Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బడులకు అడుగులు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2021

బడులకు అడుగులు

''సామాజిక విపత్తులే పాఠాలయి నిలిచాయి
జ్ఞానం, తెరవని పొత్తాలై గుణపాఠం నేర్పాయి
ప్రభుత చూపు నింగిలోన ప్రజల బతుకు నేలపైన
భవితకు దిక్కెవరనే ప్రశ్నను కప్పేసాయి!'' అంటాడు ఓ కవి. నిజమే, అనుభవాల నుంచి ఆచరణ నుంచి వచ్చిందే నిజమైన జ్ఞానం. పాఠాల్లో, తరగతుల్లో బోధించేది కూడా ఇదే. భావితరాలకు అందించాల్సిన బోధన ఈ యేడాది కొనసాగనేలేదు. కరోనా విలయతాండవంతో ఈ సంవత్సరపు ఎకడమిక్‌ బడిబాట కుంటుపడింది. ప్రకృతి విలయానికి తోడు పాలకుల పరిపాలనా విలయాలూ తోడయి విద్యారంగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి బడులను ప్రారంభించాలని నిర్ణయించింది. విద్యాశాఖ కూడా దానికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. తొమ్మిదవ తరగతి నుంచి మొదట ప్రారంభించి, తర్వా తర్వాత అంచెలంచెలుగా ఎనిమిది, ఏడు తరగతులకు అనుమతులివ్వాలని నిశ్చయించారు. ఇంటర్‌, డిగ్రీ తరగతులు కూడా మొదలువుతాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి బడులను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఇది ఒక రకంగా సంతోషించే విషయమే.
అయితే ఇప్పటికీ కరోనా కేసులు నమోదువుతూనే ఉన్నాయి. ఒకవైపు టీకాల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీకాలు వేయించుకున్నా జాగ్రత్తలు అవసరమని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పద్దెనిమిది యేండ్లలోపు పిల్లలకు టీకాలు వేయరాదనే సూచనలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి విద్యాశాఖ చర్చించి, ప్రణాళిక తయారుచేసిందా! సరైన కసరత్తు చేయకుండా బడులు ప్రారంభిస్తే ఎదురయ్యే విపత్తులను ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయంగా పరిణమిస్తుంది. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమి, మరుగుదొడ్ల సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి. పరిశుభ్రతతో మెలగవలసిన ప్రస్తుత తరుణంలో వీటిపైన ప్రభుత్వం శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. మరుగుదొడ్ల పరిశుభ్రతకు, పాఠశాల పరిసరాల శుభ్రతకోసం ప్రతి పాఠశాలకు ఒక స్వచ్ఛ కార్మికున్ని నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యానికీ, సాఫీగా బడులు సాగడానికీ ఈమాత్రం ఆలోచించవలసి ఉంది. ప్రతి పాఠశాలకు సానిటైజర్‌లు, విద్యార్థులకు మాస్క్‌లు అందించడమూ అవసరమే. విద్యార్థులు దూరాన్ని పాటించే విధంగా తగు జాగ్త్రతలను నిర్దేశించవలసి ఉంది. ఇకపోతే ఈ విద్యా సంవత్సరం యాభైరోజులు మాత్రమే జరుగనున్నది. అదీ సక్రమంగా కొనసాగినట్లయితేనే. మరి సిలబస్‌, పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులతో చర్చించారో లేదో ఇప్పటికేమీ తెలియదు. విద్యా సంవత్సరాన్ని ఎలా ముగించనున్నారో కూడా స్పష్టంగా తెలుపలేదు. సిలబస్‌ భారాన్ని తొలగించడం, మూల్యాంకన విధానాన్ని సరళీకరించడం చాలా అవసరం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సక్రమంగా నిర్వహించాలి. వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేయవలసి ఉంది.
విద్యారంగాన్ని సాఫీగా కొనసాగించడమేంటే ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. ముఖ్యంగా బోధనలో ముఖ్యపాత్ర నిర్వహించే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వేలాదిమంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అంతర్‌జిల్లా బదిలీలు, ఖాళీల భర్తీలు, పర్యవేక్షణాధికారుల ఖాళీలు మొదలైన సమస్యలెన్నో పేరుకుపోయి ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులకు వేతనాల పెంపు విషయం (పీఆర్‌సీ) ఇంకా తేలనేలేదు. మూడునెలల్లో తేల్చేస్తానన్న ముఖ్యమంత్రి మూడు సంవత్సరాలుగా మూలనపెట్టే ఉంచారు. 475 పాఠశాలలున్న కేజీబీవి పాఠశాలల్లోని పన్నెండువేల మంది ఉపాధ్యాయుల సమస్యలూ పరిష్కారం కాక పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా మోడల్‌ స్కూళ్ళు, రెసిడెన్షియల్‌ కళాశాలలు, పాఠశాలలు, సీఆర్డీల వేతనాలు మొదలయిన అనేక సమస్యలున్నాయి. ఈ సమస్యలు చర్చించి కార్యక్రమాన్ని రూపొందిస్తేనే విద్యారంగం ముందుకు పోతుంది. కానీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సరిగా పట్టించుకోవడం లేదు.
ఒకవైపు కరోనా విపత్తు సాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అనేక ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ ఉన్నది. విద్యరంగంలో కూడా కేంద్రీకరణకు పూనుకున్నది. విద్యలో ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించే, విద్యను కార్పొరేటీకరించే విధానాలతో నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది. విద్యలో మతాన్ని చేర్చి, మూఢత్వాలను, చరిత్ర వక్రీకరణలను బోధించే పనిచేస్తున్నది. ఈ విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ చేయవలసి ఉండగా, ఆ రకమైన కార్యక్రమాలేవీ ఇప్పటివరకూ చేపట్టలేదు.
ఇవన్నీ విద్యారంగం ఎడల మన శ్రద్ధను, ఆసక్తిని తెలియచేసే అంశాలు. ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన, పరిష్కరించాల్సిన అంశాలు. మన దక్షిణాదినే ఉన్న కేరళ ప్రభుత్వం, ఈ సంక్షోభ కాలంలోనూ విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. బడులు నడపడంలో, వాటికి కావలసిన వసతులు, ఏర్పాట్లు చేయడంలో బహుశా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. మన ప్రభుత్వం కూడా అక్కడ ఎలా జరుగు తున్నదో పరిశీలించాలి. ఆ రకంగా మన విద్యారంగాన్ని ముందుకు తీసుకు పోయేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తేనే ఫలితాలను పొందగలుగుతాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.