Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్
కరోనా కు మందు అంటూ ఒక వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మూడవ పోలీస్స్టేషన్ ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్ నగరంలోని ఆదర్శ నగర్ కు చెందిన వృద్ధురాలు బిచ్కుంద కు పని నిమిత్తం బస్సులో వెళ్ళింది అయితే బస్సులో ఒక మహిళ వృద్ధురాలిని పరిచయం చేసుకొని తననుండి ఫోన్ నెంబర్ తీసుకుని నమ్మించి కరోనా వ్యాక్సిన్ అని మందు ఇచ్చింది.మందు సేవించిన ఆ వృద్ధురాలు పడిపోవడంతో ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లింది అయితే వృద్ధురాలు ఇంటికి వెళ్ళిన అనంతరం మెడలో చూసుకోగా ఒంటిపై బంగారు నగలు లేకపోవడంతో మూడవ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే వృద్ధురాలు దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ మహిళ ను మూడవ పోలీస్స్టేషన్ ఎస్ఐ సంతోష్ కుమార్ తన సిబ్బందితో అరెస్టు చేశారు. అపహరించిన మూడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలిని మోసం చేసిన మహిళ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మూడవ పోలీస్స్టేషన్ ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు.