Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 305 సెంటర్లు, 63 లక్షల మంది స్టూడెంట్లు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని యూజీ 2, 4, 6 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ నేటి నంఉచి నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓయూ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొ. నాయుడు అశోక్, జాయింట్ డెరైక్టర్ డా.ఎవి.రాజశేఖర్ లు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, జిల్లాల పరిధిలో 305 సెంటర్లలో మొత్తం ఒక లక్ష 63 వేల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ రాయనున్నారు. 23 రూట్లలో 85 మంది రూట్ ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు. ఎగ్జామ్స్ సందర్భంగా కొవిడ్ రూల్స్ పాటించాలని అధికారులు సూచించారు.
28,30 తేదీల్లో పీహెచ్‌డీ ఎగ్జామ్స్
ఓయూ ప్రీ పీహెచ్‌డీ ఎగ్జామ్స్ ఈనెల 28, 30 తేదీల్లో ఓయూ కేంద్రంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 51 సబ్జెక్టులలో సుమారు 2 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటాయి. 28న రీసెర్చ్ మెథడాలజీ 30న, స్పెషలైజేషన్ పరీక్ష ఉంటాయి.