Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ యువకుడు మతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్గిరికి చెందిన ఖాజా మొయినుద్దీన్(21) ఎల్బీనగర్-ఉప్పల్ హెచ్‌ఎండీఏ భవనంలో వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడడంతో ఖాజా మొయినుద్దీన్ అక్కడికక్కడే మతి చెందాడు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.