Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
మహిళల అభ్యున్నతికి, పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమానికి జీవితాంతం కషి చేసిన ఈశ్వరీ బాయి దళిత జన బాంధవి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీరమణ అన్నా రు. రవీంద్రభారతిలో తెలంగాణా భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో ఈస్వరీబాయి స్మారక ట్రస్ట్ అధ్వర్యంలో జె.ఈ శ్వరీబాయి 30 వ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిóగా డాక్టర్ రమణ ఈశ్వరీ బాయి స్మారక పురస్కారాన్ని ఆదాయపన్ను ల శాఖ పూర్వ సంచాలకులు ప్రీతి హరిత్ కు బహుకరించి మాట్లాడారు. ఈశ్వరీబాయి అధికారపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా పక్షం గా వారి సమస్యల పై నిర్భయంగా పోరాడారని గుర్తుచేశారు. ఆమె సూచించిన పలు సంక్షేమ పథకాలు నేటి ప్రభుత్వాలు అమలు చేస్తునన్నాయన్నారు. సాంస్కతిక పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి కె.శ్రీనివాస రాజు , టీఆర్ అండ్ బి ప్రధాన కార్యదర్శి విజయేంద్రయా, ప్రొఫెసర్ సుధారాణి తదితరులు పాల్గొన్న సభకు ససంచాలకులు మామిడి హరికష్ణ స్వాగతం పలికారు. డాక్టర్ జె.గీతారెడ్డి ఈశ్వరీ బాయి త్యాగనిరతిని వివరించారు.