Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
హైదరాబాద్‌లోని బేగంపేట్ ఫ్లయ్ ఓవర్‌పై సోమవారం తెల్లవారు జామున ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. లారీ ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లారీ అక్కడే ఉండటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తర్వాత దానిని తొలగించేందుకు భారీ క్రేన్‌ను పోలీసులు రప్పించారు.