Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆపత్తుని కూడా అవకాశంగా..! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 06,2020

ఆపత్తుని కూడా అవకాశంగా..!

వలస కార్మికులది మళ్ళీ తమ పనులు తమకు దొరుకుతాయో లేదో తెలియక ఆందోళన. చేతికొచ్చే రబీ పంట నోటికందుతుందో లేదో తెలియక రైతుల ఆందోళన. ఇన్ని బాధల్లో జనముంటే ఈ రిలయెన్స్‌ లేమిటి? సెల్ఫ్‌ రిలయెన్స్‌ లేమిటి?
ధర ఖర్వాటుండొక్కడు
సూర్యకర సంతప్త ప్రధానాంగుడై..
బట్టతలకలవాడు ఎండకి సూర్య కిరణాలను తప్పించుకోడానికి తాటిచెట్టు కింద నిలబడితే సదరు వ్యక్తి నెత్తిన తాటికాయపడి నెత్తి పగలడమే ప్రారబ్ధమంటాడు భర్తృహరి సుభాషితాల్లో! ఆ వ్యక్తి పోగేసుకున్న (సంచిత) కర్మల ఫలితమని, ఫలమనేది ధర్మఘోష!
చిన్న పిల్లల్ని మినహాయిస్తే నూటికి తొంభైమందికి పైగా భారతీయులు కష్టజీవులు. వారిలో 11కోట్ల మంది వలస కార్మికులు. నేడు వీరందరి బతుకులు అస్తవ్యస్త మవుతున్నాయి. ముఖ్యంగా వలస కార్మికుల బతుకులు చిన్నా భిన్నమైనాయి. ఇదంతా తమ సంచిత కర్మల ఫలితమని వారంతా భావిస్తున్నంత కాలం పెట్టుబడిపాలన సుస్థిరంగా, సువ్యస్థితంగా కొనసాగుతూనే ఉంటుంది.
''నేడు కోట్లాది కష్టజీవుల జీవితాలు ఆకలి మంటల నడుమ నిలబడ్డ తీరును మున్నెన్నడూ ఎరుగం. ఈ దౌర్భాగ్యపు భూగోళానికి చెంది ఉండటం తప్ప వారి పొరపాటేమీలేదు'' అన్నారు జానకీ నాయర్‌. వైవిధ్యభరితమైన మరో వైరుధ్యాన్ని చూడండి. తాము కారణం కాకపోయినా, తమ కారణం లేకపోయినా కోట్లాది మందికి నేడు ఉపాధి పోయింది. వలస కార్మికుల నోటికాడి బువ్వ లాగేయబడింది. ప్రస్తుత కారణం కరోనా! మరి వీరందరికీ తిండిపెట్టే బాధ్యతెవరిది? ఆ బాధ్యతను యజమానుల నెత్తికి నెట్టేసింది మోడీ సర్కార్‌. స్ట్రాండెడ్‌ వర్కర్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (స్వాన్‌) అనే స్వచ్ఛంద సంస్థ 86శాతం మంది కార్మికులకు యజమానులు వేతనాలివ్వలేదని తేల్చింది. లాక్‌డౌన్‌ లేకుంటే వీరు ఎవరి బతుకు వాళ్ళు బతికుండేవారు. వీరంతా రోడ్లపైకొచ్చి ''ఆకలి మంటల మలమలలాడే అనాథులందరు లేవండోరు!'' అని అంతర్జాతీయ గీతాన్ని ఈ ఆకలితో అలమటించేశారు. పాడుకోగలరా? ఈ వైరుధ్యానికి పరిష్కారం వేదాంతంలో లేదు. ఆర్థిక వ్యవస్థలో ఉంది.
దేశవ్యాపిత లాక్‌డౌన్‌ ప్రకటించేముందు రాష్ట్రాలతో మోడీ చర్చించారా? కనీసం తన మంత్రివర్గంలోనైనా వివరాలు చర్చించారా? దేశంలో వలస కార్మికులెందరున్నారో, కనీసం దేశ రాజధానిలో ఎందరున్నారో లెక్కలు తీసుకున్నారా? వానాకాలం వచ్చేముందు తిండిని మూపున కట్టుకుని తమ పుట్టల్లోకి ప్రయాణించే చలిచీమల్లాగా బిడ్డల్ని, సరుకు, సరంజామాని బుజాల కెత్తుకుని బారులు తీరిన వలస కూలీలు వందల మైళ్ళు ప్రయాణించి గమ్యస్థానాలు చేరుకున్నారు. ఊళ్ళు చేరిన వీరందరిన్నీ పోషించే మహారాజ పోషకులెవరున్నారు? వీరికి పోషణ ఉపాధి హామీ చట్టమేనన్న విషయం మోడీ ప్రభుత్వం ఆలోచించిందా?
కీలకమైన ఉపాధి హామీ చట్టం (రేగా) అమలు పరిస్థితి చూస్తే అత్యంత ఘోరంగా అఘోరించింది. 2019 ఏప్రిల్‌లో దేశంలో 1.7కోట్ల ఇండ్లకి రేగా ద్వారా పని ఇస్తే 2020 ఏప్రిల్‌లో 34లక్షల ఇండ్లకు ఇచ్చారు. అంటే 86శాతం తగ్గుదల. ఇది 2013 నుంచి ఏ నెలకైనా అత్యంత తక్కువ. ఈ 34లక్షల్లో 20 లక్షలు కేవలం ఏపీ, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలే! దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 34కు గాను 19లో మాత్రమే పదివేల కంటే ఎక్కువ ఇండ్లకు ఉపాధి హామీ పనులిచ్చారు. మన ఘనత వహించిన కేసీఆర్‌ రాజ్యంలో ఎన్ని ఇండ్లకిచ్చామనే లెక్కే మెయింట్‌యిన్‌ చేయలేదు.
2014-15 నుంచి మోడీ సర్కార్‌ ఉపాధి హమీ చట్టానికి కోతలు పెడుతూనే ఉంది. తాజా బడ్జెట్‌లో అంతకుముందు బడ్జెట్‌ రివైజ్డ్‌ అంచనాలకంటే 13శాతం కోత విధించారు. దాని ఫలితమే పైలెక్కలు. మరి ఇన్ని కోట్ల మంది వారి వారి గ్రామాలకు తిరిగి వెళ్ళిన తర్వాత వారి పోషణ ఎలా? విపత్తుని కూడ పెట్టుబడిదారులు ఎలా వాడుకుంటున్నారో చూస్తే జుగుప్సాకరంగా ఉంటుంది. పెట్టుబడితో ప్రత్యక్షంగా సాగిన పోరులో మే నెలకున్న ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. పని గంటల తగ్గింపుతో ప్రారంభమైన పోరాటం అనేక హక్కుల సాధన దిశగాసాగింది. మేనెల్లోనే 10/12 గంటల పని దినం చర్చ దేశంలో జరగడం యాధృచ్ఛికమే అయినా అది ఒక నిజం. హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి వేదాల్ని పాతాళంలో పడేసే ప్రయత్నం చేస్తే వరాహావతారంలో విష్ణువు వచ్చి దాన్ని కాపాడుకున్నాడని పురాణ కథ. పురాణం ఎలా ఉన్నా, కార్మిక చట్టాల న్నింటిని 4 కోడ్‌లుగా మార్చివేసే అభినవ హిరణ్యాక్షుల్ని కార్మికో ద్యమం వరహాలుగా మారి కడతేర్చే సమయమాసన్నమైంది.
అమెరికా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి 2లక్షల కోట్ల డాలర్లు, జపాన్‌ 1.9లక్షల కోట్ల డాలర్లు ప్రకటిస్తే మనదేశం మన జీడీపీలో 0.81శాతం ప్రకటించింది. పనిలోపనిగా అస్మదీయులు బాబారాందేవ్‌, మోహుల్‌ చోక్సీ, అదానీ లాంటివారి బ్యాంకు బకాయిలు 63వేలకోట్లు రద్దు చేసింది మోడీ సర్కార్‌.
తమ జీవితాలేమవుతాయా అని కష్టజీవుల ఆవేదన, ఆందోళన! ముందు మోడీ, ఆ వెంటనే ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌భగవత్‌ ఇద్దరి ఉపన్యాసాల్లోనూ సెల్ఫ్‌ రిలయెన్స్‌ (ఆర్థిక స్వావలంబన) గురించి మాట్లాడిన ఉద్దేశమేమిటో..! అంతా 'రిలయన్స్‌' మయం అవుతున్న నేపథ్యంలో ''సెల్ఫ్‌ రిలయెన్స్‌'' ఏమిటి? ఉద్యోగులు తమ జీతాల్లో పెట్టిన భారీకోతల గురించి ఆందోళన పడుతున్నారు. ఫ్యాక్టరీ కార్మికులు కార్మిక చట్టాల సవరణల గురించి ఆందోళన పడుతున్నారు. కొరియర్‌ బార్సు, జమాటో, స్విగ్గీలు తమ బతుకెలా వెళ్ళదీస్తుందో అర్థం కాక ఆందోళనలో ఉన్నారు. వలస కార్మికులది మళ్ళీ తమ పనులు తమకు దొరుకుతాయో లేదో తెలియక ఆందోళన. చేతికొచ్చే రబీ పంట నోటికందుతుందో లేదో తెలియక రైతుల ఆందోళన. ఇన్ని బాధల్లో జనముంటే ఈ రిలయెన్స్‌ లేమిటి? సెల్ఫ్‌ రిలయెన్స్‌ లేమిటి?

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం
బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?
వాట్సాప్‌ వర్రీ!
ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు

తాజా వార్తలు

05:24 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రామ్ చరణ్ భార్య

05:09 PM

బెడ్లు ఖాళీ లేవని కరోనా పేషెంట్లను చంపిన డాక్టర్‌..!

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.