Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మౌలిక వసతులేవి..? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 21,2020

మౌలిక వసతులేవి..?

పంటల మార్పిడి విజయవంతం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు ఊపిరిలూదాలి. భూసార పరీక్షలు చేసి నీటి లభ్యతనుబట్టి పంటలేయడం, మార్కెట్‌ కమిటీల ద్వారా సర్కారే విత్తనాలు సరఫరా చేయడం, రైతులకు విరివిగా రుణాల్విడం, రెండో పంట ఏం సాగుచేయాలో ముందే చెప్పడంతోపాటు కనీస మద్దతు ధరనూ అమలుచేసేలా బాధ్యత వహించాలి.

వ్యవసాయం పండుగ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నది. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామనీ, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం ఇప్పటికే ఖరాఖండీగా చేప్పేశారు. పంటల విధానం మారాలనీ, తోచిన పంటలేస్తే రైతుబంధు, రుణమాఫీ బంద్‌చేస్తామని ఒకింత బెదిరింపుధోరణిలోనే సీఎం అల్టీమేటమిచ్చారు. వరి పంటను తగ్గించి వాణిజ్య పంటలవైపు దృష్టి పెట్టాలనేది సర్కారు సూచన. వాస్తవానికి ప్రభుత్వాలు ఇలా చెప్పడం కొత్తేమి కాదు. గతం నుంచే ఈ ప్రయాస జరుగుతున్నది. రైతుల విషయంలో సుద్దులు చెప్పడం, ఆ తర్వాత విస్మరించడం ప్రభుత్వాలకు పరిపాటైంది. అవసరమైన ఆర్థిక సహకారం అంతంతే కావడంతో సాగు యేటేటా నిర్వీర్యమవుతున్నది. నిజమే.. పంటల సాగు విధానం మారాల్సిందే. సాధారణ పద్ధతిలో రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. అప్పుల్జేసి పంట చేతికొచ్చేసరికి వాతావరణ పరిస్థితులు అనుకూలించక, గిట్టుబాటు ధర రాక విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు. మౌలిక వసతులు కల్పించకుండా ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రణాళికలేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ దుస్థితి నుంచి రైతులకు మేలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ముఖ్యమంత్రి చెప్పినంత సులభంగా వ్యవస్థలో ఒకేసారి మార్పు రాకపోవచ్చు. చిత్తశుద్ధి, అకుంఠిత దీక్షతోకూడిన ప్రణాళికబద్ధమైన కృషితోనే సాధ్యం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా తాము చెప్పిన పంటలనే సర్కారు సాగుచేయాలనడం కూడా భావ్యం కాదు. దాదాపు 70 ఏండ్లుగా నా భూమి నా ఇష్టం అనేరీతితో వ్యవసాయం నడుస్తున్నది. ఇప్పుడున్న ఈ విధానానికి చరమగీతం పాడాల్సిందే. ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు మద్ధతు ధర రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో రాజకీయ సంకల్పం కావాలి. శాసనవ్యవస్థ ప్రొత్సాహాం ఇంకా పెరగాలి. ఈ తరుణంలో ఆ మార్పు శాస్త్రీయంగా జరగాలని రైతు సంఘాలు, మేధావులు కోరుకుంటున్నారు. అదే నేపథ్యంలో భారీ యజ్ఞమే చేయాల్సి ఉంటుంది. అధికారులు, శాస్త్రవేత్తలతో కొంతమేర సర్కారు చర్చిస్తున్నది. కానీ, రైతు సంఘాలు, ఆయా రాజకీయ పక్షాలను మాత్రం విస్మరిస్తున్నది. వీరితో చర్చిస్తేనే సంపూర్ణ సరికొత్త వ్యవసాయ విధానం ఆవిష్కృతమవుతుంది. అప్పుడే అనుకున్న ఫలితాలొస్తాయి. తొలుత వ్యవసాయశాఖను ప్రక్షాళన చేయడం. అవసరమైన పోస్టులను భర్తీ చేసి రైతులకు సలహాలు, సూచనలు విరివిగా అందేలా చూడటం, ప్రతియేటా భూసారపరీక్షలు నిర్వహించడం, ప్రత్యేకంగా కార్డులు జారీచేయడం అత్యంత కీలకం. రాష్ట్రంలో 4000 ఎఈవోల పోస్టులను భర్తీచేయడం, ప్రతి మండల కేంద్రంలో ఒక భూసార పరీక్షా కేంద్రం నెలకొల్పడం, అంతేగాక భూములను విభజించి పంటలను ఎంపిక చేయాలనే సూచనలు సంఘాల నుంచి వస్తున్నాయి. పామాయిల్‌కు కేంద్రం నుంచే 90 శాతం సబ్సీడీలొస్తున్నా, వినియోగించుకోలేక ఏడాదికి రూ. 10 నుంచి 20 కోట్ల మేర నష్టపోతున్నాం. చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించడం ద్వారా ఆ పంటను మరింతగా ప్రొత్సహించడం, అలవికానిచోట అధికులమనరాదన్నట్టుగా భూసారం లేనిచోట పత్తిని ప్రొత్సహించరాదు. మొక్కజొన్న ద్వారా బయోడిజీల్‌, బిస్కెట్లూ ఉత్పత్తవుతాయి. సోయాబిన్‌ తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంట. విత్తనాలు పండించే రైతులకు ఆదాయం అధికంగానే ఉంటుంది. కూరగాయలు, ముతక, పప్పుధాన్యాలతోపాటు ఇతరాల విత్తనాలను ఇప్పటికే రాష్ట్రం నుంచి రష్యా, ఈజిప్టు, టర్కీ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. నకిలీ, కల్తీ ఎరువులు, క్రిమిసంహారకాల కారణంగా యేటా మూడు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంటలను కోల్పోతున్నాం. బీటీ విత్తనాలతోనే ఈ నష్టమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. అమాయకులు, నిరక్షరాస్యులైన రైతులను ప్రయివేటు విత్తన కంపెనీలు మోసం చేస్తున్నాయి. పంటల మార్పిడి విజయవంతం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు ఊపిరిలూదాలి. భూసార పరీక్షలు చేసి నీటి లభ్యతనుబట్టి పంటలేయడం, మార్కెట్‌ కమిటీల ద్వారా సర్కారే విత్తనాలు సరఫరా చేయడం, రైతులకు విరివిగా రుణాల్విడం, రెండో పంట ఏం సాగుచేయాలో ముందే చెప్పడంతోపాటు కనీస మద్దతు ధరనూ అమలుచేసేలా బాధ్యత వహించాలి. నిజాం కాలం నుంచే కౌలురైతులున్నారు. 12 లక్షల మందిగా ఉన్న వీరిని, వాస్తవసాగుదార్లుగా గుర్తించి ఆదుకోవాలి. అక్కరకురాని చుట్టమెందుకన్నట్టు, ఇప్పుడున్న వ్యవసాయ ప్రణాళికలు ఎందుకు పనికిరాని గుళికలేననే సంగతిని సర్కార్‌ గుర్తించాలి. గత ఏడాది రుణ ప్రణాళికలో రూ. 48 వేల కోట్లు ఇస్తామనీ చెప్పి, కేవలం రూ. 22 వేల కోట్లు మాత్రమే విదిల్చారు. 60 లక్షల మందికి అందాల్సిన రుణాలు, 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఈ దిశగా పూర్తిస్థాయిలో సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించాలి. అందరితో సంప్రదింపులు చేశాకే నూతన వ్యవసాయ విధానాన్ని ఖరారు చేయాలనే సలహాలు, సూచనలు రైతు సంఘాల నుంచి వస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?
వాట్సాప్‌ వర్రీ!
ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు
ఏలికలు ఎవరిపక్షం?
నంగనాచుల కాలంలో..!
వివేచన
వణుకెందుకు...?!

తాజా వార్తలు

09:21 AM

విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది

09:02 AM

రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు

08:47 AM

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు..

08:28 AM

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్‌చల్

08:03 AM

కిలిమంజారోను అధిరోహించిన తెలంగాణ యువతి

07:57 AM

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం

07:49 AM

టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

07:46 AM

నేడు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

07:44 AM

నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్..ఉదోగ్యు‌ల‌ నుంచి..!

07:27 AM

ప్రేమోన్మాది దారుణం..కత్తితో యువతి చేతి వేళ్లు తెగిపోయేంత..!

07:03 AM

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

07:01 AM

రష్మిక మందన్నకు భారీ షాక్...

06:54 AM

ఢిల్లీ‌లో ఘోర అగ్ని‌ప్ర‌మాదం

06:45 AM

కుక్క‌ల‌ను త‌ప్పించ‌బోయి చెట్ల‌లోకి దూసుకెళ్లి‌న కారు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

06:32 PM

కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.