Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల్లో రెండు ఐసోలేషన్ గదులు, మెడికల్ అండ్ హైజీన్ టీమ్‌లు
- అస్వస్థతకు గురైతే పీపీఈ కిట్‌తో పీహెచ్‌సీకి తీసుకెళ్లాలి
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ శ్వేతా మహంతి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా విద్యాశాఖ అధికారి, అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 9, 10 వ తరగతుల విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపిరు. అన్ని పాఠశాలల్లో ముందస్తుగా పూర్తి స్థాయిలో అంతటా శానిటైజేషన్ చేయాలని సూచించారు. స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. స్కూల్లోని ప్రతీ తరగతిలో 20 మంది విద్యార్థులు మాత్రమే వచ్చేలా చూడాలని, బెంచీకి ఒకరిని మాత్రమే కూర్చబెట్టాలన్నారు. మెడికల్ అండ్ హైజీన్ టీమ్‌లను ప్రతీ పాఠశాల ఆవరణలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయివేట్ పాఠశాలల్లో కేవలం 9, 10వ తరగతులు మాత్రమే నిర్వహించేలా యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటుచేయాలన్నారు. అధికారులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు, శానిటైజర్లు, చేతుల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. దీనికి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, ఛైర్మెన్లు ప్రత్యేక దష్టిసారించాలని కోరారు.
ప్రతి పాఠశాలలో రెండు ఐసోలేషన్ గదులు
జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి పర్మిషన్ తీసుకోవడంతో పాటు పాఠశాలల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల హెల్త్ కండీషన్ ఎప్పకటిప్పుడు తెలుసుకోవాలన్నారు. ప్రతీ పాఠశాలలో రెండు ఐసోలేషన్ గదులు, రెండు పీపీఈ కిట్స్, రెండు బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వసతి గహాలలో ఉండే విద్యార్థులకు ప్రతీ ఒక్కరికి విడివిడిగా సబ్బు, బెడ్‌షీట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీచోట కోవిడ్ 19కు సంబంధించి వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి, డీపీఓ పద్మజారాణి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జాన్సి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి షత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.