Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
కరోనా నేపథ్యంలో యాక్టివ్ ఇన్పెక్షన్‌ను కనుగొనేందుకు రూపొందించిన తమ విట్రోస్ 3600, విట్రోస్ 5600, విట్రోస్ ఎక్స్‌టీ 7600 సిస్టమ్స్‌పై విట్రోస్ సార్స్ కొవిడ్ యాంటీజెన్ టెస్ట్‌ను ఆర్థోక్లినికల్ గయాగ్నోస్టిక్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆర్థో క్లినికల్ డయాగ్నోస్టిక్స్ చైర్మెన్, సీఈఓ క్రిస్ స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో మందికి ఒకే రోజు పరీక్ష నిర్వహించడం, అదే రోజు ఫలితం అందించడంలో ఈ ఆర్థో బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. గంటకు 130 టెస్టులు నిర్వహిస్తుందని తెలిపారు. చేయాల్సి పరీక్షలు, సరఫరా కొరతలు, ఫలితాల్లో జాప్యం వంటి వాటిని పరిష్కరించడంలో హాస్పిటల్స్, రెఫరెన్స్ ల్యాబ్‌లకు తోడ్పడుతుందన్నారు. అలాగే వేగవంతమైన, ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుందని చెప్పారు. ఆర్థో కొవిడ్-19 యాంటిజెన్ టెస్టు అనేది అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ ( ఈయూఏ) పొందిన మొదటి హై వాల్యూమ్ టెస్ట్ అనీ, భారతదేశంలో కూడా అత్యవసర విభాగానికి సీడీఎస్ సీఓ అనుమతించిందని తెలిపారు. ఇప్పుడు టీకాల కార్యక్రమం మొదలైనప్పటికీ, కొవిడ్-19ను ఎదుర్కోవడంలో భాగంగా భారీ ఎత్తున ప్రజలకు టెస్టింగ్ చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉందన్నారు. ఆర్థో యొక్క ఖచ్చితమైన హై వాల్యూమ్ కొవిడ్-19 యాంటీజెన్ టెస్టు అంతర్జాయంగా ఈ వైరస్‌ను ఉదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.