగా ఆందోళన చేస్తున్నదీ రైతులే. మరి ఆ రైతుల పోరాటాలకు హారతి పట్టిన చరిత్ర కనిపించదు.
చరిత్ర నిర్మాణానికి చోదకశక్తులు ప్రజలే. ఆ ప్రజల చరిత్ర మాత్రం సక్రమంగా, సరయినవిధంగా రికార్డు కావడం లేదు. ఈ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత సృజనశీలురది. నాలుగు శతాబ్దాల పైబడిన హైదరాబాద్‌ చరిత్ర గురించి కూడా మనకు తెలిసింది స్వల్పం. ఈ నగరం అడుగడుగునా అనేక చారిత్రక గాథలున్నాయి. తిరుగుబాటు స్వరాల గర్జనలున్నాయి. తుర్రెబాజ్‌ఖాన్‌ ప్రతిఘటనా పర్వాలున్నాయి. వాటిని స్మరించుకోవడం, రికార్డు చేయడమంటే చరిత్రకు దివిటీలు పట్టడం. తద్వారా వర్తమానాన్ని మరింత జాగృతం చేయడం. లొంగని తరానికి రూపుదిద్దడం. వెరపు నెరుగని యువచైతన్యాన్ని ప్రోది చేయడం. కనుకనే చరిత్ర రచన ఒక బాధ్యతగా స్వీకరించడం ఈ కాలపు సృజనశీలుర కర్తవ్యం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం
బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?

తాజా వార్తలు

09:47 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

09:41 PM

మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు

09:33 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

09:24 PM

మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్

09:16 PM

కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి

09:04 PM

కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

08:58 PM

నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

08:44 PM

సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..

08:32 PM

వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్

08:20 PM

క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

08:02 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

07:54 PM

దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్

07:40 PM

తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..

07:23 PM

అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం

07:11 PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ

07:01 PM

రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు

06:52 PM

ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..

06:44 PM

వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..

06:40 PM

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

06:34 PM

చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

06:29 PM

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..

06:13 PM

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం

06:04 PM

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

05:49 PM

కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..

05:38 PM

పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

05:32 PM

పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి

05:22 PM

ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం

05:13 PM

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

05:05 PM

భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..

04:50 PM

108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.