Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అనుమతులేని, వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాల్ని నిలిపివేయించండి.. అంటూ మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారిని పద్మజా రాణికి ఫిర్యాదు చేశామని నాగారం మున్సిపల్ చెర్మెన్ చంద్రా రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని కీసర రెవెన్యూ లో సర్వే నంబర్ 301 లో భూమిని కొనుగోలు చేశామని, ఆ భూమిలో కొందరు అక్రమార్కులు కబ్జాకు ప్రయత్నించారని తెలిపారు. వారి పై ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మల్కాజిగిరి కోర్టులో కేసు వేయడం జరిగిందని, దానికి సంబంధించి కోర్ట్ తీర్పు పూర్తయ్యే వరకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారని,ఆ భూమి పై కోర్టులో కేసు కొనసాగుతుందని చెప్పారు. ఈ మధ్య కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోర్టులో కేసు నడుస్తుండగా స్థానిక పంచాయతీ అండ దండలతో అక్రమ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అధికారులు అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని ప్రజాస్వామ్యంలో చట్టాల ను సక్రమంగా అమలు చేసి న్యాయ స్థానాల తీర్పు లకు గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.