Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాన్ని మంగళవారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి పోలీసులు సీజ్ చేశారు. త్రిపురారం మండల పరిధిలోని పెద్దదేవులపల్లి గ్రామం వద్ద మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావు, మాడ్గులపల్లి ఎస్‌ఐ నాగరాజుతో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. త్రిపురారంలోని మోడల్ స్కూల్, మరో ప్రైవేటు స్కూల్ విద్యార్థులను టాటాఏస్ వాహనంలో పరిమితికి మంచి కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా పట్టుకొని దానిని సీజ్ చేశారు. అనంతరం పోలీస్ వాహనంలో విద్యార్థులను గమ్యస్థానానికి చేర్చారు. ఈ సందర్బంగా డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.