Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నియంతల నియంత్రణ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

నియంతల నియంత్రణ

''నువ్వు ఒంటిపైని, వస్త్రాలన్నీ వొలిచేయ్
రాత్రి గదిని వెలుతురుతో తెరపైకెక్కించేయ్
కొంచెం కొంచెం మెదళ్ళపై మత్తును చల్లుతూపో...
నీ స్వేచ్ఛకు హారతి పడతాం, కాపాడతాం' కానీ...
ఒక ప్రశ్నను నాపైకి విసురుతావా! నిన్ను నిలువునా పాతేస్తా
లేదంటే నియంత్రణల సుడిలోకి తోసేస్తా!'' ఇదీ ఇప్పుడు మన ప్రభుత్వాధినేతల తీరు. ఇలాంటి నియంతల నియంత్రణలు విన్నప్పుడు తప్పకుండా ఈ వ్యాక్యాలు గుర్తుకు వాస్తాయి. ఎందుకంటే ఎదుటివారిని నియంత్రించడంలోనే నియంతల బలం ఆధారపడి ఉంటుంది. ప్రశ్నల్ని పాతేసిన చోటనే నిరంకుశత్వం వెర్రితలలేస్తుంది.
సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిని, విద్వేష ప్రసంగాలను నివారిం చేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించామని కేంద్రం చేసిన ప్రకటన చాలా మంది సామాన్య ప్రజలకు సాధారణ, సౌమ్యమైన ప్రకటనగానే కనిపించవచ్చు. కానీ ఆ నియంత్రణల వెనకాల ప్రజల, పౌరుల ప్రజాతంత్ర హక్కులు కాలరాయబడతాయనే చేదు నిజాలు పకడ్పందీగా దాగి ఉన్నాయన్నది రేపు తెలియబోయే సత్యం. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వార్తలు, ఓటీటీలను నియంత్రిస్తూ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన ప్రభుత్వం వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటివి కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. వీటి ప్రకారంచట్ట విరుద్ధమైన విషయాలు మొదటగా ఎక్కడి నుంచి ఎవరి నుంచి వస్తున్నాయన్న సమాచారం తెలుసుకుని ముప్పయి ఆరుగంటల్లోనే ఆయా సంస్థలు తొలగించాలని నిర్దేశించింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకే ఈ నిబంధనలను రూపొందించినట్టు మంత్రి పేర్కొన్నప్పటికీ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో గత మూడు నెలలుగా ఢిల్లీలో రైతులు, పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఉద్యమానికి అంతర్జాతీయ సంఘీభావమూ వెల్లువెత్తుతోంది. రైతులకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని అప్పుడే ట్విట్టర్‌ను కేంద్రం ఆదేశించింది. కొందరి ఖాతాలనూ తొలగించాలంది. కొందరి ఖాతాలను తొలగించినప్పటికీ పౌరుల భావస్వేచ్ఛను అడ్డుకోలేమని ట్విట్టర్‌ నిర్వాహకులు తెలపడంతో వివాదం మొదలైంది. దాని పర్యవసానంగానే నియంత్రణల కొరడా ఝుళిపిస్తోన్నది కేంద్రం.
సాధారణ ప్రింట్‌ మీడియాను, ఎలక్ట్రానిక్‌ మీడియాను తొంభైశాతం తన గొంతుగా మార్చుకున్న ప్రభుత్వం, తనకు వ్యతిరేకంగా ఒక్కమాట వినిపించినా అనేక దారుల్లో, దాడులతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. నిర్బంధిస్తోంది కూడా. ఇప్పుడు జైళ్ళలో ప్రశ్నలు లేవనెత్తిన జర్నలిస్టులు, గొంతులెత్తిన విద్యార్థులు, ఉద్యమించిన రైతులు, దళితులు, మైనారిటీలు, పర్యావరణ కార్యకర్తలు, హక్కులకై పోరాడే వారే ఉన్నారు. వీరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అబద్ధాలను నిజం చేయాలనుకుంటున్నారు. ఈ విషయాలన్నింటికీ వేదికగా ఈ రోజు సోషల్‌ మీడియా గొప్ప పాత్రను పోషిస్తున్నది. అందుకనే అలాంటి సోషల్‌ మీడియాను కూడా నియంత్రించగలిగితే నిరంకుశ విధానం నింపాదిగా నడిచిపోగలుగు తుంది. ప్రజాస్వామ్య హక్కులను రక్తం చిందకుండా హత్యచేయ గలుగుతారు. ఇప్పుడు కార్పొరేట్ల కోసం ప్రభుత్వరంగాన్ని కారుచౌకగా ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. ప్రజల సొమ్మును అమ్ముకుంటున్నారు. ఇకముందు వీటికి వ్యతిరేకంగా వచ్చే వార్తల్ని, వ్యాఖ్యల్ని నియంత్రిస్తారు.
విద్వేష ప్రసంగాలను, సోషల్‌ మీడియాలో అబద్ధాల్ని విరివిగా ప్రచారం చేస్తున్నది సంఘపరివార్‌ శక్తులే. ప్రభుత్వ అనుకూల వ్యక్తులే. ఇదెలా ఉందంటే దొంగే 'దొంగ దొంగ' అన్న చందంగా ఉంది. జనవరి 26న కిసాన్‌ పెరేడ్‌లో జరిగిన హింసకు ఎలాంటి సంబంధం లేని దిశారవికి ఉగ్రవాదాన్ని అంటగట్టే ప్రయత్నం చేసింది వారు. దిశా రవి, ఉగ్రవాది కసబ్‌ లాంటిదేనని బీజేపీ ఎమ్మెల్యే సి.పి. మోహన్‌ విద్వేష ప్రకటన చేస్తాడు. దిశారవి లాంటివారిని ఖతం చేయాల్సిందేనని హర్యానా హౌమ్‌మంత్రి ప్రకటిస్తాడు. గాంధీ, నెహ్రూల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అబద్ధాలను కుమ్మరిస్తోందీ వారే. సంఘ్ పరివార్‌ లక్ష్యమేమిటో చాలా స్పష్టంగా వివరించి చెబుతున్న సీపీఐ(ఎం) అగ్రనాయకులు సీతారాం ఏచూరిపై అసత్యప్రచారం నిర్లజ్జగా చేస్తున్నదీ వారే. కానీ వారికి భిన్నమైన అభిప్రాయాలు, నిజాలు, వాస్తవాలు వినపడగానే గంగవెర్రులెత్తి నియంత్రించేందుకు ఎదుటివారిపై దాడికి పూనుకొంటున్నారు.
సోషల్‌ మీడియాపై కొత్త నిబంధనలపేరుతో నియంత్రణ మోపి తమకు, తమ నియంత విధానాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న భావాలపై, గొంతులపై నిషేధాలకు తెరలేపటమే ఈ లక్ష్మణరేఖల సారంగా అర్థం చేసుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విలయం
ప్రభుత్వాలకు ఇది తగునా?
విభజన రాజకీయాల్లో బెంగాల్‌
ఈ ఆగడాన్ని తిప్పికొట్టాలి
తలొగ్గిన కేంద్రం
''ఉత్తుత్తి ఉత్సవం''
ఆశ
బలిదానాలొద్దు...
ఎన్నికలుంటే ఎంత బాగుంటుందీ...
వైఫల్యానికి నిదర్శనం
ప్రమాదఘంటికలు
ప్రచార తంత్రం
అమ్మ
అభివృద్ధిలో ''ఆమె'' ఎక్కడ?
సహేతుకత ఏదీ?
నిరుద్యోగ రక్కసి
అబద్ధమూ ఓ కళే!
బంతాట!
భౌతిక భక్తి
అందని టీకా
కేరళ ఎన్నికలలో రాజకీయ దుష్ట త్రయం
మానని లాక్‌డౌన్‌ గాయాలు
ఢిల్లీకి సంకెళ్లు
మోడీ బ్రాండ్‌ ''సవ్య సాచిత్వం!''
కవనలోకం
''ఫీడింగ్‌''కు సీడింగ్‌ అడ్డు!
లోగుట్టు కేసీఆర్‌ కే ఎరుక!?
అమెరికా ప్రమాదకర వ్యూహం - క్వాడ్‌
అంగట్లో దేశం..
''లోకల్‌'' పాలిట్రిక్స్‌

తాజా వార్తలు

11:07 AM

కుంభమేళాకు వెళ్లిన వారికి క్వారంటైన్ తప్పనిసరి

11:00 AM

కొవిడ్ పై నేడు ప్రధాని మోడీ సమీక్ష

10:58 AM

మోత్కుపల్లి ఆరోగ్యం విషమం

10:56 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

10:50 AM

రాష్ట్రంలో 5వేలు దాటిన కరోనా కేసులు

10:44 AM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరి మృతి

10:44 AM

ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..

10:31 AM

జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం

10:20 AM

కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

08:18 PM

బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే

08:02 PM

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

07:45 PM

కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు

07:39 PM

కరోనా సెకండ్‌ వేవ్‌...అధికారులతో మోడీ కీలక సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.