Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌్‌లో గల పిస్తాహౌజ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సి.హెచ్.మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజులు పాల్గొని కేక్ కట్ చేశారు. అంతకు ముందు మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈ.వి.సాగర్‌రావు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.