Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ముగింపు ఎక్కడీ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2019

ముగింపు ఎక్కడీ

బానిసలు - భరించడం తప్ప
ఎదిరించడం నేర్వకూడదు
బానిసలు- పడి వుండటం తప్ప
ప్రశ్నించడం చేయకూడదు - హిందూ మతంలోని అణగారిన కులస్తులను బానిసలుగా పేర్కొన్నాడు దాని సిద్ధాంత కర్త మనువు. ఆ బానిసలను సర్వ విధాలుగా అణగదొక్కే హక్కు, అనుభవించే హక్కు ద్విజ కులాలకు ధారాదత్తం చేశాడు. ఇప్పుడు ఆ మనువు వారసులైన నేటి ఆధునిక మనువులు తమ ఆది గురువునే మించిపోయారు. అనుమానమా మీకు? అయితే, ఉన్నావ్‌ లైంగికదాడి బాధితురాలు, గురువారంనాడు లైంగిక దాడి నిందితుల చేత పెట్రోల్‌పోసి తగలబెట్టబడ్డ బిడ్డ తండ్రి ఆవేదన ఆలకించండి.. ''పెత్తందారీ కులానికి చెందిన వారు కాబట్టే నిందితులను బెయిల్‌ ఇచ్చి వదిలిపెట్టారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిందితులకు బెయిల్‌ ఇవ్వకుంటే ఇలా జరిగేదే కాదు!'' - ఈ ఆధునిక మనువులు కులానికి ఆర్థికాన్ని కూడా జోడించి అణగారిన కులాలపై, ఆర్థిక బలహీనులపై విరుచుకు పడుతున్నారు.
నేరం ప్రధానంగా మానసిక వ్యవహారం. తాను చేయాలనుకున్న, చేస్తున్న నేరానికి దన్నుగా తన 'థర్మం' ఉన్నదని భావించిన వ్యక్తి, తన నేరానికి శిక్ష ఉండదనీ, ఉన్నా దానినుంచి తప్పించుకునే దారులు అనేకం తన కండ్ల ముందే పరచుకుని ఉన్నవనీ నమ్మిన వ్యక్తి ఎంతటి నేరానికైనా సిద్ధపడతాడు. అది లైంగికదాడి అయినా, హత్య అయినా సునాయాసంగా పని ముగించేస్తాడు. ఈ దేశంలో జరుగుతున్న హత్యలు, ముఖ్యంగా లైంగికదాడుల విషయంలో ఇదే జరిగింది, ఇప్పుడూ జరుగుతోంది. ఉన్నావ్‌ సంఘటనలో అది మరింత ప్రస్ఫుటమయింది.
మహిళలపై లైంగికదాడుల విషయంలో ఉన్నావ్‌కు ఇప్పటికే ఓ కిరాతక చరిత్ర ఉంది. సాక్షాత్తూ అక్కడి అధికార బీజేపీ ఎమ్మెల్యేనే కులదీప్‌ సింగ్‌ సింగార్‌ ఒక యువతిపై దారుణంగా లైంగికదాడి చేసి యావత్‌ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఆ బాధితురాలిని హత మార్చేందుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీతో ఢకొీట్టించాడు. ఈ ఘటనలో బాధితురాలి సమీప బంధువుతో పాటు ఆమె లాయర్‌ కూడా మరణించారు. బాధితురాలు తీవ్ర గాయాలపాలై నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాల్ని దక్కించుకుంది. బాధితురాలి తండ్రిపై అక్రమ కేసు బనాయించి పోలీస్‌ లాకప్‌లోనే తన మనుషుల చేత చంపించాడు. ఇంత చేసినా ఇప్పటికీ శిక్షకు గురికాకుండా యథేచ్చగా తిరుగుతున్నాడు.
ఇప్పుడు ఈ దుర్మార్గులకు తమ ఎమ్మెల్యేనే ఆదర్శంగా నిలిచాడు. లైంగిక దాడి కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులు ఎలాగైనా బాధితురాలిని అంతమొందించి తాము శిక్షనుంచి తప్పించు కోవాలనుకున్నారు. గురువారం ఉదయం లైంగిక దాడి కేసు విచారణ నిమిత్తం రారుబరేలీ కోర్టుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన బాధితురాలిని లైంగికదాడి నిందితులతో కలిసి ఐదుగురు దుర్మార్గులు బలవంతంగా పొలాలలోకి లాక్కెళ్ళి పెట్రోలు పోసి తగలబెట్టారు. నిలువెల్లా తగలబడుతూ దాదాపు కిలోమీటరు దూరం తనను కాపాడమంటూ పరుగెత్తి కుప్పకూలిపోయింది ఆ ఆడబిడ్డ. ఇప్పుడు 90శాతం కాలిన గాయాలతో కొన ఊపిరితో ఆసుపత్రిలో ఉంది. మహిళలపై లైంగికదాడుల విషయంలో 'యోగి' ఆదిత్యనాథ్‌ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. కాషాయం ధరించి, గోమాతను పూజించి, భారతమాతను భుజాలకెత్తుకుని ఊరేగించే యోగుల ఏలిక రాష్ట్రంలో ఇలా ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చే మోడీ-షా సర్కారు కేంద్రంలో కొలువుదీరి ఉంది. ఇక కామాంధులకు, హంతకులకూ అడ్డేముంది? అదుపెక్కడుంటుందీ? చట్టం ఉన్నోడికి, బలమున్నోడికి, కులమున్నోడికీ చుట్టంగా మారిన వైనం మన చట్టసభలలోనే సాక్షాత్కరిస్తూ ఉంది. లైంగిక దాడుల నిందితులకు తమ పార్టీ టికెట్లు ఇచ్చి నానా అక్రమ మార్గాలలో వారిని చట్టసభల్లో కూర్చోబెడుతూ ఉన్న పార్టీలలో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. గత ఎన్నికలలో లైంగికదాడి నిందితులు బీజేపీ తరపున పోటీ చేసినవారు 15మంది. వారిలో 10మంది గెలుపొంది ఇప్పుడు పార్లమెంటులో కొలువుదీరి ఉన్నారు. అలాగే, దేశంలోని గత అయిదేండ్లలో పోటీ చేసిన లైంగికదాడుల నిందితులు బీజేపీకి చెందినవారు 49మంది. వారిలో 13మంది గెలుపొంది శాసనసభల్లో తిష్ట వేసుకుని ఉన్నారు. లైంగిక దాడులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయి. కుల, లింగ, ఆర్థిక బేధాలకు అతీతంగా మనుషుల మధ్య ఒక మానవీయ సంబంధం ముడిపడకుండా అవి అనుక్షణం అడ్డుకుంటున్నాయి. వ్యక్తులు చేస్తున్న నేరాలకు వ్యవస్థ ప్రేరణగా నిలుస్తున్నప్పుడు ఆ వ్యవస్థను మార్చకుండా నేరాలను ఆపడం అసాధ్యం. కాబట్టి, ఇప్పుడు జరగాల్సింది నేరస్తులను కఠినంగా, సత్వరంగా శిక్షించడంతోపాటు వ్యవస్థను మార్చుకునేందుకు అడుగులు వేయడం. ఆ అడుగులు ఎంత బలంగా పడుతున్నాయన్న దానిమీదే మన ఆడబిడ్డల భద్రత ఆధారపడి ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు
ఏలికలు ఎవరిపక్షం?
నంగనాచుల కాలంలో..!
వివేచన
వణుకెందుకు...?!
ట్రంప్‌ దారిలోనే బైడెన్‌..
సర్కార్‌ ప్రాథమ్యాలేమిటి?
కాంతిరేఖలు...

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.