Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా కరోన టీకాను తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోయిన్పల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ సెంటర్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. బోయిన్‌పల్లి పీహెచ్‌సీ డాక్టర్ లావణ్యకు మొదటగా వాక్సిన్ ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని, ప్రతీ ఒక్కరు కరోనా టీకా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయినపల్లి, పికెట్, తిరుమలగిరి ప్రాంతాల్లో కరోనా వాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలంతా అపోహలు లేకుండా వాక్సిన్ తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో బోర్డు సీఈవో అజిత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సభ్యులు భాగ్యశ్రీ, నల్లకిరణ్, మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.