Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదని, గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, సిబ్బంది స్వచ్ఛందంగా టీకాలు తీసుకోవాలని ఎస్‌పీహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కామాటి పుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కరోనా టీకాను వేయించుకోవడంలో హెల్త్ వర్కర్లు, ఆశాలు ముందుండాలని తెలిపారు. తారా మైదాన్ ఆశా వర్కర్ రజితకు, హాస్పిటల్‌లో ఏఎన్‌ఎంలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ టీకాను అందించారు. ఈ కార్యక్రమంలో కామాటిపుర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సయ్యద్ మునవ్వర్ అలీ, ఏఎన్‌ఎం షమీమ్ తదితరులు పాల్గొన్నారు.