Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులకు గురవుతున్నకాలనీవాసులు
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా డివిజన్లోని సాకేత్ కాలనీ సమీపంలో విచ్చల విడిగా అక్రమ లేఅవుట్ల ఏర్పాటు వల్ల కాలనీల్లో మురుగు నీరు, రోడ్లతో ఇబ్బందులకు గురవుతు న్నామని సాకేత్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీఐ రెడ్డి, రాజేశ్వరరావు తెలిపారు. వారు మాట్లాడుతూ 120 ఎకరాలు నిర్మించడం జరిగిందని అందుకను గుణంగా డ్రైనేజీ రోడ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. కాలనీ 20 సంవత్సరాలు ఏర్పడిందని ప్రస్తుతం జీహెచ్‌్‌ఎంసీలోనే ఆదర్శ కాలనీ ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సాకేత్ సమీపంలోని ఖాళీ స్థలంలో జిహెచ ఎంసి నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేరని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాలనీలో డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా తమ కాలంలోకి వదులుతు న్నారు అని వారు పేర్కొన్నారు. సాకేత్‌లో నరసింహా రావు అనే వ్యక్తి అక్రమంగా 51 ఫ్లాట్‌లను ఏర్పాటు చేశారని తెలిపారు ఇందుకు సంబంధించిన డ్రైనేజ్ ని ఏర్పాటు చేయకుండా కాలనీలోకి వదిలేయడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటకైనా ఉన్నతాదికారులు స్పందించి చర్యలు తీసుకో వాలని లేకుంటే ఆందోళనకు దిగిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు నిరంజన్ రావు, జగదీశ్వర్ రావు రవీందర్ రావు జగన్నాధ రావు విజరు కుమార్ వెంకట్ రాజు పాల్గొన్నారు .