Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అమ్మపలుకు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 21,2021

అమ్మపలుకు

అమ్మభాషల గురించి మార్కెట్‌కు తెలిసినంతగా పాలకులకు తెలియకపోవడం విడ్డూరం కాదు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. అమ్మభాషలో చదువుకుంటే ఉపాధి ఉండదనే స్థితికి జనాలని నెట్టివేసాయి ప్రభుత్వాలు. దరిమిలా ఆంగ్లంలో చదువుకుంటేనే బతుక్కింత భరోసా లభిస్తుందని ఆశలకు లోను చేసాయి. దీనితో రెండు దశాబ్దాలకు పైబడి తెలుగునాట ఆంగ్లం చదువులు మామూలయ్యాయి. కోట్లాది మంది పిల్లలు తేనెలొలుకు తెలుగు మాటలు నేర్చుకొని మూడేండ్లు దాటకుండానే పరాయి భాషల వల్లింపుకు కాన్వెంట్లకు తరలింపబడటం చేదు నిజం. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ తమ భాష తమకు వద్దు అనే విపత్కర పరిణామం నెలకొనలేదు. కేవలం తెలుగునాట మాత్రమే తెలుగువద్దు ఆంగ్లమే ముద్దు అనే స్థితి రాజ్యమేలడం మనం చూస్తున్న నిజం.
అయినా ఏటేటా మాతృభాష దినోత్సవాలు (ఫిబ్రవరి 21) జరుపుకోడం ఆనవాయితీ. గిడుగు పేరుతోనో, కాళోజీ పేరుతోనో తెలుగు భాష ప్రాశస్త్యం గురించి చెప్పుకుంటారు. ఈవిధంగా ఏడాదికి ఒకటీ రెండుసార్లు తెలుగు భాషకు తద్దినం పెట్టడం తెలుగువారి నవ్య సంప్రదాయమైంది. అందుకని ఇక్కడ ఆంగ్లంలో తెగ చదివేసుకొని ఆంగ్ల భాషా పండితులయిన వారు ఎవరూ లేరు. ఏ తెలుగువాడు కూడా అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగిన కవిత్వమో, కథలో, నవలలో రాసిందీ లేదు. అటు తెలుగు, ఇటు ఇంగ్లీషు సరిగా రాని తెలుగువాళ్ళను తయారు చేసిపెట్టాయి మన చదువులు. అమెరికాలో ఉన్నా, ఆంధ్రలో ఉన్నా అమ్మపలుకును మరవలేరు. కానీ అమ్మభాషలో మాత్రం చదువులు వద్దు అనుకుంటున్నారు.
అయినా ఇవాళ మాతృభాష దినోత్సవ వైశిష్ట్యం గురించి చిలకపలుకుల వల్లింపు వినిపిస్తుంది. అమ్మభాష మాధుర్యం ఎనలేనిదంటూ ఉపన్యసిస్తారు. కపటత్వం తమ జీవనశైలిలో అంతర్భాగం చేసుకోడం తెలుగువారి దౌర్బల్యం. భాష విషయంలో ఇది స్పష్టాతిస్పష్టం. ఇంటర్మీడియేట్‌లో సంస్కృత భాషని రెండేండ్లు చదువుతారు- కేవలం అత్యధిక మార్కులకోసం. మొక్కుబడిగా సంస్కృతాన్ని వల్లెవేస్తారు. అలాగే ఇంగ్లీషు మాధ్యమాన్ని స్వీకరించినప్పటికీ ఆ భాషని నేర్చుకోవాలనే తపన కనిపించదు. ఇక ఒక సబ్జక్టుగా ఉన్నప్పటికీ తెలుగును సరిగా నేర్పే దృష్టికోణం లేదు. ఈవిధంగా భాషల పట్ల నిర్లక్ష్యం మన విద్యావ్యవస్థని పట్టిపీడిస్తున్నది. ఆంగ్లం మీద మోజే తప్ప ఆ భాష మీద మమకారమేమీ లేదు. అసలు ఏ భాష పట్ల కూడా ఎవరికీ శ్రద్ధ లేదు. అయినా తెలుగులో చదువుకుంటే బతుకు లేదని, ఆంగ్లం బువ్వ పెడుతుందని విశ్వసిస్తారు.
పాలకులకు ఒక భాషావిధానమంటూ లేదు. తెలంగాణ ఉద్యమ కాలాన తెలంగాణ భాష గురించి గొంతు చించుకున్నారు. అధికారంలోకి వచ్చాక తెలుగు భాషకు సమాధికట్టే చర్యలనే తెలంగాణ పాలకులు అనుసరిస్తున్నారు. నూతన విద్యావిధానంలో మాతృభాషలో అయిదో తరగతివరకు, ఇంకా చెప్పాలంటే ఎనిమిదో తరగతి వరకు మాతృభాషల్లోనే చదువులు కొనసాగాలని నిర్దేశించినట్టు తొలుత ప్రచారమయింది. తెలుగు భాషా ప్రేమికులు సంబరపడ్డారు. కానీ ''కుదిరిన పక్షంలో, వీలయిన పక్షంలో'' మాత్రమే మాతృభాషల్లో బోధించవచ్చునని చెప్పారు. తెలుగునాట పాలకులకు కుదరదు, కనుక ఇక్కడ నిక్షేపంగా ఆంగ్లంలోనే చదువులు కొనసాగుతాయి.
అమ్మ భాషల ప్రాధాన్యం గుర్తించే శక్తి, ఇచ్ఛ పాలకులకు లేదు, కానీ మార్కెట్‌కు ఉంది. అందుకే అమెజాన్‌.కాం కూడా తెలుగులోనే ఆర్డర్లు తీసుకోడానికి ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి వేదికల్లో ఆంగ్లభాషా చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు తెలుగులో డబ్బింగ్‌ అయి తెలుగువారిని అలరిస్తున్నాయి. హర్షద్‌మెహతా మీద వెబ్‌సిరీస్‌కు తెలుగునాట లభించిన ఆదరణ అంతాఇంతా కాదు. ఎందుకంటే అది తెలుగు డబ్బింగ్‌లో ఉండటమే కారణం. అనేక కార్పోరేట్‌ కంపెనీల ప్రకటనలు తెలుగులో అందంగా ముస్తాబయి ప్రసారమవుతుంటాయి. 'అమ్మ పలుకు'లో చెబితే మనసుకు హత్తుకుంటుందనే మంత్రం వారికి తెలుసు. కనుక కోట్లాదిమంది తెలుగువారి మనసునీ, డబ్బునీ సొమ్ము చేసుకోడానికి వాణిజ్యప్రకటనలన్నీ తెలుగులో ఉంటాయి. అనేకానేక హాలీవుడ్‌ చిత్రాలు, ఆంగ్లంలో ప్రసిద్ధి చెందిన పుస్తకాలు తెలుగు అనువాదాలతో వస్తున్నాయి. తెలుగు నుడికారంలో చెబితే ఉండే అందం వేరు. కనుకనే వజ్రాల ప్రకటనలు, బీమా పాలసీలు, సబ్బులు, కార్లు, బట్టలు ... ఒకటేమిటి సకలం తెలుగులోనే వినిపించడం, కనిపించడం మహత్తు కాదు, మార్కెట్‌ వాస్తవికత. తెలుగుభాషకు ఉన్న డిమాండ్‌కు నిదర్శనం.
బోధనా మాధ్యమంగా తెలుగుని అంగీకరించరు. అయినప్పటికీ అమెరికాలో ఉన్నా, ఆంధ్రలో ఉన్నా, తెలంగాణలో తిరుగాడుతున్నా మన మాటలు, నవ్వులు, ఏడ్పులు అన్నీ తెలుగులోనే. అమ్మభాషని వదలాలన్నా వదల్లేరు. అంతటి శక్తివంతమైన తెలుగు భాషలో మాత్రం చదువులు అక్కర్లేదు అనే నిర్ణయాలకు పాలకులకు వచ్చి, అందుకు ప్రజల ఆమోదం పొందడం విరోధాభాస. మాతృభాష దినోత్సవం 21 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఆరంభమైంది. ఈ సరికొత్త మిలీనియంలో ఏండ్లు గడుస్తున్నకొద్దీ తెలుగు చదువులు నీరసించిపోవడం పాలకుల నిర్వాకం ఫలితం. నిజంగా ఆంగ్లంలో చదువుకుంటే బతుక్కి ఢోకా లేదనుకుంటే ఎందుకింత నిరుద్యోగం? లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు రోడ్డున పడి ఎందుకు రోదిస్తున్నారు? ఆంగ్లాన్ని నమ్ముకున్న అమ్మలు, అయ్యలు - గద్దెలెక్కిన పెద్దల్ని ఈ ప్రశ్నలతో నిలదీయండి. అమ్మభాషల దినోత్సవమే ఇందుకు తగిన సందర్భం, సన్నివేశం!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం
బడులకు అడుగులు

తాజా వార్తలు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.