Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీ నగర్
కేంద్రం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసర నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఎల్బీనగర్ లేబర్ అడ్డా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు, కార్మికులు కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో రైతులకు గిట్టుబాటు ధరలు రాక, పండిన పంటలను బ్లాక్ మార్కెట్‌కు తరలించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కొత్త చట్టాలతో కార్పొరేట్ శక్తులే లాభపడుతాయని తెలిపారు. ప్రజలు, రైతులు, కార్మికులను మోసం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఆచర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న రైతు కార్మిక చైతన్య యాత్రలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు లక్ష్మణ్, సీ మన్యం, నరసింహ రాజు, కే శాంతమ్మ, సుధాకర్, హనుమంతు, కుర్మయ్య పాల్గొన్నారు.