Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ కుమ్మరి బస్తీకి చెందిన సతీష్ గౌడ్, అతని భార్య షాలినీ రెండు నెలల గర్భిణి. దంపతులిద్దరూ బుధవారం ఉదయం హైదర్ గూడలోని ఫెర్నాండెజ్ ఆసుపత్రికి చెకప్ కోసం వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ముషీరాబాద్ డిపోకు చెందిన ఏపీ28జడ్ 0017 నెంబర్ గల బస్సు కోఠి నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఈక్రమంలో హిమాయత్‌నగర్ 'వై' జంక్షన్ వద్ద వేగంగా వస్తూ కుడివైపు బైక్ పై వెళ్తున్న ఇద్దరు దంపతులను ఢ కొట్టింది. దీంతో ఇద్దరు అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో భార్య షాలిని తీవ్రంగా గాయపడింది. వెంటనే అక్కడి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేష్ ఓ అంబులెన్స్ సహాయంతో హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా బస్సు నడిపిన మహబూబ్‌నగర్ జిల్లా, షరీఫ్ పూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ కె.మల్లన్న ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చందర్ సింగ్ తెలిపారు.