Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: అక్రెడిటేషన్ల కోసం ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ ధరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి ఒక ప్రటకన విడుదల చేశారు. రెండు సంవత్సరాల పాటు జారీ చేసే అక్రెడిటేషన్ల కొరకు ఈ నెల 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.ipr.ap.gov.in వెబ్ సైట్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌లోడ్ చేసి, ఆ కాపీ ప్రింట్‌ను తీసుకుని సంబంధిత పత్రాలను జతచేసి సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులకు అందివ్వాలని ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులు విజయవాడలోని సమాచార, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో, జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు సంబంధిత సమాచార, పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్/అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.