Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రేమరాగం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

ప్రేమరాగం

''కమ్యూనిజం లేకపోతే, నా దృష్టిలో ప్రేమ అనేది లేదు'' అన్నాడో సందర్భంలో మయకోవస్కీ. ఈ మాట చదవగానే ఎంత విలువైన సత్యం చెప్పాడనిపిస్తుంది. ఎందుకంటే అనేకానేక వైరుధ్యాలున్న సమాజంలో ప్రేమ నిలబడుతుందా? నిలిచి మనగలుగుతుందా? ప్రేమ ప్రేమగా వర్థిల్లుతుందా? అనే ప్రశ్నలకు మయకోవస్కీ చెప్పిన మాటలో జవాబు లభిస్తుంది. మనుషులంతా ప్రేమ ప్రస్తావనతో కూడిన మాటలు, పాటలు రోజూ వింటారు. ప్రకటనలు, సినిమాలు, సీరియల్స్‌, లఘు చిత్రాలన్నిటా ప్రేమే... అంతటా ప్రేమ గురించిన కబుర్లే. చిత్రమేమిటంటే బతుకులో మాత్రం ప్రేమ అరుదు. ప్రేమ ప్రేమగా బతికిన క్షణాలు చాలా చాలా తక్కువ.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కారల్‌ మార్క్స్‌ మాట ఎంత సత్యమో ఏండ్లు గడుస్తున్న కొద్దీ అనుభవంలోకి వచ్చి ప్రేమ మీద మనుషులు నమ్మకం కోల్పోతారు. అయినా ప్రేమ కోసం ఆరాటపడతారు, అల్లాడుతారు. ''మనుషులకేం కావాలి కాసింత దయ, ప్రేమ'' అంటాడు ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు. కాసింత ప్రేమ దక్కుతుందా జీవితపు ఆఖరిక్షణంలోనైనా. ''నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే విలపించుటకు'' ఒక్కరంటే ఒక్క మనిషి ఉంటే చాలని శ్రీశ్రీ ఓ సినీగీతంలో అన్నాడు. బతుకంతా వేచి చూసినా ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలకపోవడమే అసలు విషాదం. ఈ విషాదానికి మూలాలు మనం బతుకుతున్న దుర్మార్గమైన దోపిడీ వ్యవస్థలో ఉన్నాయి. ఈ మాట ఒప్పుకోడానికి మనసు అంగీకరించదు. సకల స్వార్థాల్ని వీడి, తనని ఓ మనిషి ప్రేమించాలని ఆశించడం మానవ నైజం. కానీ ప్రతి మనిషి సాటి మనిషిని దోచుకొనువాడే అనే సంగతి బోధపడక మనుషులు ప్రేమ కోసం అంగలారుస్తారు. ఓ మనిషిని మరో మనిషి దోచుకుంటే తప్ప బతకలేడనే స్థితికి దిగజార్చింది కూడా మార్కెట్‌ బేహారులే అన్నది గ్రహించరు.
ప్రేమ గురించి ఆలోచిస్తే, చుట్టూ ఉన్న సమాజపోకడల గురించి యోచిస్తే మయకోవస్కీ చెప్పిన మాటలోని సారాంశం అర్థమవుతుంది. ఆ మాటలోని గాఢత, సాంద్రత మనసుని హత్తుకుంటాయి. ఒక మనిషికి మరో మనిషి పట్ల ఆకర్షణ, మోహం సహజాతి సహజం. పరస్పర ఇష్టం, మోహం కలిగినంత మాత్రాన వారు కలిసి జీవించగలరా? సహజీవనం చేయగలరా? చుట్టూ ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు, దాటలేని అగాథాలు ఉంటాయో తెలిసిందే. తమ కులం కాని వ్యక్తి పట్ల బిడ్డ మోహపడటమే కులదురహంకారులకు నచ్చని వ్యవహారం. అందుకే కన్నబిడ్డనో, ఆ బిడ్డని ప్రేమించినవాడినో హతమార్చేంత పాశవికత చెలరేగుతున్నది.
ఎవరిపై ఎందుకు ఎపుడు ఇష్టం, మోహం కలుగుతుందో చెప్పలేరు. అయినప్పటికీ ఇపుడు ఎవరిని ప్రేమించాలో, ఎవరిని కూడదో రాజ్యం చెబుతున్నది. కులమతాలకు అతీతమైనది ప్రేమ అనే మాటలు, పాటలు, సూక్తులు ఎన్నో విన్నాం. అయినప్పటికీ ఒక మతానికి చెందినవారు మరో మతానికి చెందినవారిని ప్రేమించరాదని రాజ్యమే శాసిస్తున్నది. వాళ్ళకు వీలయితే ఒక మతం వారికి మరో మతం మీద ప్రేమ కలగకుండా డీఎన్‌ఏ కూడా తయారు చేస్తారేమో! అంతకు తెగించగల ప్రబుద్ధులున్న కర్కశ కాషాయ పాలన ఇది. తన మతం కాని వారిని ప్రేమించడం, పెళ్ళాడటం నేరమని పాలకులు చెప్పడమంటే మానవ సహజాతాలపై రాజ్యం ఉక్కుపాదం మోపడమే.
ప్రేమతో పరిఢవిల్లాల్సిన భూగోళం ఇంత ఘర్షణాపూరితంగా పరిణమించడంపై ఆకెళ్ళ రవిప్రకాష్‌ ప్రతీకాత్మకంగా స్పందిస్తూ - ''నేనొక స్వప్నం చూసాను - ఆ స్వప్నంలో ఒక నగరం చూసాను/ అక్కడ సైన్యాలు లేవు ఎవరి భుజాలమీద తుపాకులు లేవు/ సైనికుల శరీరాల మీద జాతీయ జెండా కప్పడం, యుద్ద కథల్ని పిల్లలకి చెప్పడం లేదు/... అటువంటి ప్రేమ ప్రపంచంలోకి భూగోళం ఎగరడం చూసాను/ ప్రేమలోకి స్వేచ్ఛలోకి ప్రతి మనిషి ఎగరడం చూసాను'' అంటారు. యుద్ధాల్లేని, వైషమ్యాల్లేని ప్రపంచం కమ్యూనిజంతోనే సాధ్యం. అటువంటి కమ్యూనిస్టు సమాజంలోనే ప్రేమకు ఉనికి, మనుగడ, కొనసాగింపు ఉంటాయి.
ప్రేమ ఓ కమనీయమైన భావోద్వేగం. మానవుల్ని ఊరడించే సహజాతం. అందుకే 'ప్రేమ' ఇతివృత్తంగా వచ్చే సాహిత్యం, కళారూపాలపై ఆసక్తి అధికం. మరీ ముఖ్యంగా సినిమాలకీ, టీవీ కథలకీ, సీరియల్స్‌కీ 'ప్రేమ'నే ప్రధాన ఇతివృత్తం. కానీ స్త్రీ పురుష ప్రేమలోని మాధుర్యం, గౌరవం, ఔన్నత్యం మన సినిమాల్లో ఎక్కడీ ''ప్రేమలేని ముద్దు కన్న మరణం మేలు'' అంటుంది సోవియట్‌ వీరవనిత జోయా. ఆ మాటలోని తీవ్రత, గాఢత, స్ఫూర్తి అర్థం చేసుకున్న కవులు, కళాకారులు అరుదు. కనుకనే గొప్ప ప్రేమ నవలలు, సినిమాలు బహుతక్కువ.
నిజమైన ప్రేమ గురించి తెలుసుకోవాలన్నా, అది మన అనుభవంలోకి రావాలన్నా మన చుట్టూ ఉన్న లోకం పట్ల గమనింపు ఉండాలి. పరస్పరం అవగాహన కావాలి. జ్ఞానంతో ఇరు హృదయాలు వెలగాలి. ఇద్దరు సమానుల మధ్యనే తప్ప అసమానుల మధ్య ప్రేమ పొసగదు, కొనసాగదు. ఈ విషయాలని 'అసమానత్వం నుంచి అసమానత్వంలోకి' అనే పుస్తకంలో రంగనాయకమ్మ సవివరంగా చర్చించారు. 'ప్రేమ కన్నా తీయనైనది' అంటూ ఓ నవలలో ఆడవాళ్ళకు ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో చెప్పారు. పరస్పర గౌరవమున్న చోటనే ఇష్టం, మోహం ప్రేమగా పరిణమిస్తుంది. ఆ ప్రేమరాగం జీవితమంతా కొనసాగుతుంది. ఆ కొనసాగింపు మొత్తం మానవ జీవితాన్ని పరిమళించడం కమ్యూనిజంలోనే సాధ్యం. ఆ వ్యవస్థ సాకారం కోసం శ్రమించడంలోనే ఇవాళ్టి ప్రేమికుల బతుక్కి సార్థకత.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!

తాజా వార్తలు

06:35 PM

కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం.. మరో ఏడుగురికి పాజిటివ్

06:06 PM

షర్మిల ఎదుగుదలను తట్టుకోలేకపోయిన రేవంత్ : దేవెందర్ రెడ్డి

06:02 PM

పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుపై జగన్ సమీక్ష

05:55 PM

గృహ రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ

05:48 PM

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

05:41 PM

మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి

05:30 PM

న్యాయవాదుల హత్య కేసు.. పార్వతీ బ్యారేజీలో కత్తి లభ్యం

05:22 PM

బొల్లారంలో మహిళ దారుణ హత్య

05:12 PM

అమిత్ షాపై పరువునష్టం కేసు వేస్తా : మాజీ సీఎం

05:04 PM

మెదక్‌ జిల్లాలో చిరుత కలకలం

04:56 PM

యువతుల కొత్త తరహా దందా.. పోలీసుల రాకతో వెలుగులోకి..

04:42 PM

మహబూబ్​నగర్​లో గ్రనేడ్ కలకలం..

04:33 PM

కాలేజీ బస్సు బోల్తా..50మంది విద్యార్ధులకు గాయాలు

04:19 PM

దారుణం.. యువతి కాళ్లు చేతులు కట్టేసి ఓ తోటలో...

03:57 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

03:51 PM

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

03:41 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

03:33 PM

పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్​ రావు దంపతుల హత్య : జీవన్ రెడ్డి

03:21 PM

న్యాయవాదుల హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

03:13 PM

టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

03:07 PM

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

03:01 PM

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాన్సీ సెహ్ గల్

02:58 PM

బెంగాల్​లో 8 దశల పోలింగ్​పై సుప్రీంలో పిటిషన్..

02:37 PM

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరికి గాయాలు

02:15 PM

ఈటల, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు..

02:08 PM

ఎన్నికల కోడ్‌ వల్లే చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు..

01:57 PM

ఘోర ప్రమాదం.. టీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

01:51 PM

నటి హిమజకు లేఖ రాసిన పవన్ కళ్యాణ్

01:48 PM

పీఎఫ్ ఖాతాదారులకు షాక్..!

01:43 PM

ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల‌బుల్: కేటీఆర్​

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.