Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు: పీలేరు మండలం యనమలవారి పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయితీ వేరుశెనగ విత్తనాల కోసం అధికార పార్టీ నేతలు కత్తులు దూసుకున్నారు. విత్తన కాయలు తమకే కావాలంటూ అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై మరొకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తొలుత శ్రీరాములు రాజుపై జయచంద్రారెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటనతో జయచంద్రారెడ్డిపై శ్రీరాములు రాజు దాడి చేశాడు. దీంతో ఇద్దరికీ తలపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.