Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- 33వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వేగ నియంత్రణతో ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని, రోడ్డు భద్రత నిత్యజీవితంలో ఒక భాగం కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 32వ జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఖైౖరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన రహదారి భద్రతకు సంబంధించిన బ్యానర్లు, స్టిక్కర్లు, రోడ్డు నిబంధనల కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. అనంతరం డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్) కె.పాపారావు అధ్వర్యంలో తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ డైరీ-2021, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైౖతన్యపర్చేందుకు ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా రోడ్డు భద్రత సూచనల్ని, నిబంధనల్ని పాటిచాలని, అప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోవడంతో పాటు మద్యం సేవించి వాహనాలను నడపొద్దని, చిన్నచిన్న తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మరవకూడదని అన్నారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా 'గిఫ్ట్ ఎ స్మైల్' కింద ప్రతినిధులు 100 అంబులెన్స్‌లను ప్రభుత్వానికి సమకూర్చారమని తెలిపారు. ప్రయివేటు వాహనాలు, లారీలు, టాక్సీలు, ఇతరత్ర వాహనాల డ్రైవర్లకు మెరుగౖెెన శిక్షణ ఇచ్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూల్ త్వరలో సిరిసిల్లలో అందుబాటులోకి రానున్నదని తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా సురక్ష్షిత డ్రైవింగ్ కోసం ఇస్తున్న శిక్ష్షణ మంచి ఫలితాలు వస్తున్నాయని, జాతీయ స్థాయిలోనే సంస్థకు అవార్డులు దక్కడం మంచి పరిణామని అన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ కార్యాలయంలో బైక్ ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు, జేటీసీలు జి. మమతా ప్రసాద్, జె.పాండు రంగా నాయక్, డీటీసీలు కె.పాపారావు, ఎం. ప్రవీణ్ రావు, పుప్పాల శ్రీనివాస్, మేడ్చల్ డీటీవో ఎం.కిషన్, ఆర్టీవోలు జి.సురేష్ రెడ్డి, ఎల్. రాంచందర్, పి.దుర్గప్రసాద్, వి.శ్రీనివాస్ రెడ్డి, సి.పి.వెంకటేశ్వర్ రావు, వి.సుభాష్‌చంద్రా రెడ్డి, జి.సదానందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు, జేటీసీలు జి. మమతా ప్రసాద్, జె.పాండు రంగా నాయక్, డీటీసీలు కె.పాపారావు, ఎం. ప్రవీణ్ రావు, పుప్పాల శ్రీనివాస్, మేడ్చల్ డీటీవో ఎం.కిషన్, ఆర్టీవోలు జి.సురేష్ రెడ్డి, ఎల్. రాంచందర్, పి.దుర్గప్రసాద్, వి.శ్రీనివాస్ రెడ్డి, సి.పి. వెంకటేశ్వర్ రావు, వి.సుభాష్‌చంద్రా రెడ్డి, జి.సదానందం, జైచందర్, ఎంవీఐలు రవి, సాయికృష్ణ, శ్రీనుబాబు, పర్వీందర్ రాజు, సురేష్ రెడ్డి, సి.వాసు, ఏఎంవీఐ శశిధర్ రెడ్డి, గ్రేటర్ పరిధిలోని ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ స్కూల్
ప్రయివేటు వాహనాలు, లారీలు, టాక్సీలు, ఇతరత్ర వాహనాల డ్రైవర్లకు మెరుగౖెెన శిక్షణ ఇచ్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూల్ త్వరలో సిరిసిల్లలో అందుబాటులోకి రానున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర, ఇతర రాష్ట్రాలలోని డ్రైవర్లకు డ్రైవింగ్‌లో మెళకువలు చెప్పడంతో పాటు రోడ్డు భద్రతా ప్రమాణాలపై తగిన తర్ఫీదు ఇవ్వనున్నట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖల సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది, అధికారులతో రోడ్డు భద్రత ప్రమాణాన్ని చేయించారు. సడక్ సురక్ష, జీవన్ రక్ష అనే పద్థతిని అవలంభిస్తూ జాగ్రత్తగా వాహనాలను నడపాలని, ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని కోరారు.