Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గోరుచుట్టుపై రోకటి పోటు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 25,2020

గోరుచుట్టుపై రోకటి పోటు

గిరిజనుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు వారికి గోరు చుట్టుపై రోకటి పోటని చెప్పక తప్పదు. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని ఉపాధ్యాయ ఉద్యోగాలలో గిరిజనులకు 100శాతం రిజర్వేన్లు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 3ను ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చట్టవిరుద్ధ మంటూ కొట్టి వేయడం గిరిజనులకు తీరని వేదన కలిగిస్తోంది.
జీఓ 3 ప్రాథమిక పాఠశాలల ఉపాథ్యాయులకు సంబంధించినది. ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు స్థానిక గిరిజన తెగలకు చెందినవారైతే స్థానిక భాషలో చిన్నారులకు బోధింగలుగు తారని, భాష, సంస్కృతి, నివాసప్రాంతం ఒక్కటే కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో, విద్యార్థులు ఉపాధ్యాయులతో ఒకరినొకరు అల్లుకుపోయేందుకువీలై పసితనంలోనే మంచి భవిషత్‌కు పునాది పడుతుందనీ ప్రభుత్వం భావించి జీఓ 3ని తీసుకొచ్చింది. పాఠశాలల విద్యా ప్రమాణాలు గణనీయంగా వృద్ధి చెందుతాయనీ, గిరిజన పిల్లలు చిరుప్రాయంలోనే గిరిజనేతర సమాజంతో కలిసి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఉపయోగపడుతుందనీ ప్రభుత్వం ఆకాంక్షించింది. జీఓ 3 ఫలితాలను గిరిజనులు చవిచూస్తున్న స్థితిలో దానిని రద్దు చేయడం ఆదివాసీ సమాజానికి ఎంతో నష్టదాయకం. సుప్రీం కోర్టు ధర్మాసనం మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించరాదంటూ గతంలో తానిచ్చిన తీర్పును ఉదహరిస్తూ జీఓ 3 కొట్టివేసింది. షెడ్యూల్డు ప్రాంతానికి చెందిన, దేశంలోనే అత్యంత వెనుకబడిన గిరిజనులకు ఎంతో ఆలంబనగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వును కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆందోళనకరం.
షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో గిరిజనుల జీవనం ప్రత్యేకమైనది. వారికున్న వనరులు, అవకాశాలు, సదుపాయాలు మిగిలిన సమాజంతో పోల్చుకుంటే అత్యల్పం. కావునే, షెడ్యూల్డ్‌ ప్రాంత గిరిజనులు విద్యారంగంతో పాటు మిగిలిన అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయారు. గిరిజనేతర ప్రాంతాలలోని సాటి రిజర్వేషన్‌ వర్గీయులతో సైతం పోటీ పడలేని దుస్థితి వారిది. తరతరా నుంచి పట్టిపీడిస్తూ ఉన్న అవిద్య కారణంగా సమకాలీన సమాజంతో కలిసి సమానంగా ముందుకు నడవలేక పోతున్నారు. ఈనేపథ్యంలో, షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని గిరిజనులకు ప్రత్యేక రక్షణ చట్టాలు, రిజర్వేషన్‌ సదుపాయాలు అవసరమన్న ఆందోళనలు ఊపందుకున్నాయి. ఈ విషయమై గిరిజన సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు సాగించిన ఉద్యమాల ఫలితంగా 1/70 చట్టం, జీఓ 3 లాంటి ఆదివాసీ అనుకూల చట్టాలను, జీఓలను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూములు, ఇతర ఆస్తులను సంపాదించడం నిషిద్దం. అయినా, అదివాసీల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని అడ్డంపెట్టుకుని, మరి కొందరిని బెదిరించి లొంగదీసుకుని ఆ గిరిజనుల పేరుతోనే ఉన్న భూములను తాము అనుభవిస్తున్నారు. చట్టవ్యతిరేకంగా ఎజెన్సీ భూములలో పాతుకుపోయారు. కేవలం ఆదివాసీలకు చెందాల్సిన భూములు, ఆస్తులను కాజేయడం కోసమే ఆదివాసీ మహిళలను వివాహమాడి తమ అవసరం తీరిన అనంతరం వారిని దారుణంగా మోసగించారు. అక్రమంగా ఏజెన్సీలోకి జొరబడిన గిరిజనేతర భూస్వాములు, కాంట్రాక్టర్లు, షావుకార్లూ అక్కడి కాంట్రాక్టులు సొంతం చేసుకుని, వ్యాపారాలు చేజిక్కించుకుని, భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలను సాగించి గిరిజనులను అన్నివిదాలుగా దోచుకుతింటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 3 గిరిజనులకు ఎంతో ఉపయోగపడింది. జీఓ 3 ద్వారా షెడ్యూల్డు ప్రాంతంలోని స్థానిక విద్యావంతులు ఉపాధ్యాయ ఉద్యోగాలను సొంతం చేసుకుని లక్షలాది తమ ఏజెన్సీ ప్రాంత చిన్నారులకు అనువైన రీతిలో విద్యాబుద్ధులు నేర్పగలుగుతున్నారు. జీఓ 3 కేవలం కొన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది లక్షలాది భావి పౌరుల బతుకు సమస్య. ఆత్మన్యూనతా భావం ముసురుకున్న గిరిజన చిన్నారులు ఆత్మవిశ్వాసంతో ఎదిగేందుకు అవకాశం కల్పించే ప్రక్రియ. తమకన్నా ఎన్నో రెట్లు పెద్దదైన మైదాన సమాజాన్ని ఎలాంటి జంకూబొంకూ లేకుండా హత్తుకుని, దానితో సమానంగా అడుగులు ముందుకు వేసేందుకు అందివచ్చిన అవకాశం. మొత్తం షెడ్యూల్డు ప్రాంతానికి చెందిన ఆదివాసీల ఎదుగుదలను సృష్టిలో పెట్టుకుని ఆలోచించినపుడు జీఓ 3 కొనసాగడం అనివార్యం. అయినా సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించకపోవడం విచారకరం.
అణగారిన కులాలకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు ఇప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదు. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికైనా పాలకులు మానవీయ కోణంలో స్పందించాలి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి. ఈ తీర్పు అమలు జరగకుండా స్టే ఆర్డర్‌ పొందేలా రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు
ఏలికలు ఎవరిపక్షం?
నంగనాచుల కాలంలో..!
వివేచన
వణుకెందుకు...?!
ట్రంప్‌ దారిలోనే బైడెన్‌..
సర్కార్‌ ప్రాథమ్యాలేమిటి?
కాంతిరేఖలు...
అంత జిద్దెందుకు?
చదువు-రాత
'టీకా' తాత్పర్యం

తాజా వార్తలు

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.