Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు స్వరాష్ట్రంలోనే యోగి అదిత్యనాథ్ సర్కార్ మోకాలడ్డింది. అఖిలేష్ యాదవ్ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తుండగా లక్నో ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థుల సమావేశానికి అఖిలేష్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయనను అక్కడికి వెళ్లకుండా యూపీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు.